తెలంగాణలో ఉద్యోగాల జాతర

 

ముందే చెప్పిన నేటిధాత్రి…
ప్రతిపక్షాలు ఊహించని ట్విస్టు!
నీటి గోసలు తీరాయి…
ఎండల్లో కూడా నీళ్లు దుంకుతున్నాయి…
రైతు మోములు వెలుగుతున్నాయి.
మన నిధులతో కాళేశ్వరమొచ్చింది.
మల్లన్న సాగర్‌ లాంటి రిజర్వాయర్లు వచ్చాయి.
బావుల్లో నీళ్లు, బోర్లఎల్లవోస్తున్నాయి…
రైతు బంధులందుతున్నాయి….
గ్రామీణరోడ్లు సైతం రెండు వరసలయ్యాయి…
ప్రతిపక్షాలు ఊహించనన్ని కొలువులు త్వరలో రాబోతున్నాయి…
తెలంగాణ యువతలో పండగ… తెలంగాణలో ప్రతిపక్షాలెందుకు దండగ?

ఆలోచన ఆచరణాత్మకంగా వుండాలి. నిర్ణయం నిర్మాణాత్మకంగా వుండాలి. అది కేసిర్‌ మార్గనిర్ధేశనంలా వుండాలి. అవును.. ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా సరైన సమయంలో సరైన నిర్ణయాలు చేయడం అన్నది ఒక్క కేసిర్‌కే సాధ్యం. ఇక తెలంగాణలో మరిన్న కొలువల జాతరకు శ్రీకారం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత లక్షాముప్పై మూడు వేల కొలువులు భర్తీ చేశారు. కాని ఏక కాలంలో ఎనభైవేలకు పైగా ఉద్యోగాల కల్పన కోసం ఏక కాలంలో వరుస నోటిఫికేషన్లు రావడం అన్నది తొలిసారి. ఇప్పుడే కాదు, ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఈ రకమైన ఉద్యోగాల కల్పన ఏనాడు జరగలేదు. కలలో కూడా ఊహించలేదు. తెలంగాణ వస్తే ఏమొస్తుందన్న వారికి బుధవారం శాసన సభలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ ప్రకటన కూడా మరొక సమాధానమనే చెప్పాలి. త్వరలో నోటిఫికేషన్‌ అన్న పదాన్ని చాలా మంది రాజకీయంగా వినియోగించుకోవాలని చూసినా, లాభం లేకపోయింది. గతంలో టిఎస్‌పిఎస్సీ ద్వారా వేలాది ఉద్యోగాల కల్పన జరిగినా ప్రభుత్వ లక్ష్యాలు, ప్రాధాన్యత క్రమాన్ని అనుసరించారు. ప్రతిపక్షాలు ఎన్ని రకాల విమర్శలకు దిగినా ప్రభుత్వం పట్టించుకోలేదు. కొట్లాడినవారికే తెలుస్తుంది పోరు విలువ. మోసి నోడికే తెలుస్తుంది కావడి బరువు విలువ. అని పెద్దలు ఊరికే చెప్పలేదు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ పదే పదే ఈ మాటను అడ్డదిడ్డం మాట్లాడేటోనిది కత్తా,నెత్తా అని అందుకే అంటారు. తెలంగాణ కొట్లాడితే తెలుస్తుంది. ప్రాధాన్యతాంశాలేమిటో? వాటి విలువేమిటో? వాటి అనుసరణలేమిటో? అనుభవాలేమిటో? నోరుంది కదా! అని మాట్లాడేవారికే తెలుస్తుంది? మాటలు కాదు. చేతలు కావాలి. కళ్ల ముందు కనిపించాలి. అభివృద్ధి ఆవిష్కరణ జరగాలి. అప్పుడే నిజానికి, అబద్దానికి దూరం తెలుస్తుంది. అధికారంలో వున్నంత కాలం ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు రూపాయి ఇవ్వమన్నా తలెత్తి చూడలేని, నోరెత్తి మాట్లాడలేని వాళ్ల అసలు రంగు ప్రజలకు ఏనాడో తెలిసిందే…
