పేదల ఆరాధ్యులు

 

తరాలు మారినా జనం గుండెల్లో నవ్వుల రాజు రాజశేఖరుడు.

పేదల జీవితాలలో వెలుగులు నింపిన దేవుడు.

ఐదేళ్ల పాలనలో వెయ్యేళ్ల కీర్తి సంపాదించుకున్నాడు.

ఇప్పటికీ ప్రతి పథకంలో వైఎస్ఆర్ వున్నాడు.

తండ్రి ఆశయ సాధనే జీవిత లక్ష్యమైన తనయుడు జగన్.

వైఎస్ఆర్ కలలుగన్న సమాజ నిర్మాణంలో తనయుడు.

పేదల జీవితాలలో వెలుగుల కోసమే ఇద్దరూ…
సేవ చేయాలన్న భావన అప్పటికప్పుడు పుట్టే కాదు. తన ఆలోచనల పొరల్లో దాగి వున్న‌ మంచి మనసుకు తార్కాణం. చరిత్రలో గొప్పగా మిగిలిపోయిన వారి జీవితాలు ఒక్కసారిగా వెలుగులోకి రావు. ఉన్న ఫలంగా అన్నీ సమకూవు. ఇక్కడ వైఎస్ రాజశేఖర్ రెడ్డి , జగన్ విషయంలోనూ జరిగింది. సుదీర్ఘ కాలం పాటు ప్రజలకు సేవ చేసిన వ్యక్తి రాజశేఖరరెడ్డి. ఒక్క రూపాయికే వైద్యం చేసిన గొప్ప నాయకుడు. కాకపోతే అప్పటికి నాయకుడు కావాలని అనుకోలేదు. అవుదామన్న ఆలోచన రాజశేఖరరెడ్డికి లేదు. పేదల వైద్యుడిగా అతి కొద్ది సమయంలోనే ప్రజల మన్ననలు పొంది నాయకుడయ్యాడు. వైద్యుడిగా కొద్ది మందికే సేవ అందించగలుగుతున్నాను. ప్రజా ప్రతినిధిగా మరెంతో సేవ చేసే అవకాశం కోసమే రాజకీయాలలోకి వచ్చారు. ఇక తన తండ్రి ఆశయ సాధన కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజకీయాలలోకి వచ్చారు. రాజకీయంగా ఎదుర్కోవల్సిన అనేక అవరోదాలు ఇద్దరూ ఎదురుకున్నారు. నాయకుడుగా ఎదిగిన వైఎస్ఆర్ ఒక దశలో రాజారెడ్డి హత్య ఎంతో కుంగదీసింది. కాకపోతే రాజకీయాలలో ప్రజాసేవలో ప్రజల గుండెల్లో నిలిచిపోవాలని కసి పెరిగింది. అలాగే జగన్ విషయంలోనూ జరిగింది. ప్రజల ఓదార్పుతో జగన్ జన నాయకుడయ్యాడు. చరిత్రలో ఇలా ప్రజల గుండెల్లో తండ్రీకొడుకులు గూడుకట్టుకున్నారు. వైఎస్. రాజశేఖరరెడ్డి దేవుడయ్యాడు. జగన్ ప్రజల గుండెల్లో రాజుగా వెలుగొందుతున్నాడు. యుగకర్తలు అని కొనియాడబడుతున్నారు.
హైదరాబాద్‌, నేటిధాత్రి : నాయకుడు జనంలో నుంచి పుడతాడు. జగన్‌లాగా వుంటాడు. జనం కోసం బతుకుతాడు. జనమే తానై బతుకుతాడు. జనం కోసమే పరితపిస్తాడు. జనాన్ని జాగృతం చేస్తాడు. జనం కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. జనం కోసం జైలును కూడా లెక్క చేయలేదు. జనం కోసం అహర్నిషలు కృషి చేస్తాడు. ఎండనక, వారనక నడుస్తాడు. బాటసారిగా మారుతాడు. వారి సమస్యలు తెలుసుకుంటాడు. వారి మధ్యలోనే నిత్యం వుంటాడు. తనంటే జనమని, జనమంటే జగనని నిరూపించాడు. చిన్న వయసులోనే పట్టుదలకు పర్యాయ పదం నేర్పాడు. లక్ష్య సాధనకు మార్గం చూపాడు. యువతరానికి ఆదర్శమయ్యాడు. సమాజ సేవ కోసమే తన జీవితం అంకితం చేశాడు. జగన్‌ నేనే అన్న మాట తనని ఎంత ప్రభావితం చేసిందో ప్రపంచానికి చూపించాడు. జయించడానికి ఓపిక వుంటే చాలు, ప్రపంచం దాసోహమంటుందని నిరూపించాడు. విజయాన్ని సొంతం చేసుకున్నాడు. విజయవంతంగా పాలనలో సంక్షేమ రాజ్య భావనను రుచిచూపించాడు.యుగకర్తగా మారాడు. ఆయనే జగన్‌…ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి.
