ప్రజాసమస్యల పరిష్కారం దిశగా పని చేయాలి

 

చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
బోయినపల్లి, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, సిరిసిల్ల జడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మాట్లాడుతూ… ప్రతి జనరల్ బాడీ మీటింగ్ జిల్లా అధికారులు పాల్గొనాలి.జనరల్ బాడీ అంటే తూతుమంత్రంగా వచ్చి వెళ్తున్నారు ఇలా ఇంకోసారి కాకుండ అధికారులకు ఆదేశించారు….
బోయినపల్లి మండల అభివృద్ధి ఇంకా ముందుకు సాగాలి రాష్ట్ర ప్రభుత్వం మనకు అండగా ఉంది..మిషన్ భగీరథ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను కోరారు…
ఆరోగ్య రహిత సమాజం కోసం మనము ముందుకు సాగాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో పల్లె ప్రగతి ద్వార గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధ్యమైంది.
ఏడు సంవత్సరాల క్రితం అంటువ్యాధులు వచ్చేవి కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా అంటు వ్యాధులు తగ్గిపోయాయి.
24గంటల కరెంటు కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే సాధ్యమైంది.
పల్లె ప్రగతి ద్వార గ్రామ పంచాయతీలకు నేరుగా ప్రతి నెల నిధులు వస్తున్నాయి.
ఈ నిధులు రావాలంటే గతంలో ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతు ఉండేవారు.కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.పెన్షన్లు ప్రతి నెల నేరుగా లబ్దిదారుల అకౌంట్లలో జమ అవుతున్నాయి.దేశంలో ఎక్కడా లేని విధంగా కళ్యాణ లక్ష్మి,ఆసరా పెన్షన్లు, రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు వంటి అనేక పథకాలు అమలు అవుతున్నాయి.దేశంలో ఎక్కడా లేని విధంగా ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి.మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచి నీళ్ళు వస్తున్నాయి.పల్లె దవాఖానాల ద్వారా పేదల ఆరోగ్యం కోసం పని చేస్తున్నాం.550కోట్లతో చొప్పదండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడం జరుగుతుందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!