జిల్లాలో కంటి వెలుగును సద్వినియోగం చేసుకుంటున్న ప్రజలు.

ఏం డోకా లేదు ఇలలోని అందాలను మేము చూడగలం… పేదల కళ్ళలో అద్దాలు ఒక వరం జిల్లాలో 20 బృందాలతో కంటి పరీక్ష లు కంటి వెలుగు కార్యక్రమము తో దురమౌతున్న కంటి సమస్యలు.

జిల్లాలో కంటి వెలుగును సద్వినియోగం చేసుకుంటున్న ప్రజలు.కంటి వెలుగుపై ప్రత్యేక శ్రద్ద కనబరుస్తున్న జిల్లా కలెక్టర్ 

యస్. క్రిష్ణ ఆదిత్య. 

ములుగు జిల్లా నేటిధాత్రి

 

అద్దాలు పొందిన వారి మాటల్లో ఆనందం చుక్కల మందులు ఇచ్చిండ్రు అద్దాలు ఇచ్చిండ్రు.

పెద్దల రమ వృత్తి కూలి , భర్త సాంబయ్య, శ్రీనివాస కాలనీ, ములుగు.

నా పేరు పెద్దల రమ నాకు ముగ్గురు అమ్మాయిలే కొడుకులు లేరు పెద్ద బిడ్డ బీటెక్ చదువుతుంది. ఇద్దరు బిడ్డలు తాడువాయి లో ఇంటర్ చదువుతున్నారు. దగ్గర చూపు కనపడకపోయేది కంటి వెలుగు వల్ల కంటి పరీక్షలు చేయించుకుంటే ఉచితంగా చుక్కల మందులు ఇచ్చిండ్రు అద్దాలు ఇచ్చిండ్రు అద్దాలు మంచిగా కనబడుతున్నాయి. అద్దాలు పెట్టుకుంటే సూదిల దారం పెడుతున్న… ఈ కంటి వెలుగు మంచిగ అనిపించింది.

 

ఉచితంగా కంటి అద్దాలు ఇచ్చారు గొల్లపల్లి స్వామి వృత్తి కూలీ

 

నేను బార్దన్ షాపులో పనిచేస్తా మా ఊరు బండారుపల్లి నాకు దగ్గర చూపు కనబడకపోయేది. ఇక్కడ కంటి వెలుగు పథకంలో ప్రతి ఒక్కరికి ఉచితంగా కంటి పరీక్షలు చేసి అద్దాలు కూడా ఇస్తున్నారని చెప్పడంతో ఇక్కడికి వచ్చా. డాక్టర్లు కంటి పరీక్షలు చేసి, దృష్టిలోపం ఉన్నట్లు గుర్తించి ఉచితంగా కళ్లద్దాలు ఇవ్వడంతో గతంలో కంటే ఇపుడు చూపు స్పష్టంగా కనిపిస్తున్నది.

 

ప్రభుత్వం మంచి కార్యక్రమం చేపట్టింది.

అచ్చ సాంబయ్య, తండ్రి లక్ష్మయ్య, బంజారా కాలనీ, ములుగు.

 

ప్రభుత్వం మంచి కార్యక్రమం చేపట్టింది ఉచితంగా కంటి పరీక్షలు చేసి అద్దాలు ఇవ్వడం చాలా సంతోషం. ప్రైవేటు దవఖానాలో ఐతే శానా పైసలు అయితుండే ఈ కంటి వెలుగు లో మందులు అద్దాలు ఉచితంగా ఇచ్చిండ్రు.

 

 శేష్మ అచ్ఛా దిక్రా. మేరా నామ్ హశ్మత్, 53 వయసు గడిగడ్డ, ములుగు.

 

శేష్మ అచ్ఛా దిక్రా నాకు ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు వాళ్ళ పెళ్లిళ్లు అయిపోయినాయి. నా భార్త చనిపోయాడు. నాకు కంటి సమస్య కొద్ది నెలల నుండి ఉంది. ప్రైవేటు ఆసుపత్రిలో చూపించుకోవడానికి డబ్బులు లేక చుపించుకోలేదు. కంటి వెలుగు కార్యక్రమము ప్రభుత్వం చేపట్టినదని చెప్పిడ్రు. ఉచితంగా మందులు ఇచ్చిండ్రు, అద్దాలు ఇచ్చిండ్రు. ఈ సర్కారు చల్లగా ఉండాలే. ఈ పథకంతో మాలాంటి పేదలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.

 

కంటి వెలుగు సూపర్ కే. శ్రీనివాస్, వయసు 46 దేవగిరిపట్నం.

 

కంటి వెలుగు సూపర్ నాకు పేపర్ చదువుతుంటే దగ్గర చూపు ఇబ్బందిగా ఉండేది. కంటి వెలుగులో కంటి పరీక్షలు చేయించుకుంటే ఉచితంగా అద్దాలు ఇచ్చిండ్రు ఇప్పుడు సూపర్ గా కనబడుతున్నాయి. కేసీఆర్ పెట్టిన కంటి వెలుగు పథకంతో కొత్తచూపు వచ్చినట్లు ఉంది. ఇంకా ఇలాంటి పథకాలు కెసిఆర్ సారు మరెన్నో చేపట్టాలి.

