మరోసారి నిరూపించుకున్న లోకేష్?
పాలించే యోగమే లేదు?
జనం దృష్టిలో ఆయన నాయకుడే కాదు?
ఎన్నికల్లో గెలిచిన చరిత్రే లేదు?
పోరాటం చేసే శక్తి లేదు?
తెలుగు బాషమీద సరైన పట్టే లేదు?
ప్రజా సమస్యల మీద అవగాహనే లేదు?
విద్యా వ్యవస్ధ మీద శ్రద్ద లేదు?
జన నాయకుడు ఎన్నడూ కాలేడు?
పార్టీ ఓడిపోయిన నాటి నుంచి జనంలోకి పెద్దగా వచ్చింది లేదు?
ఇంకా తండ్రి చాటు బిడ్డే….చంద్రబాబు వేలు పట్టుకొని నడిచే నాయకుడే…
ఇప్పటికీ తండ్రి వేలు పట్టుకుంటే తప్ప నడవలేని నాయకుడు. చెట్టు పేరు చెప్పుకున్నా కాయలమ్ముకోలేని నాయకుడు. అసలు పాలించే యోగమే లేని నాయకుడు. పాలించడానికి పార్టీలో పనికి రాని నాయకుడు…?రాష్ట్రం మీద అవగాహన లేని నాయకుడు. ప్రజలకు ఏం కావాలో తెలియని నాయకుడు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలియని నాయకుడు. ప్రస్తుతం రాష్ట్రంలో అమలౌతున్న పథకాల మీద అవగాహన లేని నాయకుడు. అసలు రాజకీయాలకే పనికిరాని నాయకుడు. ప్రజల నుంచి రాని నాయకుడు. ప్రజలు తిరస్కరించిన నాయకుడు. దొడ్దిదారిని పెత్తనం చేస్తున్న నాయకుడు. పేదల కష్టాలు తెలియని నాయకుడు. పేదలతో మమేకంకాలేని నాయకుడు. పేదల కన్నీళ్లు తెలియని నాయకుడు. ఐదేళ్లు మంత్రి పదవి వెలగబెట్టినా పేదల కన్నీళ్లు తుడిచేందుకు ప్రయత్నం చేయని నాయకుడు. వారసత్వంతో ముందు వరుసలో నిలుచిన నాయకుడు. పార్టీని భ్రష్టుపట్టించేదుకు మరెవరూ అవసరం లేని నాయకుడు. ఇవన్నీ ఎవరి గురించి అనుకుంటున్నారా? ఇవన్నీ ఎవరు అంటున్నారని అనుకుంటున్నారా? ప్రజలనుకుంటున్న మాటలు..ఆఖరుకు వాళ్ల పార్టీలోనే చెప్పుకుంటున్న నాయకుడు. .తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి లోకేష్ గురించి చెబుతున్న మాటలు. జనమంటే తెలియదు? అసలు పదవి అంటే తెలియదు? ప్రజాస్వామ్యమంటే ఏమిటో తెలియదు? రాజకీయం ఏమిటో అసలే తెలియదు? రాజకీయాలు ఎలా చేయాలో తెలియదు? ప్రజల వద్దకు ఎలా వెళ్లాతో తెలియదు? వారికి ఎలా అండగా నిలవాలో తెలియదు? అధికారంలో వున్ననాడే తెలియని నాయకుడు…జనానికి ఎప్పుడూ దూరంగా వుండే నాయకుడు. అసలు తెలుగుభాషే సరిగ్గా రాదు? తెలుగులోని యాసలు అసలేమిటో కూడా తెలియదు? ప్రాంతాల మీద అవగాహన లేదు. అసలు ఆయన పోటీ చేసే మంగళగిరి మీద పూర్తి స్దాయి పట్టులేదు. నాయకుల పేర్లే సరిగ్గా తెలియవు. ఇవి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు చాటుగా లోకేష్ గురించి చెప్పుకునే మాటలు? అందుకే స్ధానిక సంస్ధల ఎన్నికల సమయంలో పెద్దఎత్తున వైరల్ అయిన అచ్చెం నాయుడు వ్యాఖ్యలు ఎప్పుడూ సర్క్యులేట్ అవుతూనే వుంటాయి. లోకేష్‌ను తిట్టిన తిట్టు తిట్టకుండా అచ్చెన్నాయుడు తిట్టిన తిట్లు జనం వింటూనే వుంటారు. ఇదీ లోకేష్ తీరు..పనికి రాని తీరు..అవగాహన లేని తీరు…
జాతీ ఒక్కటే అయినా జాతకం బాగుండాలని పెద్దలందుకే అన్నారు. రాజకీయాల మీద బలవంతంగా రుద్దిన నాయకుడు లోకేష్. తెలుదేశం పార్టీ నందమూరి కుటుంబం చేతుల్లోకి వెళ్లకుండా చంద్రబాబు చేసిన విన్యాసంలో ఇష్టంలేని రాజకీయాలు నెరుపుతున్న నాయకుడు లోకేష్. ఇది కూడా నందమూరి అభిమానులు చెప్పుకునే మాట. ఇంతకీ సొంత పార్టీలోనే నచ్చని నాయకుడు, పని తనం లేని నాయకుడు. ప్రజా సేవ అంటే ఏమిటో తెలియని నాయకుడు ఎవరైనా వున్నారా? అంటే లోకేష్ అని కామిడీగా చెప్పుకుంటారు. ఆయన చదువు తెలుగు ప్రజల మధ్య జరగలేదు. ఆయన పరిజ్ఞానం ఆంధ్రప్రదేశ్ ప్రజల సేవకు పనికి వచ్చేలా లేదు. నాయకుడంటే ఎలా వుండాలి? నిత్యం ప్రజల్లో వుండాలి. ప్రజల కోసమే పని చేయాలి. ప్రజలను చైతన్యం చేస్తూ వుండాలి. కాని అవకాశాలు ముందు తన్నుకొచ్చినట్లు కలిసొచ్చినా లోకేష్ జనాల్లోకి వెళ్లింది లేదు. జనంతో లోకేష్ బేష్ అనిపించుకున్నది లేదు. ఎంత సేపు తండ్రి చాటు బిడ్డే. అవకాశం కలిసొస్తే, చంద్రబాబును చూసి జనం ఓట్లేస్తే కుర్చీలో కూర్చువడమే…ఇంతకన్నా లోకేష్‌కు తెలిసిందేమీ లేదు…జనమంటే ఆయనకు నమ్మకం లేదు. జనానికి ఆయన మీద కూడా విశ్వాసం లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం..తెలంగాణలో నివాసం ఇలా ఏ నాయకుడైనా వుంటారా? జనం నుంచి తిరుగుబాటు వస్తే, తప్ప ఇంత వరకు కుప్పంలో కూడా చంద్రబాబుకే ఇల్లు దిక్కులేదు. జనం తిడితే తప్ప చంద్రబాబు ఇల్లు కట్టుకోవడానికి సిద్ధం కాలేదు. వచ్చే ఎన్నికల్లో గెలవడం ఇక కష్టమే అన్నది తేలిపోయాక గాని చంద్రబాబు కుప్పం బాట పట్టలేదు. ఇక లోకేష్‌కు కూడా ఆంధ్రప్రదేశ్‌లో నివాసం లేదు. గతంలో ప్రతిపక్ష నేతగా వున్న వైఎస్ జగన్‌ను ఇదే లోకేష్ పలు మార్లు ప్రశ్నించారు. దాంతో జగన్ ఇల్లు కట్టుకున్నారు. అక్కడే వుంటూ వచ్చారు. మరి ఆ సోయి లోకేష్‌కు లేదు. ఇల్లు లేదు…ఈసారైనా గెలుస్తానన్న నమ్మకం లోకేష్‌కు అసలే లేదు. అందుకే మంగళగిరిలో ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచన కూడా లోకేష్‌లో లేదు.
