చేరికల నేతలకు షాకింగ్‌ న్యూస్‌?  నో టికెట్‌?

`సంతోష్‌జి చేసిన సర్వేలో వెల్లడ్కెన ఆసక్తికర విషయాలు?

`సిద్దాంతాలకు కట్టుబడిన నేతలకే టిక్కెట్లు?

` ఆర్‌ఎస్‌ఎస్‌ మూలాలున్న వారినే బరిలో దింపుదాం?

`బిజేపి బలపడినప్పుడు అరువు నేతలెందుకు?

`ఇంత కాలం పార్టీని నమ్ముకున్న వాళ్లకు టిక్కెట్లిద్దాం?

`బిఆర్‌ఎస్‌ నుంచి చేరిన వారి పూర్వోత్తరాలపై బిజేపి తవ్వకాలు ప్రారంభం!

`ఏ నేత ఎందుకు చేరాడన్న దానిపై లోత్కెన మధనం?

`బిఆర్‌ఎస్‌ నుంచి ఎందుకు బ్కెటకొచ్చారన్న దానిపై ఆరా?

` ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పెత్తనం… అసలు బిజేపి నేతలకు సంకటం?

`అరువు నేతలు గెలిచినా, ఓడిగా బిజేపిలోనే కొనసాగుతారన్న నమ్మకం లేదు?

` బిజేపి అధికారంలోకి రాకపోతే మాత్రం అసలే వుండరు?

`ఇంకో ఐదేళ్లు ఏ పదవి లేకుండా వుండలేరు?

`కచ్చితంగా ఎవరి దారి వారు చూసుకుంటారు?

`ఈటెల వెంట వచ్చిన వారి విశ్వసనీయతపై అనుమానాలు?

`బిజేపి ఆధిపత్య రాజకీయాలలో సమిధలు కానున్న ఈటెల అనుచరులు?

` టిక్కెట్లుపై ఆశలు వదులుకోవాలని పరోక్ష సంకేతాలు?

`ఈటెలనే హుజూరాబాద్‌ కు పరిమితం చేస్తున్నారు?

`ప్రాధాన్యత పక్కన పెట్టేశారు?

`అరువు నేతలు ఆగం కానున్నారు?

`రిటర్న్‌ టు పెవీలియన్‌ అని అనుకుంటున్నారు?

 హైదరాబాద్‌,నేటిధాత్రి:

కాలం చాలా విచిత్రమైంది. పాఠాలు,గుణపాఠాలు నేర్పుతుంది. ఎప్పుడు ఎవరికి ఏది నేర్పాలో ఆ సమయానికి ఖచ్చితంగా నేర్పుతుంది. పూలమ్మిన వారిని కట్టెలమ్మేలా చేస్తుంది. కట్టెలమ్ముకున్న వారిని కూడా అందలమెక్కిస్తుంది. అంతటి కాలానికి ఎదురీదడం ఎవరి వల్ల కాదు. కాలం కలిసొస్తుందని ఆశ పడడంలో తప్పులేదు కాని అత్యాశపరులకు కాలం మంచి సమాధానమైతే చెబుతుంది. ఇప్పుడు బిజేపిలో చేరిన అరువు నేతల పరిస్ధితికి అలాగే కనిపిస్తోంది. ఇది ఎవరో అంటున్న మాట కాదు. అరువు నేతల వల్ల తమ రాజకీయ జీవితాలు ఆగమౌతాయేమో! అనుకున్న నేతలు ఇప్పుడు సంతోషంగా చెబుతున్న మాట. ఎందుకంటే పార్టీలోకి వచ్చిన అరువు నేతలు బిజేపి బలంగా వుంది. భవిష్యత్తు వుంది. కేంద్రంలో అధికారంలో వుంది. అవకాశాలు వచ్చేందుకు అవకాశం వుంది. అరువు నేతలందరూ ఇప్పుడు కాకపోయినా రాబోయే కాలం బాగుంటుందన్న ఆశతో చేరిన వారే అని అందరికీ తెలిసిందే..అదే ఇప్పుడు చేరిక పేరుతో చేరిన నేతలకు బిజేపి పెద్దల నిర్ణయాలు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టేలా వుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. జాతీయ స్ధాయిలో జరుగుతున్న దేమిటో అరువు నేతలకు కూడా ఇప్పుడిప్పుడే అర్ధమౌతోందన్నది కూడా చర్చ జరుగుతోంది. దాంతో ఆ నేతలకు ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గొయ్యి కనిపించి కుమిలిపోతున్నారని తెలుస్తోంది. ఇటీవల బిజేపి పెద్దలనుంచి అసల్కెన బిజేపి నాయకులకు అందుతున్న సమచారం మేరకు పార్టీలో ఎవరికి ప్రాధాన్యత కల్పించాలన్నదానిపై విసృతంగా సమీక్షలు చేస్తున్నారన్న విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీనికి తోడు సంతోష్‌ జీ లాంటి వాళ్లు చేయించిన సర్వేలలో కూడా ప్రజలు చెప్పిన అనేక విషయాల మీద కూడా పార్టీలో మధనం జరుగుతున్నట్లు సమాచారం. తెలంగాణలో బిజేపి బలం పెరిగిన తర్వాత ఇతర పార్టీల్లో పదువులు అనుభవించినవారు మళ్లీ పదవుల కోసం పార్టీలో చేరితే, అసలు బిజేపి వాదులకు నష్టం జరగదా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమైట్లు చెప్పుకుంటున్నారు. దాంతో బిజేపి కేంద్ర నాయకత్వం మల్లగుల్లాలు పడుతున్నట్లు పార్టీకి చెందిన నేతలు చర్చించుకుంటున్నారు. అసలు పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి పదవులు ఎందుకు ఇవ్వాలన్నదానిపై కూడా అనేక సూచనలు అందుతున్నట్లు సమాచారం. ఉనికే లేని చోట కొత్త నాయకత్వం వచ్చి ఊపు నిచ్చిందనుకుంటే వేరు. కాని పార్టీ బలపడిన తర్వాత వచ్చిన నేతలతో ఒరిగింది లేదు. కొత్తగా పార్టీకి బలమొచ్చింది లేదన్న వాదనలే వినిపిస్తున్నాయి. ఇక్కడ మరో బలమైన వాదన కూడా కేంద్ర స్ధాయిలో వినిపిస్తోంది. కొత్తగా చేరిన నేతలెవరు పోరాటాలు చేస్తున్న సందర్భమేమీ లేదన్న విషయాలు అధిష్టానం దృష్టికి వెళ్తున్నాయి. కొత్తగా చేరిన నేతలు ఎక్కడిక్కడ వారికి ఎంతో బలముంటే ఆయా స్ధానాల్లో ఎందుకు ఉద్యమాలు చేయడం లేదు. ప్రజల దృష్టిని ఎందుకు మరల్చడం లేదు. తెలంగాణ ఉద్యమం చేసిన అనుభవం వున్న నేతలుగా చెప్పుకుంటన్న వాళ్లు ఇంత కాలం చేసిన పోరాటాలేవి? రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి సాధించిన విజయాలేవి? అన్న ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయట. అందుకే బిజేపి కేంద్ర నాయకత్వం చేయించిన సర్వేలలో పార్టీకి క్యాడర్‌ చెప్పిన అనేక విషయాలను తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అనుసరించాలని నిర్ణయం తీసుకుంటారన్న సంకేతాలు అందుతున్నాయి. 

