నిందితుల అరెస్ట్ కోర్టులో హాజరు
దొంగలించిన సొత్తు స్వాధీనం
నిందితుల్లో ఇద్దరు మైనర్లు
నిందితుల అరెస్టుకు కృషిచేసిన పోలీసు సిబ్బందిని అభినందించిన ఎస్సై రవికుమార్
మంగపేట, : నేటిధాత్రి
మండలంలోని కమలాపురం సాయిబాబా ఆలయంలో గత పది రోజుల క్రితం దొంగతనానికి పాల్పడ్డ కమలాపురంకు చెందిన నిమ్మల వినయ్ కుమార్, ఇటుకల నిఖిల్ లతో పాటు మరో ఇద్దరు మైనర్ బాలులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు మంగపేట ఎస్సై జి. రవి కుమార్ ఆదివారం తెలి పారు. ఇందుకు సంబందించి ఎస్సై రవికుమార్ తెలిపిన ప్రకారం వివరాలు. గత పదిరోజుల క్రితం కమలాపురంలోని సాయిబాబా ఆలయంలో జరిగిన హుండీ దొంగతనం కేసులో నిందితులు కమలా పురం గ్రామంలోని పల్లె ప్రకృతి వనం వద్ద ఉన్నారనే నమ్మదగిన స మాచారం తమకు రావడంతో తాము తమ సిబ్బందితో అక్కడికి వెళ్ల గా అక్కడ కమలాపురంకు చెందిన నిమ్మల వినయ్ కుమార్, నిఖిల్ తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారని తెలిపారు. పోలీసులను చూసి నిమ్మల వినయ్ కుమార్, ఇటుకల నిఖిల్ లతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు పారిపోతుండగా వారిని వెంబడించి పట్టుకున్నామని తెలిపారు. పంచుల సమక్షంలో ఆ నలుగురిని విచారించగా కమలాపురం సాయిబాబా ఆలయంలో జరిగిన దొం గతనంతో పాటు గతంలో మరిన్ని నేరాలు చేశామని ఒప్పుకున్నారని ఎస్సై రవి కమార్ తెలిపారు. నిందితుల నుండి సాయిబాబా ఆల యంలో దొంగిలించిన హుండీ, పద్దెనిమిది వేల ఎనిమిది వందల ఎనబై రూపాయల నగదు, బజాజ్ డిస్కవరీ మోటార్ సైకిల్, 8 గ్రా ముల నల్లపూసల తాడు, 1 బంగారు బిళ్ళ, 7 బంగారు గొట్టాలు (14 గ్రాముల బంగారం) ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ర వికుమార్ తెలిపారు. కాగా సాయిబాబా ఆలయంలో జరిగిన దొంగతనం కేసులో నిందితుల అరెస్టుకు కృషిచేసిన హెడ్ కానిస్టే బుల్ సూర్యనారాయణ, కానిస్టేబుల్స్ ఆలం మోహన్ కుమార్, జి. రాజ్ కుమార్, ఎన్.నాగరాజు, డి. చంద్రమోహన్, ఎన్.సురేశ్, బి.భద్రు, సిహెచ్. ప్రసాద్ తదితరులను ఎస్సై రవి కుమార్ అభినందించారు.