
చిల్పూర్( జనగామ)నేటి ధాత్రి:
గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చిల్పూర్ మండలం చిన్న పెండ్యాల గ్రామంలోని భగత్ సింగ్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా చిన్న పెండ్యాల బీసీ కాలనీలోని భగత్ సింగ్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణనాథునికి నిత్యం ప్రత్యేక పూజలు ఘనంగా జరుగుతున్నాయి.ఇందులో భాగంగా సోమవారం గణేష్ మండపం వద్ద మహా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఇందులో భక్తులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అన్నదాన మహా ప్రసాదాన్ని స్వీకరించి తరించారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు ఎంపీటీసీ తాళ్లపల్లి ఉమా సమ్మయ్య గౌడ్ భగత్ సింగ్ యూత్ కమిటీ సభ్యులు వేమునూరు శ్రీనివాస్, కీర్తి శ్రీధర్, బత్తుల రాజన్ బాబు ,తాళ్లపల్లి శ్యామ్ గౌడ్, పొడిశెట్టి లక్ష్మీనారాయణ, నారాయణగిరి రాజు, దేశిని సతీష్,నారగోని సంతోష్ కుమార్, కొత్తపెళ్లి అనిల్ రాజ్, తాళ్లపల్లి క్రాంత్ కుమార్,నాగవెల్లి హరీష్, నాగవెల్లి రంజిత్, తాళ్లపల్లి గణేష్, నారాయణగిరి రాకేష్, తిమ్మాపురం రవికుమార్ , దూడల కుమారస్వామి, నోముల తిరుపతిరెడ్డి, రామడుగు సమ్మయ్య, వెలిశాల రాజు, ఇరుకుల కిరణ్, నేలపోగుల వెంకటేశ్వర్లు, నారగోని రాజు, నారాయణ శ్రీనివాస్ , నారాయణగిరి రాజు కూరపాటి శ్రీనివాస్ , గుంటి మల్లయ్య , గుంపుల రాజిరెడ్డి , ఏదునూరి విష్ణువర్ధన్, రామడుగు ఖుషి, వెలిశాల రాకేష్, నేలపోగుల సాయికుమార్ , చిర్రా సంజయ్ , గడ్డం శ్రీనివాస్ ,బత్తుల గణేష్, స్థానిక మహిళలు,తదితరులు పాల్గొన్నారు.