
చందుర్తి, నేటిధాత్రి:
మండలంలోని గోస్కులపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన దొంగతనాన్ని మరిచిపోక ముందే మండలంలోని మల్యాల గ్రామానికి చెందిన దేశెట్టి రాజయ్య ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు 7 తులాల బంగారం అపహరించారు.
ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ….. రాజయ్య వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్ళగా, కుటుంబ సభ్యులు ఆసుపత్రికి వెళ్లామని అన్నారు. నల్లపూసల దండ, నక్లేశు,కమ్మలు ఏడు తులాల బంగారం అపహరణకు గురైందని బాధితులు ఆవేదన చెందుతున్నారు.
ఘటన స్థలానికి చేరుకున్న చందుర్తి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.