ఆ మూడక్షరాలు
జగన్‌ అన్న పదం మూడక్షరాలు. జనం అన్న పదాన్ని నరనరాన జీర్ణించుకున్నాడు. అందుకే జనమంటే ఆయనకు పిచ్చి. జనం కోసం పనిచేయడం ఆయనకు లక్ష్యసిద్ధి. జనమే తన జపంగా నవతరం కోసం తన యువతరం జీవితాన్ని త్యాగం చేసిన నాయకుడు. ప్రపంచంలో ఎక్కడా జల్లడ పెట్టి వెతికినా జనం కోసం తన జీవితాన్ని ఎంతటి కష్టమైనా చిరునవ్వుతో ఎదుర్కొన్నాడు. నిందలు, నీలాపనిందలెన్నివేసినా, చిరునవ్వు మాటన బిగపట్టి అదుముకున్నాడు. కన్నీరు సముద్రమైనా, ఇంకిపోయేలా చేసుకున్నాడు. పైకి తన గాంభీర్యం తప్ప, మరేం కనిపించకుండా చూసుకున్నాడు. ఆత్మాభిమానాకి పర్యాయమయ్యాడు. జనం మనిషి జగన్‌ అయ్యాడు. జగనే జనం, ఈ తెలుగు జగమే జగన్‌ అనిపించుకున్నారు. ఆయన ఆ మూడక్షరాలే ఆయన విజయం. ఎవరెస్టు శిఖరం.
తండ్రైనా, కొడుకైనా
దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి తన రాజకీయ జీవితం కూడా రహదారి మార్గంగా సాగలేదు. ఆయన వేసుకున్న దారిని ఆయన పదిల పర్చుకుంటూ, ప్రజల గెండెల్లో తనను పదిలం చేసుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతూ, తనపై పార్టీలో రోజు రోజుకూ నమ్మకం నింపుతూ, అనుకున్న మేర అవకాశాలు రాకపోయినా, అవాంతరాలెదురైనా, ఎక్కడా తొనకలేదు. ఒక దశలో వైఎస్‌ రాజశేఖరరెడ్డిని కూడా తన అభిమానులు, అనుచరులు కొత్త పార్టీ ఏర్పాటు చేయాలని కూడా ఒత్తిడి తెచ్చిన సందర్భాలున్నాయి. కాని ఆయన ఎక్కడా పార్టీ లైన్‌ దాటలేదు. పార్టీని వీడాలన్న ఆలోచనలు చేయలేదు. తనేంటో కాంగ్రెస్‌లోనే వుంటూ నిరూపించుకోవాలనుకున్నారు. పట్టుదలను తన చిరునామా చేసుకున్నారు. తొలిసారి ఎమ్మెల్యే అయిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి కొంత కాలం మంత్రిగా పనిచేసినా, అతి చిన్న వయసులో ఉమ్మడి రాష్ట్రంలో పిపిసి అధ్యక్షుడయ్యారు. కాని ఆయన పరిధి దాటలేదు. 1983లో ఆయన పిసిపి అధ్యక్షుడుగా వున్న కాలంలోనే ఎన్టీఆర్‌ వచ్చి ప్రభంజనం సృష్టించారు. తర్వాత 1989లో తెలుగుదేశం ఓడిపోయి, మళ్లీ కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినా, వైఎస్‌కు అవకాశం కల్సిరాలేదు. ఆ సమయంలో పిసిపి అధ్యక్షుడుగా వున్న మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత ఆయన పదవి కోల్పోవడానికి పరోక్షంగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి