ఎంత కాలం మోసం చేస్తారు?
`శాసించే స్థాయిలో రెడ్డీలు?
`ఎదురుచూసే స్థితిలోనే ఎల్ల కాలం బడుగులు?
`రెడ్డిలలో వాళ్లలో వాళ్లకు పడకపోయినా వాళ్లే హీరోలు?
`పైకంతా కయ్యం…లోలోన నెయ్యం!
`బడుగులను మోసం చేసేందుకే ఈ పగటి వేషాలు?
`అమెరికాలో చెట్టాపట్టాలు…రాష్ట్రంలో ఎడమొహం, పెడమొహాలు!
`ఆ రెడ్డి, ఈ రెడ్డి పగలు తిట్టుకుంటారు…? రాత్రి అలాయ్ బలాయ్ ఇచ్చుకుంటారు?
`జగ్గారెడ్డికి టిక్కెట్టు కట్ చేయగలరా?
`ఉత్తమ్ ను పక్కన పెట్టగలరా?
`పని చేసే పొన్నాల పనికి రాడా? కయ్యాల మారి రెడ్లంతా గెలుపు గుర్రాలా?
`అద్దంకికి అడుగడునా అడ్డంకులే!
`దాసోజు కూరలో కరివేపాకే?
హైదరాబాద్,నేటిధాత్రి:
అయితే ఆ రెడ్డి, లేకుంటే ఈ రెడ్డి, ఏ రెడ్డైనా సరే…పెత్తనానికి అందరు రెడ్డీలు ఎవ రెడీ…ఇదేనా రాజకీయం…ఇదేనా సిద్ధాంతపరమైన చాణక్యం…ఇదేనా అధికారంలోకి రావాలని చూసే వారి పనితనం…స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడుస్తున్నా, ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ బడుగులను రాజ్యమేలనిచ్చిందో చెప్పాలి. ఇచ్చారా అంటే ఇచ్చాం…మ మ అనిపించామా? అంటే అనిపించాం…ఆ వెంటనే దించేశాం..ఇంతకన్నా చెప్పుకోవడానికి ఏముంది? ఇకనైనా బడుగులకు పెద్ద పీట వేస్తామని చెప్పడానికి ఏముంది? ఆది నుంచి చూసినా అదే లెక్క…భవష్యత్తులో కనిపించేందంతా అదే లెక్క…రెడ్డి లేని లెక్క…కాంగ్రెస్‌లో ఉత్త లెక్క…ఆఖరుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి వున్నా సరే….కాంగ్రెస్‌కు పెద్ద లెక్కే కాని, ఏ బడుగుకు అవకాశం ఇవ్వాలన్న మనసురాని లెక్క..? పేరుకు కాంగ్రెస్ పార్టీ బడుగులంతా కాంగ్రెస్ వైపే అంటూ మహా గొప్పగా చెప్పుకుంటారు…పచ్చి అబద్దాన్ని నిజమని ప్రచారం చేసుకుంటారు?…ఎస్సీ, ఎస్టీ, బిసిలకు పదవులు పంచడంలో కాదు…వారిని నమ్మించడంలో, ఓట్లేయించుకోవడంలో , గెలిపించడంలో, కుర్చీలలో కూర్చోబెట్టడంలో మాత్రమే పేదలంతా కాంగ్రెస్ వైపు…కాని అధికారంలోకి వచ్చాక పెత్తనం చేయడంలోనూ, అధికారం కొనసాగించడంలోనూ బడుగులంతా కాంగ్రెస్‌కు ఆమడ దూరమే…? బడుగులకు అది చేశాం…ఇది చేశాం…ఎంతో చేశామని చెప్పడం తప్ప, ఈసారి పదవులు బడుగులకే ఇస్తాం…ముఖ్యమంత్రిని వారినే చేస్తాం..ఇంత కాలం బడుగులు మోసిన పల్లకీలు మేం మోస్తామని ఏనాడైనా రెడ్లు చెప్పారా? ఏ ఒక్కరైనా చెప్పినట్లు చూపిస్తారా? చూపించలేరు…ఎందకంటే కాంగ్రెస్‌లో బడుగులకు న్యాయం అన్నది నేతి బీరకాయల్లో నెయ్యింత అబద్దం.
