ఎంపీ వద్దిరాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ ల నాయకత్వాన బీజేపీకి గుడ్ బై చెప్పిన స్థానిక నాయకులు
వాడవాడలా,గడప గడపకు వెళ్లి టీఆర్ఎస్ కు సంపూర్ణ మద్దతు కూడగట్టిన రవిచంద్ర, పూల రవీందర్
తుప్రాన్ పేట: చౌటుప్పల్ మండలం తుప్రాన్ పేటలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్,
ఎమ్మెల్సీ పూల రవీందర్ ల నాయకత్వాన బీజేపీకి చెందిన స్థానిక నాయకులు పలువురు టీఆర్ఎస్ లో చేరారు.తుప్రాన్ పేట రచ్చబండ వద్ద ఆదివారం ఉదయం ఎంపీ వద్దిరాజు, ఎమ్మెల్యే
మల్లయ్య, మాజీ ఎమ్మెల్సీ రవీందర్ లు స్థానికులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు.ఈ సందర్భంగా అక్కడే ఉన్న గంధం
సత్యనారాయణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన తాను బీజేపీని వీడి టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు తెలిపారు.ఎంపీ రవిచంద్ర వెంటనే ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా
ఆహ్వానించారు.ఆ తర్వాత వద్దిరాజు, రవీందర్ లు గ్రామంలో కాలినడకన వాడవాడలా తిరిగి మున్నూరుకాపుల గడప గడపకు వెళ్లి అందరిని ఆత్మీయంగా పలకరించారు.అనారోగ్యానికి గురైన వర్కూరి బాలకృష్ణను పరామర్శించారు,ఈ సందర్భంగా ఆయన సోదరులు మల్లేష్,రాజేందర్ లు బీజేపీకి గుడ్ బై చెప్పి గులాబీ కండువాలు కప్పుకున్నారు.అదేవిధంగా కాంగ్రెస్ నాయకుడు కేశెట్టి సత్తయ్య, బీజేపీకి చెందిన కేశెట్టి జంగయ్య,కంకణాల వెంకటయ్య, పగడాల చిన్న మల్లయ్య, పగడాల కృష్ణ, పగడాల శ్రీనివాస్,వర్కూరి జంగయ్య,ఆయన కుమారులు భానుచందర్,భరత్ కుమార్,సిపిఎంకు చెందిన పగడాల భిక్షపతి తదితరులు ముఖ్యమంత్రి కేసీఆర్ కు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.ఈ సందర్భాలలో ఎంపీ రవిచంద్ర వెంట తుప్రాన్ పేట,ఇనుగుర్తి సర్పంచ్ లు చక్రం జంగయ్య, రాంమూర్తి, మున్నూరుకాపు ప్రముఖులు ఆర్.వి.మహేదర్,కేశెట్టి మహేష్,గుండ్లపల్లి శేషగిరిరావు,జెన్నాయికోడే జగన్మోహన్ తదితరులు ఉన్నారు.ఈ సందర్భంగా “వర్థిల్లాలి వర్థిల్లాలి టీఆర్ఎస్ వర్థిల్లాలి”, “జిందాబాద్ జిందాబాద్ కేసీఆర్ నాయకత్వం జిందాబాద్”,”జై మున్నూరుకాపు జై జై మున్నూరుకాపు”,”కారు గుర్తుకే మన ఓటు” అనే నినాదాలు హోరెత్తాయి.