 

 కంటి వెలుగు గిట్లనే కొనసాగించాలే హైమావతి వయసు 45 గొల్లవాడ ములుగు

 

నాకు కంటి వెలుగు కొత్త చూపునిస్తోంది. రూపాయి ఖర్చు లేకుండా కంటి పరీక్షలు చేసి మందులు, కళ్లద్దాలు ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. కేసిఆర్ సారు కంటి వెలుగు గిట్లనే కొనసాగించాలే.

 

 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో దశ కంటి వెలుగు కార్యక్రమంలో ములుగు జిల్లా ప్రజలమాట ఇక ఏం డోకా లేదు కంటి దగ్గర చూపు.. దూరం చూపు… ఇబ్బందిగా ఉండే మాకు కంటి అద్దాలు కంటి వెలుగులో ఇచ్చినవి. పెట్టుకుంటే అంత మంచిగా కనబడుతున్నాయని అంటున్నారు స్వరాష్ట్ర ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా, వారి కళ్లలో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకాన్ని జనవరి 19 నుంచి జూన్ 15 వరకు 100 రోజుల కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేసేందుకు జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య పర్యవేక్షణలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పలు శాఖల అధికారులతో సంయుక్తంగా కలిసి శిబిరాల నిర్వహణకు ప్రణాళికలు రూపొందించి పకడ్బందీగా అమలు చేస్తున్నారు. జిల్లాలోని 9 మండలాలలో 174 గ్రామపంచాయతీలలో 3,30,031 జనాభా ఉండగా అందులో 18 సంవత్సరాలు పై బడిన జనాభా 2,08,000 మంది ఉన్నారు. వీరందరికి కంటి పరీక్షలు నిర్వహించాలని అధికారులు ప్రణాళికలు రూపొందించారు. జిల్లాలోని 15 పిహెచ్ సి లలో, 20 బృందాలను ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు జరిగిన కంటి వెలుగు పరీక్షల శిబిరాలలో 68059 మందికి పరీక్షలు నిర్వహించారు. కంటి పరీక్షలు నిర్వహిస్తున్న క్రమంలో అవసరం ఉన్న 9312 మందికి అక్కడిక్కడే రీడింగ్‌ గ్లాస్ లను సైతం అధికారులు అందించారు. ప్రత్యేక అద్దాలు అవసరం ఉన్న మరో 6155 మందికి అద్దాలను అందించేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ప్రతిపాదనలు పంపగా దానిలో నుంచి 1392 ప్రత్యేక అద్దాలను ములుగు వైద్య ఆరోగ్య శాఖకు పంపించారు. దీనిలో 661 ప్రత్యేక అద్దాలను అవసరం ఉన్న వారికి అందించారు. కంటి వెలుగు శిబిరాలలో పరీక్షలు చేయించుకుంటున్న ప్రజలకు అద్దాలతో పాటు ఎదురవుతున్న కంటికి సంబంధించి చిన్న చిన్న సమస్యలకు మందులతో పాటు కంటిలో వేసుకోడానికి చుక్కల మందులను సైతం పంపిణీ చేస్తున్నారు.

 

కంటి వెలుగుపై కలెక్టర్ ప్రత్యేక శ్రద్ద.

 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగును విజయవంతం చేసేందుకు ములుగు జిల్లా కలెక్టర్‌ ఎస్. క్రిష్ణ ఆదిత్య జిల్లాలో నిరంతరం పర్యవేక్షణ చేస్తూ జిల్లా వైద్యాధికారితో పాటు ఇతర శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులతో కంటి వెలుగు శిబిరాలను తనిఖీలు చేపడుతూ శిబిరాల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ నిర్ణీత గడువులోగా పూర్తయ్యేలా చర్యలు చేపడుతున్నారు. జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, వైద్య ఆరోగ్యశాఖతో పాటు అన్ని శాఖల అధికారులు పూర్తిస్థాయిలో కంటి వెలుగు నిర్వహణలో భాగస్వాములై కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళుతున్నారు.జిల్లాలో వేగవంతంగా కంటి పరీక్షలు.ప్రజల కంటి సమస్యలను తీర్చేందుకు చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా ములుగు జిల్లాలో ప్రజలు కంటి పరీక్షలకు వేగవంతంగా హజరవుతున్నారు. పీహెచ్‌సీ పరిధిలోని గ్రామాల్లో ప్రత్యేకంగా షెడ్యూల్‌ను రూపొందించుకొని జీపీ కార్యాలయాల్లో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ప్రజలకు సోమవారం నుంచి శుక్రవారం వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్య శిబిరాలకు విశేష స్పందన జిల్లాలో అత్యధికంగా దగ్గరిచూపు కనిపించక ఇబ్బందిపడే వారే అధికంగా ఉన్నట్లు శిబిరాలలో నమోదవుతున్న లెక్కలు చెబుతున్నాయి. 40 ఏళ్ల వయస్సు పైబడిన చాలామందికి దగ్గర చూపు కనిపించడం లేదని శిబిరానికి వస్తున్నారు. ఇలాంటి వారికి తక్షణమే వైద్య పరీక్షలు నిర్వహించి, రీడింగ్ గ్లాసెస్ అందజేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!