ఆది నుంచి అంతే…శాసించే స్ధితిలోనే రెడ్డీలు…
ఎదురు చూసే స్ధితిలో ఎల్ల కాలం బడుగులు. సామాన్య ప్రజలంతా కలిసి పోరాటం చేసి, నిజాం నుంచి తెలంగాణను విముక్తి చేస్తే అధికారంలోకి వచ్చింది బూర్గుల రామకృష్ణారావు బడుగుల నాయకుడు కాదు…? ఆ పై ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటైనా తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, ఇలా చెప్పుకుంటూ పోతే ఆఖరు కిరణ్‌కుమార్ రెడ్డి దాక కాంగ్రెస్‌లో అంతా వాళ్లే…? తెలంగాణ వచ్చాక వాళ్లే….! కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రకటిస్తుందని తెలిసి సమయం నుంచి నేనేంటే నేనే…నాకంటే సీనియర్ ఎవరున్నారంటూ పిల్ల పుట్టకముందే కుల్ల కుట్టి పెట్టుకున్నట్లు జానారెడ్డి నేనే సిఎం అని ప్రచారం చేసుకున్నారు. కాని తెలంగాణ వస్తే బడుగుల్లో ఎవరినో ఒకరే సిఎం చేస్తామని ఏ ఒక్క రెడ్డి చెప్పలేదు. పదువులు ఎవరికి చేదు అంటూ రెడ్డీ నాయకులు వెకటకారం చేసినట్లు తెలంగాణ ప్రజలకు గుర్తు… అంతే కాదు నేనే సిఎం. అని ఏ బిసి, ఎస్సీ, ఎస్టీ నాయకుడు చెప్పుకోలేపోయారు? కాని నేనే సిఎం అని జానారెడ్డి ప్రకటించుకున్నారు. ఇదే అసలు చమ్మక్కు…?ఇక తెలంగాణ వచ్చాక కాంగ్రెస్‌లో మళ్లీ రెడ్డిల పెత్తనమే సాగుతోంది. ఏ ఒక్క ఎన్నికల్లో పార్టీని గెలిపించలేకపోయినా ఉత్తమ్ కుమార్ రెడ్డిని వద్దన్నా కొనసాగించారు. తెలంగాణ సమాజమంతా ఉత్తమ్ వల్లనే ఇంత నష్టం అన్నా ఆయన్నే కొసాగించారు. ఆయనే ఇక చాలు…ఈ పదవి నేను చేయలేను, మోయలేను అంటే కూడా పక్కన పెట్టలేదు… మరో బలహీన వర్గాల నేతలకు పిసిసి ఇవ్వలేదు. పైగా ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత పిపిసి పదవికి నేనంటే నేనే అర్హడిని అంటూ అటు జాగ్గారెడ్డి, ఇటు కోమటి రెడ్డి…? మధ్యలో రేవంత్‌రెడ్డి….ముగ్గురూ రెడ్డీలే గాని, అందరం కలిసి బడుల నేతను పిపిసి అధ్యక్షుడిని చేద్దామని ఏ ఒక్క రెడ్డి నాయకుడైనా ముందుకొచ్చారా? రెడ్డి రాజ్యం రావాలనే అంటున్నారు గాని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బడుగులను ముఖ్యమంత్రిని చేస్తామంటున్నారా? అనరు…? అనలేరు??
