తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల సంక్షేమానికి పెద్దపీట వేయనున్నదని, పోలీసులకు, వారి కుటుంభాలకు అన్ని విధాలుగా అండగా నిలువడానికి రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ది కార్యక్రమ ప్రణాళికలు రూపొందిస్తున్నదని, పోలీసులు విధినిర్వహణలో తమ కర్తవ్యాన్ని నెరవేర్చి ప్రజలకు రక్షణ కల్పించాలని తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మహ్మూద్‌అలీ అన్నారు. శనివారం స్మార్ట్ పోలీస్‌స్టేషన్ల సందర్శనలో భాగంగా ఆయన వరంగల్‌జిల్లాలో పర్యటించి పలు పోలీస్‌స్టేషన్‌లను పోలీసుల పనితీరును, పోలీస్‌స్టేషన్ భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు ప్రజలతో ఫ్రెండ్లీగా వ్యవహరించి ప్రజలకు భద్రత, భరోసా, విశ్వాసాన్ని కల్పించాలని ఆయన సూచించారు.
అనంతరం 4వ బెటాలియన్ నూతన పరిపాలన భవనంను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి కలెక్టర్ దయానంద్, వరంగల్ పోలీస్ కమీషనర్ డా.వి రవీందర్, అడిషనల్ డిజిపి అభిలాష బిస్తు,వరంగల్ ఈస్ట్‌జోన్ డిసిపి కేఆర్ నాగరాజు వరంగల్ పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండా ప్రకాశ్, వరంగల్ తూర్పు ఎమ్మేల్యే నన్నపునేని నరేందర్, వర్ధన్నపేట ఎమ్మేల్యే ఆరూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.