అన్న ప్రచారం చేసి, వైఎస్‌ను పార్టీకి దూరం చేయాలని చూశారు. కాని ఏనాడు వైఎస్‌ ఎక్కడా నోరు జారలేదు. తర్వాత నేదురుమల్లి జనార్ధన రెడ్డిని ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత కోట్లవిజయభాస్కరరెడ్డి సిఎం అయ్యారు. అయినా ఎక్కడా వైఎస్‌ తనకు అన్యాయం జరుగుతోందని, తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అనుకోలేదు. పార్టీని నమ్ముకొని ముందుకు సాగారు. 1999 ఎన్నికల సమయంలో మళ్లీ పిసిసి పగ్గాలు అందుకున్న వైఎస్‌ ఉచిత విద్యుత్‌ పధకం తెరమీదకు తెచ్చారు. కాని సొంత పార్టీ నేతలే ఎద్దేవా చేశారు. ఉచిత విద్యుత్‌ అమలు చేస్తే విద్యుత్‌ తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సిందే అని సొంత పార్టీనేతలు అన్నా పట్టించుకోలేదు. కాని ప్రజలు బలమైన ప్రతిపక్ష స్ధానం కాంగ్రెస్‌కు ఇచ్చారు. వైఎస్‌ను ప్రతిపక్షనేతను చేశాయి. దాంతో ఇక వైఎస్‌ ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. కాలం గడుస్తోంది. రెండోసారి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే విద్యుత్‌ చార్జీలు పెంచడంతో మొదలైన ప్రజా వ్యతిరేకతను తనకు అనుకూలంగా మల్చుకొని, రాజకీయంగా తన భవిష్యత్తును, రాష్ట్ర భవిష్యత్తును తన చేతిలోకి తీసుకోవాలన్న మధనం మొదలైంది. ఇంకేముంది రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి పాదయాత్ర మొదలు పెట్టారు. ఆయన పాదయాత్రను కూడా అడుగడుగునా సొంత పార్టీ నేతలే ఎదుర్కొనే ప్రయత్నం చేశారు. కాని ఆయన ఆగలేదు. వెనక్కితిరిగిచూసుకోలేదు. మాట తప్పనని, మడమ తిప్పనని ప్రజలకు చెప్పుకుంటూ, ముందుకు సాగారు. ఏ ఉచిత విద్యుత్‌ పధకాన్ని ఎగతాలి చేశారో వారి నోరు మూయించేందుకు అదే ఉచితవిద్యుత్‌ పేరుతో ప్రజలను నమ్మించారు. రైతు బాంధవుడుగా రైతు గుండెల్లో చిరస్ధాయిగా వైఎస్‌ నిలిచిపోయారు. అదే దారిలో నడిచిన వైఎస్‌ జగన్‌ రాజకీయం కూడా పూల పానుపు కాలేదు. దివంగత వైఎస్‌ కన్నా, ఎక్కువ ఒడిదొడుకులు, ఎదురు దెబ్బలు తినాల్సివచ్చింది. అసలు ఆ వయసులో జగన్‌ కాకుండా మరెవరు వున్నా, ఈ రాజకీయాలెందుకు, ఈ వయసులో నాకు ఈ ప్రజా సేవ ఎందుకు అని పారిపోయేవారేమో? కాని జగన్‌ అలా చేయలేదు. కాలాన్ని సైతం లెక్క చేయలేదు. ఎదురు తెన్నులను తనకు ఎలా అవకాశంగా మల్చుకోవాలో మధించారు.
