కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా బబ్బురి ఉప్పలయ్య,మోడెం వెంకటేశ్వర్లు ఎన్నిక
కేసముద్రం(మహబూబాబాద్), నేటిధాత్రి: ఈనెల 19, 20, 21 తేదీలలో యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్వహించిన రాష్ట్ర మహాసభలలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారని, కేసముద్రం మండలం నుండి బబ్బురి ఉప్పలయ్య, మోడెం వెంకటేశ్వర్లను రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమించారని బబ్బురి ఉప్పలయ్య మోడెం వెంకటేశ్వర్లు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా స్థానం కల్పించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, ఈ అవకాశం రావడానికి సహకరించిన ప్రతి ఒక్క కల్లుగీత కార్మికులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ అవకాశంతో గౌడ కులస్తుల సంక్షేమం,కల్లు గీత కార్మికుల కోసం మరింత బాధ్యతాయుతంగా పనిచేస్తామని తెలిపారు.పదవి రావడం వల్ల బాధ్యత పెరుగుతుందని,కేసముద్రం మండల కల్లు గీత కార్మిక సంఘం పనితీరును బేరీజు వేసుకొని ఈ అవకాశం కల్పించినట్లు తెలిపారు. మూడు రోజులపాటు నిర్వహించిన బహిరంగ సభ సమావేశాలు విజయవంతం అయ్యాయని తెలిపారు.మా పై నమ్మకంతో కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్న రాష్ట్ర అధ్యక్షులు ఎం వి రమణ కు యమగాని వెంకన్న కి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు గంగపురపు వెంకన్న,బబ్బురు వెంకటమల్లు, గంధసిరి యాకన్న,గంధం వెంకన్న,కామగొని సారయ్య, సాంబయ్య,గంధసిరి వెంకన్న, స్వామి,గంధసిరి విజేందర్, గంధం శ్రీనివాస్,బొమ్మగాని ఎల్లయ్య,కందాలరమేష్ తదితరులు పాల్గొన్నారు.