ఏ బి ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో డీఈవో గారికి వినతి పత్రం
ఏబిఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్
హన్మకొండ, నేటిధాత్రి:
ఈరోజు హన్మకొండ జిల్లా నగరం నడిబొడ్డున ఎలాంటి అనుమతులు లేకుండా నారాయణ వైట్ హౌస్ కో బ్రాంచి తో పాఠశాలను నిర్వహిస్తు విద్యార్థుల తల్లిదండ్రుల నుండి పాఠ్యపుస్తకాలు మరియు స్కూలు యూనిఫామ్ టై పేర్లతో విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తూ ఉంటే సంబంధిత విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు కావున సంబంధిత జిల్లా అధికారి తక్షణమే స్పందించి ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా మరియు స్కూల్ గ్రౌండ్ మరియు ఫైర్ సౌకర్యం లేకుండా పాఠశాల నిర్వహిస్తున్న నారాయణ విద్యాసంస్థలు పై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు..