
#అన్ని దానముల కన్నా అన్నదానం చాలా గొప్పది
#బిఆర్ఎస్ మండల అధ్యక్షులు లింగాల రమణారెడ్డి
వెంకటాపూర్ నేటిధాత్రి:
గణనాథుని ఆశీర్వాదంతో ప్రజలంతా బాగుండాలని ఆ గణనాథుని వేడుకున్నట్లు మండల పార్టీ అధ్యక్షులు లింగాల రమణారెడ్డి తెలిపారు. ఈ రోజు నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు వెంకటాపూర్ మండల కేంద్రంలోని బాపూజీ యువజన సంఘం అధ్యక్షుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకునికి స్థానిక ఎస్సై తాజుద్దీన్, బాపూజీ యూత్ అధ్యక్షులు చిట్టిమల్ల ఓం ప్రకాష్ తో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ వినాయకుని ఆశీర్వాదంతో వెంకటాపూర్ మండలం అద్భుతంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. ఆ గణేశుని ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి కెసిఆర్ గారి నాయకత్వంలో మంత్రి కేటీఆర్ నేతృత్వంలో రాష్ట్రం ములుగు జెడ్పి చైర్మన్ బడే నాగజ్యోతి, జిల్లా పార్టీ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు ఆధ్వర్యంలో మండలం మరింత ప్రగతి పథంలో వేగంగా ముందుకు పోవాలని, ప్రజలంతా భక్తిశ్రద్ధలతో గణేష్ ని పూజించాలని సంబరంగా నవరాత్రులు జరుపుకోవాలని అన్నారు. బాపూజీ యువజన సంఘం అధ్యక్షులు చిట్టిమల్ల ఓం ప్రకాష్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నం వడ్డించారు. సబ్ ఇన్స్పెక్టర్ తాజుద్దీన్ మాట్లాడుతూ దేశంలో అందరు జరుపుకునే పండుగలలో గణపతి నవరాత్రుల ఉత్సవం పెద్దదని ఈ ఉత్సవంలో భక్తులందరూ పాల్గొని గణనాథుని కృప కోసం పరితపించాలని ఆయన కోరారు. అంతేకాకుండా గణపతి నిమజ్జనం దగ్గర పడుతున్నందున భక్తులు తగు జాగ్రత్తలు పాటిస్తూ నిమజ్జనం ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బాపూజీ యువజన సంఘం అధ్యక్షులు చిట్టిమల్ల ఓం ప్రకాష్, గౌరవాధ్యక్షులు గుర్రాల మహేష్, యువజన సంఘం సభ్యులు ములుగు జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు చీకుర్తి మధు యాదవ్, గ్రామ పెద్దలు, మహిళలు, గణేశుని భక్తులు, తదితరులు పాల్గొన్నారు.