తొలిసారి ప్రజాజీవితంలోకి జగన్‌
అదేంటో గాని వైఎస్‌ ముఖ్యమంత్రి కాకముందునుంచే జగన్‌ అనే పేరు యువతకు బాగా కనెక్టు అయ్యింది. వైఎస్‌ ప్రతిపక్షనేతగా వున్న కాలంలోనే జగన్‌ క్రేజ్‌ విపరీంతగా పెరిగింది. ఇలా ఒక ప్రతిపక్ష నేత కొడుకుకు యువతలో అంత క్రేజ్‌ వుండడం ప్రపంచంలోనే ఎవరూ లేరు. ఇక వైఎస్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్‌కు యువతలో విపరీతమైన ఫాలోయింగ్‌ పెరిగిపోయింది. కాని ఆయన ఎక్కడా కనిపించేవారు కాదు. కాని ఆయనకు అలా పేరు ఆదిలోనే కలిసొచ్చింది. వైఎస్‌ ముఖ్యమంత్రిగా వున్న కాలంలో ఏనాడు జగన్‌ సెక్రెటెరెయేట్‌ వచ్చిందిలేదు. హడావుడి చేసింది లేదు. కాని తర్వాత కాలంలో ఆయన ఎదుర్కొన్న ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. కాలం పగపట్టింది. ప్రకృతికి కన్ను కట్టుంది. జననేత వైఎస్‌ను జనానికి దూరం చేసింది. కానరాని లోకాలకు తీసుకెళ్లింది. కాని ఆయన జనం గుండెల్లోనుంచి ఏ దేవుడు దూరం చేయలేదు. ఆయన చేసిన సేవలు ఇంకా ప్రజలు మననం చేసుకుంటున్నారంటే ఆయన ప్రజలను ఎంత ప్రభావితం చేశారో అర్ధం చేసుకోవచ్చు. ఆ రోజుల్లో అంతగా ప్రజల గుండెల్లో గూడుకట్టుకొని పోయిన నేతల్లో ముందువరసలో వైఎస్‌ వుంటారు. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వందల మంది గుండెలు ఆగిపోయాయంటే ఆయనను ప్రజలు ఎంత గుండెల్లో పెట్టుకున్నారో అర్ధం చేసుకోవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ దేవుడి పూజ గదుల్లో వైఎస్‌ ఫోటోలు పెట్టుకొని పూజిస్తున్నారంటే ఆయన చేసిన సేవ ఎంత గొప్పదో అర్ధం చేసుకోవచ్చు. ఉచిత విద్యుత్‌ అన్న ఒక మాట నమ్మి, పార్టీని అధికారంలో కూర్చోబెట్టిన ప్రజలను ఏదో చేయాలి. ఎంతో చేయాలి. వారికి సంక్షేమ రాజ్యభావన ఎలా వుంటుందో చూపించాలనుకున్నాడు. ప్రజాస్వామ్య ఫలాలు ఎలా అందించాలో చూపించాడు. విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చాడు. పేదలకు విద్యను, వైద్యను రెండిరటీనీ ఏక కాలంలో అందుబాటులోకి తీసుకొచ్చి, ప్రజలకు దేవుడయ్యారు. రాజుగా ఆయన కీర్తిని చూడలేకపోయిన దేవుడు ప్రజలు ఎక్కడ తనను మర్చిపోతారో అని వైఎస్‌ను తీసుకెళ్లారు. పేదల దేవున్ని ఆ దేవుళ్లు ప్రజలకు దూరం చేశారు. కాని ఆయన కీర్తిని శాశ్వతం చేశారు.
విద్య
2004కు ముందున్న విద్యావిధానంలో సమూల మార్పులు చేసి, ప్రజలకు కొత్త తరం ఆవిష్కరణలకు మార్గం వేసిన ప్రజా రంజక పాలకుడు వైఎస్‌. ఆయన బాటలోనే నేడు జగన్‌ కూడా పయనిస్తున్నాడు. ఒకనాడు పేదలకు విద్య అందని ద్రక్ష. అందులోనూ ఉన్నత విద్య పేదలకు అందుబాటులోవుండేది కాదు. ఇంజనీరింగ్‌ విద్య అంటే సగటు పేద విద్యార్ధి కలలు చెదిపోయేవి. చదవాలన్న కాంక్ష, ఆకాంక్ష వున్నప్పటికీ పేదరికం ఉన్నత విద్యలకు దూరం చేసేది. దాంతో