ముందే చెప్పిన నేటిధాత్రి: మన నీళ్లు మనకు రాని రోజులు. మన నిధులు మనకు ఖర్చు కాని రోజులు. మన నియామకాలు మనకు అందని రోజులు. అందుకే ముఖ్యమంత్రి కేసిఆర్‌ తన ఆచారణ, తెలంగాణ బంగారు తెలంగాణ ఆవిష్కరణ నీళ్లతో మొదలు పెట్టారు. మన నిధులతో ప్రాజెక్టులు కట్టారు. మన నియామకాలు పెద్దఎత్తున సమయం చూసి అందిస్తాడని నేటి ధాత్రి దిన పత్రికి ముందే చెప్పింది. వరుస క్రమంలో త్వరలో అందుతాయని చెప్పింది. నేటి ధాత్రి అక్షరం నిజరూపదాల్చే సమయం ఆసన్నమైంది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ నోట అదే మాట వెలువడిరది. ఇంత వరకు దేశంలో ఏ రాష్ట్ర్రంలో ఏక కాలంలో ఎనభైవేలు పైగా ఉద్యోగాల ప్రకటన చేసిన సందర్భం లేదు. ఏది చేసినా అది కేసిఆర్‌కే సాధ్యమని మరోసారి రుజువు చేశాడు. తెలంగాణ ఉద్యమం గుండెకాయ లాంటిదని, రాష్ట్ర సాధనతో దాన్ని మా చేతుల్లో పెట్టిన తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు తామే ప్రతిరూపమని కేసిఆర్‌ మరోసారి రుజువు చేశారు.
నీళ్లు` పరవళ్లు: ఆచరణాత్మక, గుణాత్మక, నిర్మాణాత్మక ప్రాధాన్యత లేకుంగా ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఏ పని చేయరు. ఇది ఇప్పుడే కాదు. తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టినప్పటినుంచి గమనిస్తే తెలుస్తుంది. ముందు ప్రజల మనోభావాలు తెలుసుకోవడానికి అప్పుడే అందివిచ్చన స్ధానిక సంస్ధల ఎన్నికలను వినియోగించుకున్నారు. ప్రజల్లో తెలంగాణ ఆకాంక్ష ఎంత బలంగా వుందో ముందు తెలుసుకున్నారు. అప్పటినుంచి నుంచి ఇక కేసిఆర్‌ వెనక్కి తిరిగి చూసుకోలేదు. 2002లో వచ్చిన స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ప్రజల ఆలోచన ఓటు రూపంలో తెలిసిపోరుంది. తెలంగాణ ఆకాంక్ష బలంగా వ్యక్తమైంది. గ్రామీణ ప్రాంతాలలో కూడా తెలంగాణ సాధన లక్ష్యం ఎంత బలీయంగా వుందో అర్ధమైంది. దాంతో పల్లెలను ముందు కదిలించాలని ముఖ్యమంత్రి కేసిఆర్‌ తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టారు. సహజంగా మన దేశ సమాజం వ్యవసాయ ఆధారిత జీవనం. ఏది జరిగినా ముందు రైతు నుంచే ఆలోచన మొదలవ్వాలి. టెక్నాలజీ రంగంలో దిగ్గజంగా చెప్పుకునే జపాన్‌ లాంటి దేశాల్లో కూడా రైతులకు ఏమాత్రం ఇబ్బంది కల్గినా ప్రభుత్వాలు కూలిపోతాయి. ఇది మనదేశంలోనూ అంతే. ముందు రైతులు సంతృప్తిగా వుండాలి. వారు సంతోషంగా వుండాలి. కాని తెలంగాణ రైతులు తెలంగాణ రాకముందు సంతోషంగా లేరు. ఆనందం అన్నది కనిపించింది లేదు. నీళ్లు లేవు. నిధులు లేవు. తెలంగాణ పల్లెల్లో చదువులు లేవు. కొలువులు లేవు. ఉపాధి లేదు. వ్యాపారం లేదు. పంటలు లేవు. పండగలు లేవు. ఎప్పుడూ మొగులకు మొహం పెట్టి చూడడం తప్ప చేసేదేమీలేదు. దాంతో ఊరొద్దు. ఊపిరితో వుండాలంటే ఈ పల్లె వద్దని వదిలేసి, పట్టణాలకు వలసలు