ప్రతీ సారి తన గాలి తను తీసుకునే లోకేష్..అని జనం నవ్వుకుంటున్నారు. మొన్నటి పదవ తరగతి పరీక్ష ఫలితాల మీద ఆయన అవగాహన లేమి ఏమిటో బైటపటింది. ఎవరైన కష్టపడి చదువుకోవాలి అని చెప్పాలి. ఇష్టపడి ఎంత కష్టపడి చదువుంటే అంత వృద్ధిలోకి వస్తారని చెప్పాలి. కాని లోకేష్ ఏం ప్రచారం చేస్తున్నాడు…చదవకపోయినా పిల్లలను పాస్ చేయాలని చెబుతున్నాడు? ఒక ఆదర్శవంతమైన, విద్యావంతమైన సమాజ నిర్మాణం జరగాలని కోరుకునేవాళ్లు చెప్పాల్సిన మాటేనా? పాస్‌మార్కులు కూడా తెచ్చుకోలేని వారిని కూడా పాస్ చేస్తూ పోవాలన్న లాజిక్ ఎలా చెల్లుతుందో లోకేషే చెప్పాలి. అందుకే జూనియర్ ఎన్టీఆర్ మామ లోకేష్ చదువు మీద చేసిన కామెంట్లే అందుకు నిదర్శం. మన చదువుకు పునాది గట్టిగా వుండాలి. అందుకు కష్టపడి చదవాలి. సబ్జెక్టుల్లో ఆరితేలా వుండాలి. ఇప్పుడున్న పరిస్ధితుల్లో అంతర్జాతీయ సమాజంతో పోటీ పడేలా మన విద్యావ్యవస్ధ తీర్చిదిద్దబడాలి. ఇది నవతరం నాయకుడు అనుకునే వాడు చెప్పాల్సిన మాట. ఈ మధ్యే ఓ ఇద్దరు టీచర్ల సంబాషణ కూడా ఇదే చెప్పింది. గతంలో చంద్రబాబు కూడా పాస్ పర్సెంటేజీ పెరగాలని, అందర్నీ పాస్ చేయాలని ఆదేశాలిచ్చేవారట. అదే విద్యావ్యవస్ధ భ్రష్టుపట్టడానికి కారణమైంది. ఇలాంటి పప్పుసుద్ద సుబ్బన్న కూడా అదే చెబుతున్నాడు. ఉన్నత చదువులు విదేశాలలో చదువుకున్నానని చెప్పుకేనే లోకేష్ చెప్పాల్సిన మాటలేనా? ఇలాంటి నాయకుల మాటలతో ప్రభావితమై నాలుగు మార్కులు కలిపితే ఏమౌతుంది? అని పిల్లలు కూడా ప్రశ్నించేదాకా వచ్చింది. మేం మంచిగా చదువుతాం…పాస్ అవుతామని చెప్పాల్సిన పిల్లలు…నాలుగు మార్కులు కలిపితే మీ సొమ్మేం పోతుందా? అనేదాకా వచ్చారు. ఇది విద్యా సమాజానికి గొడ్డలి పెట్టు? మంచిది కాదు. విద్యార్ధుల్లో వున్న ప్రగతి మీద తీవ్ర ప్రభావంచూపుతుది. గతంలో ఒక్క మార్కుతో కూడా అనేక సార్లు ఫెయిల్ అయిన వాళ్లు కూడా ఎంతో మంది వున్నారు. అంతే కాని ఒక్క మార్కు కలిపితే పాస్ అవుతామని డిమాండ్లు లేవు. విద్యాశాఖ చేసిన తప్పుల మూలంగా విద్యార్ధులు మార్కులు నష్టపోతే సమాజమే ప్రశ్నించేది. విద్యార్ధి లోకం నిలదీసేది. కాని మాకు మార్కులు కలిపి, రాయకున్నా పాస్ చేయమని ఎవరూ గతంతో అడిగిన సందర్భం లేదు. ఇప్పుడు మన కళ్లముందు కనిపిస్తున్న లోకేష్ తప్ప…