వరంగల్ నగరంలోని 26వ డివిజన్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వరంగల్ నగర మేయర్ గుండా ప్రకాష్‌రావు అన్నారు. మంగళవారం వరంగల్ నగర అభివద్ధిలో భాగంగా 26వ డివిజన్‌లో క్షేత్రస్థాయి పర్యటన చేసి శానిటేషన్, డ్రైనేజీ సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. నగర్ మేయర్‌తోపాటు బల్దియా కమీషనర్ ఎన్.రవికిరణ్, ఆరోగ్య అధికారి రాజారెడ్డి, బల్దియా వింగ్ అధికారులతో కలసి 26వ డివిజన్‌లోని ఇంతేజార్‌గంజ్ పోలీస్‌స్టేషన్ నుండి బట్టల బజార్, పాపయ్యపేట్ చమన్, కాకతీయ టాకీస్ వరకు పర్యటించారు. 26వ డివిజన్ పర్యటనలో సిసి రోడ్ల గుంతలను, డ్రైనేజీ సమస్యలను పరిశీలించారు. వర్షాకాలాన్ని దష్టిలో పెట్టుకుని డెంగ్యూ, మలేరియా వ్యాధుల నుండి ప్రజలు ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని బల్దియా అధికారులకు మేయర్ సూచించారు. గహ, భవన నిర్మాణాలు చేసుకునే నిర్వాహకులు రోడ్డుపై ఇసుక కుప్పలు పోయడం వల్ల డ్రైనేజీ కాలువ మూసుకుపోవడం, మురికినీరు రోడ్డుపై ప్రవహిస్తున్నందున పాదచారులు, వాహనదారులకు ఇబ్బందిగా మారడాన్ని గమనించిన మేయర్ వారిపై జరిమానా విధించాలని అధికారులను హెచ్చరించారు.
ఎన్నికల కోడ్ అమలులో ఉండటం వలన అభివద్ధి పనులు చేయలేకపోయామని చెప్పారు. ఇప్పటి నుండి ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మేయర్ అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, కార్యకర్తలు, బల్దియా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.