తాగుబోతులకు అడ్డగా మారిన పల్లె ప్రకృతి వనం
చూచి చూడకుండా వదిలిపెట్టిన పల్లె ప్రకృతి వనం
బోయినిపల్లి:నేటిధాత్రి
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం మానువాడ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ఎన్నోవేల కోట్ల ఖర్చు చేసి, పల్లె ప్రకృతి వనం నిర్మాణం చేపట్టిన సందర్భంగా అధికారుల నిర్లక్ష్యం వలన పల్లె ప్రకృతి వనం చుట్టూ ఫినిషింగ్ జాలి ఉండగా,గుర్తుతెలియని వ్యక్తులు ఫినిషింగ్ జాలిని విరగొట్టడమే కాక పల్లె ప్రకృతి వనం లోపలికి వెళ్లే దారి గేటు లేనందున తాగుబోతులకు అడ్డగా మారింది.అధికారులు ఎవరూ పట్టించుకోక,చెట్లకు నీళ్లు అందిచక,చెట్లు ఎండిపోయి, విరిగి చెత్తాచెదరంతో పూర్తిగా కూడుకుపోయింది.పక్కనే దారి ఉన్నందున దారిగుంట వెళ్తున్న పత్రిక విలేఖరికి కనిపించినందున వెంటనే పోటోలు తీసి, గ్రామ కార్యదర్శి కి ఫోన్ చేయాగ ఫోన్ కట్ చేశారు.ఏపీవో సబితను పల్లె ప్రకృతి వనం సమాచారం గురించి వివరన కోరగా మా దృష్టికి ఏమీ రాలేదని చెప్పినారు.వెంటనే ఎంపీటీసీ ఐరెడ్డి గీతా మల్లారెడ్డికి సమాచారం ఇవ్వగా స్పందించి పల్లె ప్రకృతికి వచ్చి చూసి, మేము చాలా సార్లు, గ్రామకార్యదర్శితో చర్చించామని అన్నారు. ఎంపీఓ తిలక్ కు సమాచారం అందించగా 2,3 రోజులలో వచ్చి చూస్తానని తెలిపినారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే ఈ సమస్యను తీర్చాలని గ్రామ ప్రజలు, తదితరులు కోరుతున్నారు.