పోయిన వాళ్లేంతో మంది తెలంగాణలో గోసను చూశారు. అందుకే తెలంగానలో ముందు నీళ్లు నడయాడాలి. కళ్ల ముందు నీళ్ల పరవళ్లు కనిపించాలి. రైతు కన్నీళ్లను కాకుండా పంట పొలంలో పారే నీళ్లను చూడాలి. ఇదే కేసిఆర్‌ మొదటి సంకల్పం. అదే నేడు ఆవిష్కృతమైన కాళేశ్వరం. తెలంగాణ భవిష్యత్తు తరాలకు వారసత్వం సంపదగా, దేశమంతా గొప్పగా చెప్పుకునేంతే గొప్ప జలయజ్ఞం కాళేశ్వరం. అలాంటి నీటి పరవళ్లు చూస్తుందని తెలంగాణ కలగనలేదు. కాని తెలంగాణ వచ్చింది. నీటి కాలువలు వచ్చాయి. పొలాలకు నీళ్లు పారుతున్నాయి. బావులు నిండుతున్నాయి. బోర్లు ఎల్లబోస్తున్నాయి. ఇవన్నీ సాక్ష్యాత్కారం కోసం నిధులు కావాలి.
మన నిధులు మనకే: నిధుల కోసం నాడు తెలంగాణ ఎమ్మెల్యేలు, మంత్రుల మాట ఒకప్పుడు చెల్లేదే కాదు. ఉమ్మడి రాష్ట్ర పాలకులు విదిల్చే మెతుకుల్లాంటి నిధులనే గొప్పగా అబ్బురపడి ప్రచారం చేసుకున్న కాలం. విజయవాడ హైవే అంటే ఒకప్పుడు ఎంతో గొప్పగా చెప్పుకునేవారు. అదే మన తెలంగాణలో అలాంటి రోడ్లుకు కేంద్రం ప్రభుత్వంలో ప్రధానిగా వున్న పి.వి. నర్సింహారావు పుణ్యమాని సికింద్రబాద్‌ నుంచి కరీంనగర్‌కు రాజీవ్‌ రహాదారి వచ్చింది. అంతకు మించి గొప్పగా చెప్పుకోవడానికి ఏదీ లేని రోజులవి. ఆఖరుకు తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వము అన్నంతదాకా వచ్చింది. పైగా రాష్ట్ర అభివృద్ధి పేరుతో జలయజ్ఞం కోసం హైదరాబాద్‌ పరిసరాల్లో వున్న ప్రభుత్వ భూములను అమ్మి మరీ సీమాంధ్ర ప్రాంత అభివృద్ధికి వెచ్చించారే గాని, తెలంగాణ కోసం ఏనాడు ఆలోచించలేదు. కాని నేడు మన రాష్ట్రం. మన పాలన. మన నిధులు. దాంతో నీటి పారుదల రంగంలో విప్లవాత్మకమైన మార్పులు. కలలో కూడా ఊహించని ప్రాజెక్టులు. కొత్తగా మల్లన్న సాగర్‌ లాంటి అపురూపమైన చెరువులు. ప్రపంచంలోనే అంతటి కెపాసిటీతో లేని నీటి రిజర్వాయర్లు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఏడేళ్లలో సాగురంగంలోనూ, నీటి పారుదల రంగంలోనూ అధ్భుతమైన విజయాలు సొంతం చేసుకున్న ఏకైక రాష్ట్ర్రం తెలంగాణ. అదే ఉమ్మడి రాష్ట్రంలో వుంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే వుండేది. ఒకప్పుడు ప్రధామంత్రి గ్రామీణ సడక్‌ యోజన పుణ్యమాని బాగు పడిన గ్రామీణ రోడ్లకు తెలంగాణ వచ్చాకే మహార్ధశ వచ్చింది. రెండు లైన్లతో ప్రతి పల్లెను కనెక్టు చేస్తూ రహదారులు ఏర్పడ్డాయి. వరంగల్‌ లాంటి ప్రాంతాలకు కూడా విశాలమైన రోడ్ల సౌకర్యం పెరిగింది. అంటే ఇదంతా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మూలంగా వచ్చిన అభివృద్ధి. మన నిధులు మనకే అన్నది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు కేసిఆర్‌ ఎందుకు పదేపదే ప్రజలను చైతన్యం చేసేవారో ఇదే తార్కాణం.
ఇక నియామాకాలు: చాలా మందికి తెలియని విషయమేంటంటే తెలంగాణ వచ్చాక సుమారు లక్షా ఏడు వేల ఉద్యోగాలను గుర్తించారు. అంతకు మించి ఉద్యోగాలు ఇచ్చారు. ముప్పై వేలకు పైగా పోలీస్‌ రిక్రూట్‌ మెంటు ద్వారా పెద్దఎత్తున ఉద్యోగ కల్పన జరిగింది. ఆ తర్వాత టిఎస్‌పిఎస్‌ ద్వారా సమారు ముప్పై తొమ్మిది వేల వరకు ఉద్యోగాలు భర్తీ చేశారు. వీటికి తోడు విఆర్వోలు, పంచాయితీ సెక్రెటరీల నియామకాలు కూడా జరిగాయి. ఇవే కాకుండా విద్యుత్‌ శాఖలో ఇరవై రెండు వేల ఉద్యోగాల రెగ్యులరైజేషన్‌ జరిగింది. సమారు ఏడు వేల వరకు వ్యవసాయ శాఖలో భర్తీలు జరిగాయి. ఒకప్పుడు ఉద్యోగాల భర్తీ అంటే కేవలం గ్రూపులు, డిఎస్సీలు మాత్రమే కనిపించేవి. తెలంగాణ వచ్చాక ఒక్క డిఎస్సీ తప్ప మిగతా ఉద్యోగాల కల్పన జరిగింది. కాని పెద్దఎత్తున ఏర్పాటైన గురుకులాలలో, మోడల్‌ స్కూళ్లలో అద్యాపక, ఇతర నియామకాలు జరిగాయి. అయినా తెలంగాణ సమాజంలో కొంత అసంతృప్తి వున్న మాట వాస్తవం. తెరాస రెండోసారి అధికారంలోకి వచ్చాక ఎలాంటి నోటిఫికేషన్‌ రాకపోవడంతో ప్రతిపక్షాలు రాజకీయం చేయడానికి అస్త్రం దొరికిందన్న సంతోషంలో ఇప్పటిదాకా వున్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ బుధవారం అసెంబ్లీలో చేసిన ప్రకటనతో ఏం మాట్లాడాలో అర్ధం కాక, దీనిపై రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఏది ఏమైనా ఒకేసారి ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఇన్ని ఉద్యోగాల భర్తీకి పూనుకుంటాడని ఊహించలేదు. గతంలో చెబుతూ వస్తున్నట్లు ఏ నలభై వేల ప్రకటన రావొచ్చని అనుకున్నారు. కాని వాళ్ల ఊహలు తలకిందులయ్యే ప్రకటన రావడంతో ప్రతిపక్షాలు ఇక తమ భవిష్యత్తు ఏమిటన్న మీమాంసలో పడ్డట్లే కనిపిస్తున్నాయి. దాంతో ఉద్యోగాలు భర్తీ అయినప్పుడు కదా? అన్న ధీర్ఘాలు తీస్తున్నారు. అయినా ఉద్యోగాలను స్వాగతించక తప్పని పరిస్ధితి ఎదురైనందుకు లోలోన మధనపడుతున్నారు. మళ్లీ ఈసారి కూడా తమ ఉనికి, పాత్ర గల్లంతే..నా? అనుకుంటున్నారు..ట!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!