వృత్తి విద్యలకు పేద విద్యార్ధులు దూరమయ్యారు. ప్రభుత్వ రంగంలో వుండే అరకొర సీట్లలో మెరిట్‌ విద్యార్ధులు మాత్రమే చేరేందుకు అవకాశాలుండేవి. కాని ప్రపంచం అడ్వాన్స్‌ అవుతోంది. ప్రపంచమంతా ఐటి అన్న పదం ఉర్రూతలూగిస్తున్న కాలమది. అసలు ఇంజనీరింగ్‌ అంటే ఎంత సేపు బిల్డింగులు, కల్వర్టులు, రోడ్లు, ప్రాజెక్టులు అన్న అభిప్రాయం వుండేది. కాని ఇంజనీరింగ్‌ విద్యలో కూడా ఎన్నో రకాల కోర్సులున్నాయన్నది దివంగత నేత వైఎస్‌ తెచ్చిన ఫీజు రీఎంబర్స్‌ మెంటు విద్యావిధానం ద్వారా వెలుగులోకి వచ్చాయని చెప్పాలి. అదే ఆయన చేపట్టి వుండకపోతే, ప్రపంచంతో మనం పోటీ పడే పరిస్ధితి వుండకపోయేది. మన ఉభయ తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ఇలా వుండేదికాదు. ఎప్పుడైతే ప్రతి పేద విద్యార్ధి ఉన్నత విద్య చదువుకోవాలని అందించిన ప్రోత్సహం, రూపాయి ఖర్చు లేకుండా అంటు ఫీజు రీఎంబర్స్‌ మెంటుతోపాటు, విద్యార్ధులకు మళ్లీ ప్రత్యేకంగా స్కాలర్‌షిప్‌లు ఇవ్వడంతో రూపాయి చేతినుంచి ఖర్చులేకుండా కొన్ని లక్షల మంది ఇంజనీరింగ్‌ విద్యను అభ్యసించారు. కొన్ని లక్షల మంది నేడు ఐటి నిపుణులుగా విదేశాలలో జీవనం సాగిస్తున్నారు. బంగారు భవిష్యత్తును చూస్తున్నారు. గ్రామాల్లో నిరుపేద జీవితాలు అనుభవించిన ఎంతో మంది ఐటి నిపుణులు ఇప్పుడు విదేశాలలో కూడా సొంతంగా కంపనీలు ఏర్పాటు చేసి, ఎంతో మందికి వారు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. వారి జీవన ప్రమాణాలు పెంచుకున్నారు. అదే దారిలో నడస్తున్న జగన్‌ అమ్మ ఒడిపేరుతో ఉన్నత విద్యావంతులకే కాకుండా, చిన్న పిల్లలకు కూడా ఏటా రూ.15వేలు అందిస్తూ, పేదలందరికీ ఉచిత విద్య కల్పన చేస్తున్నారు. ఇదీ స్పూర్తిదాయకమైన పాలన అంటే…
వైద్యం..ఆరోగ్యశ్రీ
అసలు ఆరోగ్య శ్రీ అన్నది ప్రజల జీవితాలతో పెనవేసుకొని పోయి, ఇంకా వందేళ్లయినా, తెలుగు జాతి ప్రజలు మర్చిపోలేని పధకం చరిత్రలో నిలిచిపోనున్నది. కొన్ని తరాలు గుర్తుపెట్టుకునే పథకంగా గుర్తింపు పొందింది. నేను రాను బిడ్డో అన్న పదం మూలంగా సామాన్యులకు వైద్యం అందక ఎంతో మంది గ్రామీణ ప్రజలు ఆరోగ్యాలను నిర్లక్ష్యం చేయడమో, లేక రోగాలు ముదిరి మీద పడుతున్నా వైద్యం చేయించుకునే స్ధోమత లేకనో ప్రాణాలు పోవడం అన్నది చూసి చలించిన ప్రజా వైద్యుడు వైఎస్‌ తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకం అమలు చేశాడు. ఎందుకంటే ఆయన స్వతాహాగా వైద్యుడు. వైద్య విద్య పూర్తి చేసుకున్న వైఎస్‌ రాజశేఖరరెడ్డి రాజకీయాలక రాకముందు, ఏర్పాటుచేసిన ప్రజా వైద్య శాలలో ఆయన వైద్యం చేసినందుకు తీసుకునే ఫీజు. రూపాయి. ఎలాంటి పరిస్ధితిల్లో ఒక పేషెంటు వచ్చినా కేవలం రూపాయికే వైద్యం అందించిన దేవుడు వైఎస్‌. అందుకు దేవుడు ఆయనను ముఖ్యమంత్రిని చేసిన తర్వాత ఆరోగ్య శ్రీ అనే పథకాన్ని తెచ్చి, ప్రజల ఆరోగ్యాలకు భరోసా కల్పించారు. ఎలాంటి వైద్యం కాని పెద్దపెద్దోళ్లు చేయించుకునే ఖరీదైన వైద్యం రూపాయి జేబునుంచి ఖర్చు చేసుకోవాల్సిన అవసరం లేకుండా, ఎంత పెద్ద ఆపరేషన్‌ అవసరమైనా ఉచితంగా వైద్యం అందించి, తిరిగి ఇంటికి వెళ్లడానికి దారి ఖర్చులు కూడా ఇచ్చి పంపించే ఏర్పాటు చేసిన గొప్ప మానవతా వాది వైఎస్‌. అందుకే ఇంకా తరాలైనా వైఎస్‌ ప్రజల గుండెల్లోనే చిరంజీవిగా వుంటారు. ఆయన ఆరోగ్య శ్రీ పధకం పుణ్యమా అని కొన్ని వేల కుటుంబాలు లబ్ధిపొందాయని చెప్పడంలో సందేహంలేదు. ఇక అత్యవసర వైద్య సేవలు కావాల్సివచ్చినప్పుడు అందుబాటులో ఎలాంటి వాహనం లేని గ్రామాల ప్రజలకు, ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే ఆసుపత్రులకు తరలించేందుకు, గర్భిణీ స్త్రీలు, గుండె సంబంధిత వ్యాధులకు అత్యవసర వైద్య చికిత్సలు అందేందుకు 108 వాహనాలు ఏర్పాటు చేయడంతో కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడబడ్డాయి. అంతేకాకుండా ఒకప్పుడు చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయాలంటే కొన్ని లక్షలు ఖర్చయ్యేవి. అలాంటి వైద్యం అందాలని చిన్నారులెవరైనా గుండె సంబంధిత వ్యాధులతో చనిపోకుండా చర్యలు తీసుకున్నారు. ఎంత ఖర్చైనా చేసేలా వెసులుబాటు కల్పించారు. దాంతో కొన్ని వేల మంది చిన్నారులు ఇప్పుడు బతికి ఆనందంగా జీవితాలు గడుపుతున్నారు. ఇలా వైద్య రంగంలో ఆయన తెచ్చిన మార్పులు, పేదలకు కార్పోరేట్‌ వైద్యం అందుబాటులోకి తెచ్చి పెదలకు దేవుడయ్యాడు. పేదల దేవుడయ్యాడు. రాజశేఖరుడు అమరుడైనా, దేవుడై పూజలందుకుంటున్నాడు.
గూడు నిర్మాణాలు` ఇందిరమ్మ ఇండ్లు
నిజంగా వైఎస్‌ పాలనా కాలం ఒక స్వర్ణయుగమని చెప్పాలి. ఎందుకుంటే ఆయన అధికారంలోకి వస్తూనే రైతులకు ఇచ్చిన మాటతోపాటు, విద్య, వైద్యం, పేదలకు గూడు సౌకర్యాలు కల్పించడం వల్ల సుమారు ఉమ్మడి రాష్ట్రంలో 35 లక్షల మంది కుటుంబాలకు పక్కా ఇండ్ల నిర్మాణం జరిగింది. తెలుగు రాష్ట్రాలలో ఏ ఊరికెళ్లినా, ఏ పట్టణానికి వెళ్లినా ఇందిరమ్మ కాలనీ అంటూ ప్రత్యేకంగా కొన్ని వందలాది ఇళ్ల నిర్మాణాలు జరిగాయంటే మాటలు కాదు. ఇప్పుడున్న పాలకులు కనీసం వందల ఇండ్ల నిర్మాణాలు చేయడానికి నానా రకాలుగా మాట్లాడుతుంటే, ఐదేళ్ల కాలంలో ధరఖాస్తు చేసుకున్న ప్రతి కుటుంబానికి ఇండ్లు ఇచ్చిన ఘనత వైఎస్‌ రాజశేఖరరెడ్డి. అదే బాటలో నడుస్తున్న జగన్‌ తన ఐదేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో 25లక్షల ఇండ్లు నిర్మించి పేదలకు అందిస్తానని చెప్పారు. ఇది స్పూర్తి. సంక్షేమ రాజ్యభావనకు తండ్రీ కొడుకులు ఆదర్శమూర్తులు. సంక్షేమ రాజ్య నిర్మాణానికి యుగకర్తలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *