పేదలను అభివృద్ధి చేయడమే ఈ ప్రభుత్వ లక్ష్యం
-ఎమ్మెల్యే శంకర్ నాయక్
మహబూబాబాద్,నేటిధాత్రి:సి.ఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బి.శంకర్ నాయక్.రాష్ట్రంలో ఉన్న పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వం లక్ష్యమని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అభిప్రాయపడ్డారు.శనివారం మహబూబాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అందచేసారు. నియోజకవర్గం లోని వివిధ గ్రామాలకు చెందిన అనారోగ్యానికి గురైన 12 మంది బాధితులకు మంజురైన ఐదు లక్షల ఎనభై వేల ఐదు వందల రూపాయల (5,80,500) చెక్కులను అందచేసారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డా.రామ్మోహన్ రెడ్డి, గోగుల రాజు, బుజ్జి వెంకన్న, మందుల రఘు, శంకర్, వెంకట్రాం, ఎలెందర్ మరియు తదితరులు ఉన్నారు.