గంగారం, నేటిధాత్రి :
మహబూబాబాద్ జిల్లా గంగారం మండల కేంద్రం లోని కొత్తగూడ టు ఇల్లందు కు వెళ్లే ప్రధాన రహదారి లో ఉన్నటువంటి వంతెన పైన ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భారీ గుంత ఏర్పడింది దింతో ప్రధాన దారి వెంట ప్రయాణం చేసే ప్రయాణికులకు ప్రమాదలు జరిగే అవకాశం ఉంది వంతెన పైన రోడ్డు పూర్తి గా వరద తాకిడికి కొట్టుకపోయింది ఈ భారీ గుంత ఏర్పడి చాల రోజులు అవుతున్న ఇప్పటివరకు ఆర్&బి అధికారులు ఇటువైపు తొంగి చూడలేదు ఇప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి వరదలకు దెబ్బతిన్నటువంటి వంతెన పైన ఉన్నా భారీ గుంత ను పూడ్చి వేయాలని అటు ప్రయాణికులు ఇటు మండల ప్రజలు వేడుకుంటున్నారు…