బిజేపి ఎంత దూకుడు ప్రదర్శిస్తున్నట్లు కనిపిస్తున్నా ఈసారి తెలంగాణలో అధికారంలోకి వస్తున్న నమ్మకం బిజేపి పెద్దలకే లేదు. 

అందుకే ఈ ఎన్నికల్లో మరింత బలపడి వచ్చే 2029 ఎన్నికల్లో కుంభస్ధలాన్ని కొట్టాలన్న ఆలోచనతో వుందట. ఎందుకంటే బిజేపి ఆది నుంచి ఇలాంటి స్కెచ్‌లు వేయడం, ఆచరించడం, గెలిచి చూపించడం అలవాటే. ఇప్పుడు కూడా దక్షిణాదిన అదే ఫార్ములా అనుసరించాలని చూస్తున్నారట. అందులో భాగంగా తాజగా కర్ణాటకలో జరిగే ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకొని కూడా ఎలా ముందుకు సాగాలన్నదానిపై కూడా పార్టీ శ్రేణులకు పూర్తి క్లారిటీ ఇచ్చే అవకాశాలున్నాయి. అంతే కాకుండా వచ్చే ఎన్నికల్లో బిజేపి సిద్దాంతాలు, ఆరెస్సెస్‌ భావ జాలానికి కట్టుబడి పనిచేస్తున్న సీనియర్లకే పార్టీ టిక్కెట్లు ఇవ్వాలని కేంద్ర నాయకత్వం యోచిసున్నట్లు తెలిసింది. ముఖ్యంగా ఆరెస్సెస్‌ మూలాలున్నవారినే ఎన్నికల బరిలో దింపాలని పార్టీ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు చెప్పుకుంటున్నారు. ఇంత కాలం పార్టీని నమ్ముకొని సేవ చేసిన వారికే టిక్కెట్లు ఇద్దాం. దాంతో కష్టపడిన నేతలకు పార్టీ టిక్కెట్లు అన్న సంకేతాలు వెళ్తాయి. లేకుంటే ఎంత కష్టపడినా , కొత్తగా వచ్చిన వారికి పెద్ద పీట వేసేది వుంటే మేం కష్టపడడం ఎందుకున్న నిస్తేజం వారిలో ఆవహిస్తుంది. పైగా డబ్బున్న నేతలు, అరువు నేతలే అక్కరకు వస్తారా? అన్న ప్రశ్నలే మిగులుతాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే అరువు నేతలు పార్టీలో చేరినప్పుడు ఇచ్చిన భరోసాను కాదనలేనప్పుడు, పొమ్మన లేక పొగ ఎలా పెట్టాలన్నదానిపై పార్టీ రకరకాల ఆలోచనలు చేస్తున్నట్లు కూడా సమాచారం. 