అదేంటో గాని వాళ్లలో వాళ్లకు పడకపోయినా వాళ్లే హీరోలు…మిగతా వాళ్లంతా జీరోలు…
రాష్ట్రంలో ఎనభై శాతమున్న బడుగులంతా ఓట్లు వేయడానికి, పట్టుమని ఐదు శాతం కూడా లేని రెడ్డిలు రాజ్యమేలడానికా? ఇదేనా సిద్ధాంతపరమైన న్యాయం…కాంగ్రెస్‌లో బడుగులకు చేస్తున్న న్యాయం…రెడ్డీ రాజకీయమంతా పైకి మాత్రమే కయ్యం …లోపంతా వియ్యం, నెయ్యమే వుంటుంది. అంటే వాళ్లు వాళ్లు కొట్లాడుకుంటుంటే మేమున్నామని బడుగులు ముందుకు రారు..పదవులు కోసం ఆలోచించరు…పైగా .బడుగులు ఇరు వర్గాలకు అండగా నిలిచేలా చీలిపోతారు….ఇది అసలు రెడ్డి రాజకీయం….బడుగులు ఒకరికొకరు కులాలుగా విడిపోవాలి. రెడ్డి నాయకులకు తోడుగా నిలవాలి…అందుకే బడుగుల్లో ఏకతా కనిపించొద్దు. అంటే ఎప్పుడూ రెడ్డీలంతా ఏదో ఒక విదాదం రేపుతూ వుండాలి. ఆ వివాదం ఎప్పుడూ సమాజంలో నలుగుతూ వుండాలి…వాళ్లు దాన్ని ప్రచారం చేసుకుంటూ వుండాలి…ఎన్నికలదాకా సాగదీస్తూ వుండాలి. బడుగులు మేం నాయకులమనే అన్నది మర్చిపోయేలా వుండాలి…పెత్తనం అందడం మొదలయ్యాక రెడ్డీలంతా ఒకటే అని ప్రచారం చేసుకోవాలి…బడుగులకు చిన్న చిన్న పదవులు ఎరగా వేసి, ఎదగకుండా చేయాలి…ఇవన్నీ బడుగులను మోసం చేసేందుకు రెడ్డీ నాయకత్వం వేసే పగటి వేశాలే తప్ప, నిజాలు కాదు..వాళ్ల మధ్య దూరం ఎప్పుడూ వుండదు…నటిస్తారంతే….మాది పాలి పగ అని బీరాలు పలుకుతారంతే…వాళ్లు వాళ్లు కొల్లాడుకుంటే పాలివాళ్లు…పక్కొడు ఇంటి మీదికొస్తే వాళ్లంతా ఒక్కంటి వాళ్లు…ఇదే రాజకీయంలో రెడ్డీలు అనాధిగా అనుసరిస్తున్నారు. బడుగులను ఎదకుండా చేస్తున్నారు…
రాష్ట్రంలో కలిసి, కలివిడిగా తిరిగే తీరిక లేని రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డిలు కలిసి విదేశాల్లో సంచరిస్తుంటారు..
.ఇద్దరూ కలిసి సభలు పంచుకుంటారు…మేమిద్దరం ఒక్కటే అని సంకేతాలు పంపుతారు…రాష్ట్రంలో మాత్రం నాకు నేనే…నీకు నువ్వే..అంటూ కలరింగులిస్తారు…ఇద్దరు రెడ్లు కయ్యం పెట్టుకుంటున్నారంటే అక్కడ ఏ బడుగు నేతకో మూడిరదనే అంటే ఏమిటో అనుకునేవారు….దూరం పోతే చెట్టాపట్టాలేసుకొని తిరిగి, రాష్ట్రంలో మాత్రం ఎడమెహం పెడ మొహమేసుకొని రాజకీయం చేస్తారు…రేవంత్ రెడ్డి నల్లగొండకు వెళ్లే ఎలా వస్తావని కోమటి రెడ్డి గుడ్లురుముతాడు…? అప్పుడే అనుకున్నారు…ఈ ఇద్దరి మధ్య లేని కయ్యం తెరమీదకు వచ్చిందంటే ఏదో బడుగునేతకు ఎసరొస్తుందని? అనుకున్నంత పనైంది? నల్లగొండలో తెలంగాణ ఉద్యమకారుడైన బడుగుల నేత అద్దంకి దయాకర్‌కు అడ్డంకులు సృష్టించడంలో ఇద్దరూ సఫలీకృతయ్యారు…అద్దంకి దయాకర్‌కు రేవంత్ రెడ్డి పుల్ సపోర్టులా కనిపిస్తుంది? కాకపోతే అది పైకి మాత్రమే అన్నది అద్దంకికి ఇప్పటికీ అర్ధం కాకుండా వుంది. రేవంత్‌రెడ్డిని కాదని, ఆయనకు తెలియకుండా కోమటి రెడ్డి ఎలా నిర్ణయం తీసుకుంటారు? ఎలా సప్పెండ్ అయిన నాయకుడికి కండువా కప్పి, పార్టీలోకి తెస్తాడు? ఈ మాత్రం రాజకీయం అర్ధంకానంత అమాయకులా తెలంగాణ ప్రజలు…గత ఎన్నికల్లో అద్దంకి విజయానికి అడ్డుపడిరది ఎవరో తెలియంది కాదు? అద్దంకి దయాకర్ ఓటమిని పక్కాగా టిఆర్‌ఎస్ ఎత్తుగడగా చిత్రీకరించింది ఎవరో తెలియందా? ఇప్పటికైనా రెడ్డీలు ఆడే రాజకీయం అద్దంకి దయాకర్‌కు అర్ధమైతే తప్ప, ఆయన సీటు ఆయనకు ఖరారు కాదు…లేకుంటే ఆఖరుకు అద్దంకిని కూడా కాదనుకోవడానికి రెడ్డీలు వెనకాడరు…అద్దంకిని ఆటలో ఆరటిపండును చేయుకుండా వుండరు…?
చేజేతులా చేతి గుర్తును నమ్మి, జాతీయ స్ధాయి నాయకులకు తెలంగాణకు వస్తే గుర్తొచ్చే దాసోజు శ్రవణ్‌కు ఈసారి కాంగ్రెస్ మొండి చేయి చూపుతందనడంతో సందేహం లేదు.
ఖైరతాబాద్ నియోజకవర్గంలో పిపిసి అధ్యక్షుడు చేపడుతున్న రెడ్డీల సమీకరణాలే ఇందుకు నిదర్శనం. ఉద్యమ కారుడైన దాసోసు శ్రవణ్‌కు టిఆర్‌ఎస్‌లో వున్నంత కాలం ఎంతో విలువ వుండేది. ఉద్యమ సమయంలో కేసిఆర్ వెన్నంటే వుండేవారు. కేసిఆర్ డిల్లీ వెళ్లే బృందంలో ప్రతిసారి దాసోసు శ్రవణ్ వుండేవారు. అలిగి అత్తవారింటికి, చెడి చెల్లింటికి వెళ్లొద్దంటారు. అలాంటిది ముఖ్యమంత్రి కేసిఆర్ మీద కోపంతో కాంగ్రెస్‌లో చేరారు. గత ఎన్నికల ముందు ఆ పార్టీకి అభ్యర్థులకు దిక్కులేక దాసోసుకు టిక్కెట్టు ఇచ్చారు. కాని ఈసారి ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో పిజేఆర్ కూతరు, విజయారెడ్డిని రంగంలోకి దింపనున్నారు. దాంతో దాసోసుకు హాండ్ ఇవ్వడానికే నిర్ణయించుకున్నట్లున్నారు. ఆ సయమంలో దాసేజుకు పార్టీ చెప్పేదొక్కటే వుంటుంది. పార్టీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీని చేస్తాం…? ఇంతకన్నా దాసోజు వినడానికి ఏమీ వుండదు? ప్రశ్నించడానికి అక్కడేమీ వుండదు? ఇదే మాట గతంలో టిఆర్‌ఎస్‌లో విని వుంటే ఈ పాటికి ఖచ్చితంగా ఎమ్మెల్సీ అయ్యేవారు. లేదా ఏదో ఒక పదవి అయినా లభించేది. ఇప్పుడు అటూ, ,ఇటూ కాకుండా స్వయంకృతాపరాధంలో చేతిలో చిక్కి విలవిలలాడుతున్నాడు. రెడ్డి రాజకీయం ముందు లేవలేక, నిలవలేక బడుగులకు అన్యాయం కాంగ్రెస్‌లో అని కూడా అరవలేని స్ధితిని తెచ్చుకున్నాడు. మాట కారి శ్రవణ్ పార్టీలో బాధ్యతలిస్తామని ఓ లెక్క చెప్పి, అసలు లెక్క నుంచి తప్పిస్తారు? చౌరస్తానే కళ్లముందు చూపిస్తారు?