మాటకు ముందు ఉద్యమ కారులం అంటూ చెప్పుకొని బిజేపిలో చేరిన నేతల పూర్వాపరాలపై బిజేపి ఆరా తీస్తోందని సమాచారం.

 పైగా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పెత్తనం కల్పించడం కూడా మొదటికే మోసం వస్తుందన్న ఆలోచన పార్టీ చేస్తోందట. అంతే కాకుండా ఒక వేళ భవిష్యత్తు ఈ నేతలు పార్టీలో వుంటారా? పార్టీ అధికారంలోకి రాకున్నా పార్టీని పట్టుకని వేళాడతారా? లేక అవకాశావాదులుగా మారిపోతారా? ఐదేళ్లు పదవులు లేకుండా పార్టీకి సేవ చేస్తారా? అన్న విషయాలపై లోతన్కెన అధ్యయనం జరుగుతోందట. అలాంటి నేతల్లో ఈటెల రాజేందర్‌ తోపాటు వచ్చిన మాజీ మహిళా ఎమ్మెల్యే బొడిగ ఒకరు. ఆమె తొలిసారి తెలంగాణ అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్‌ అవకాశం కల్పించారు. తెలంగాణ తొలి అసెంబ్లీ సమావేశాల రోజున ఆంధ్రాకు చెందిన మీడియా చేసిన హడావుడి, తెలంగాణ ఎమ్మెల్యేల పట్ల ప్రదర్శించిన దుష్టవైఖరిని ముఖ్యమంత్రి తీవ్రంగా పరిగణించారు. అందులో బొడిగ శోభ ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారాన్ని హేళన చేసిన మీడియాను ఏకంగా తెలంగాణలో బ్యాన్‌ చేశారు. అంతగా ఆమెకు ముఖ్యమంత్రి కేసిఆర్‌ భరోసా కల్పించారు. ధ్కెర్యాన్ని ఇచ్చారు. ప్రాధాన్యతనిచ్చారు. కాని ఆమె ఎమ్మెల్యేగా పార్టీనుంచి,ప్రజలనుంచి వ్యతిరేకత ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. దాంతో ఆమె టిక్కెట్టు నిరాకరించారు. అయినా సంయమనంతో వుంటే పదవులు ఇస్తామని కూడా ముఖ్యమంత్రి కేసిఆర్‌ మాట ఇచ్చారు. కాని ఆమె వెంటనే బిజేపిలో చేరి రాజకీయ జీవితాన్ని త్రిశంకు స్వర్గం చేసుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే మాజీ ఎమ్మెల్యే ఎనుగు రవీందర్‌ రెడ్డి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అంతే గాని ఆయనను ప్రత్యేకంగా పక్కన పెట్టాలన్న ఆలోచన ముఖ్యమంత్రి చేయలేదు. ఆయనకు ప్రజల్లో ఆదరణ తగ్గినట్లు స్పష్టమైనసమాచారం వుండడం కూడా తెలిసిందే. బిజేపిలో చేరగాని బలమైన నేతగా మారారా? అన్న ప్రశ్న ఉత్పన్నమౌతోంది. ఇక కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా పరిషత్‌ చ్కెర్మన్‌గా అవకాశం అందుకున్న తుల ఉమ కూడా ఎమ్మెల్యే కావాలని ఆశపడ్డారు. అందులో తప్పు లేదు. కాని సమయం కోసం ఎదరుచూడాల్సివుండే. కాని ఆమె కూడా తొందరపడి బిజేపిలో చేరింది. ఇలా ఉద్యమ కారులమన్న కార్డుతో ప్రతి పదవి తమకే కావాలని, ప్రతిసారి తమకే అవకాశం ఇవ్వాలని పదవులు పొందని వారే డిమాండ్‌ చేస్తూ పోతే, మరి మిగతా నేతలకు ఎప్పుడు అవకాశాలు వస్తాయి. వారికి కూడా సరైన ప్రాతినిద్యం అవసరం లేదా? అన్నది తెలంగాణ సమాజం కూడా ఆలోచిస్తున్న మాట. ఇక కొండా విశ్వేశ్వరరెడ్డికి ఒకసారి ఎంపిగా అవకాశం కల్పించారు. కాని ఆ స్ధాయిలో ఆయన ఫెర్మార్మెన్స్‌ కనిపించలేదు. ఇప్పుడు మీడియాలో చేస్తున్న హడావుడిలో అప్పుడు పది శాతం చేసినా, ప్రజల్లో వుండేవారు. పార్టీలో అవకాశాలు అందుకునేవారు. కాని పదవి పోయిన తర్వాత గాని రాజకీయాల విలువ తెలియదు. పైగా ఆయన బిజేపిలో చేరడానికి ఓ ఫ్రధాన కారణం కూడా వుందన్న వార్తలు వినిపించాయి. ఇలాంటి నేతలకు పార్టీ ప్రాదాన్యత కల్పించడం ఎంత వరకు సమంజసమన్న చర్చ మాత్రం బాగానే జరుగుతోందన్నది మాత్రం నిజం అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!