కేటిఆర్‌ సిఎం…ప్లీనరీలో నిర్ణయం?

నాయకుల సాక్షిగా ప్రకటన వెలువడడం ఖాయం?

 యువతరం ప్రతినిధులకు పెద్ద పీట?

 సీనియర్ల వారసులకు వచ్చే ఎన్నికల్లో ప్రాధాన్యత?

అంతా కొత్త తరం?

వందేళ్ల చరిత్రకు జరిగిన నిర్మాణంలో నూతన శకానికి శ్రీకారం?

మరో ముప్పై ఏళ్లు తిరుగులేని శక్తిగా కేటిఆర్‌ ప్రస్ధానం? 

ఉద్యమ కాలం నేతలంతా పార్టీ కోసం?

యువతరమంతా కొత్త తరానికి వారధులు కావడమే లక్ష్యం?

                              తెలంగాణ యువశక్తికి కొత్త ఉత్సాహం?

                             అతి త్వరలో కల్లకుంట్ల తారకరామావు అభిమానుల కల నెరవేరబోతోంది. కేటిఆర్‌ ముఖ్యమంత్రి అయ్యే సమయం ఆసన్నమైంది. ఆ తరుణం వచ్చేస్తోంది. టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంటు కేటిఆర్‌ ముఖ్యమంత్రి అయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో గత కొంత కాలంగా కనిపిస్తున్న మార్పులే ఇందుకు సంకేతాలనిపిస్తున్నాయి. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు ప్రజాస్వామ్య బద్దంగా ముఖ్యమంత్రి కేటిఆర్‌ ఎంపికతో కొత్త ఒరవడికి శ్రీకారం జరగనుంది. తెలంగాణ ఉద్యమ కారుడిగా, పలు మార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా సుధీర్ఘ కాలం అనుభవం వుంది. ఇప్పటికే పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంటుగా కేటిఆర్‌ పాలనాపరమైన దక్షతలో, యువతకు దార్శనికతలో ఐకాన్‌గా నిలిచారు. తాజాగా ఆయన ప్లీనరీ ముందు మొదలు పెట్టిన జిల్లాల పర్యటనలతోపాటు, పెద్దఎత్తున మీడియా ఇంటర్వూలు కూడా ఇందులో భాగమే అని తెలుస్తోంది. తను రాష్ట్ర రాజకీయాలపై స్పష్టతనిసూ వస్తున్నారు. నర్మగర్భంగా తన దార్శనికతను చూపిస్తున్నారు. ప్రతిపక్షాలను కడిగిపారేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి కేసిఆర్‌ను తలపించేలా ప్రతిపక్షాలను చెడుగు ఆడుకుంటున్నాడు. వరంగల్‌లో ఇటీవల జరిగిన సభలో కేటిఆర్‌ ప్రసంగాన్ని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా విన్నారు. టిఆర్‌ఎస్‌ నాయకులు ఫిదా అయ్యారు. కేటిఆర్‌లో నెల కొన్న జోష్‌కు టిఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఉద్యమ కాలంలోలాగా కేరింతలు కొట్టారు. గతంలో ఎప్పుడూ కేటిఆర్‌ స్పీచ్‌లో ఇంత దమ్మున్న మాటలు లేవు. వైవిధ్యభరితమైన ప్రాసలు లేవు. కాని వరంగల్‌లో భూకంపం సృష్టించినంత పనిచేశారు. ఒక రకంగా ఇది త్వరలో సిఎం అవుతున్నట్లు ఆయన పరోక్ష సంకేతాలు పంపించినంత పనిచేశారు. ఇక ఆ సారి టిఆర్‌ఎస్‌కు చెందిన సీనియర్‌ నాయకుల వారసులు పెద్దఎత్తున బరిలో నిలువనున్నారు. అందువల్ల సీనియర్లంతా పార్టీ నిర్మాణంకోసం పనిచేయాల్సిన అసవరం వుంది. వారివారి వారసులను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత వుంది. రేపటి తరం కోసం, నూతన రాజకీయాల ఆవిష్కరణ కోసం, మరో ముప్పైఏళ్ల ప్రస్ధానం కోసం కేటిఆర్‌ను త్వరలో సిఎంను చేయడం తధ్యం…? టిఆర్‌ఎస్‌ వందేళ్లు తెలంగాణ రాజకీయాలను ఏలాలంటే ఇప్పుడు తీసుకునే నిర్ణయంకూడా ఎంతో కీలకం?

                       గతంలో ఎన్నడూ లేని విధంగా వరంగల్‌లో ఒక్కసారిగా కేటిఆర్‌ విశ్వరూపం చూపించారు. ఇక ప్రతిపక్షాలకు ముందున్నది ముసళ్ల పండగ అన్నట్లుగానే ఆయన ప్రసంగం సాగించాడు. అంతే కాకుండా ఎక్కడా తగ్గేదే లేదన్నట్లు కేంద్ర స్ధాయి నుంచి క్ష్రేత్ర స్ధాయిదాకా బిజేపిలో ఏ ఒక్కరినీ వదలకుండా దుమ్ము దులిపాడు. తన మాటలతో వారిని మొక్కజొన్న కంకిని ఒలిచినట్లు ఒలిచేశాడు.. తడబడకుండా, తటబాటు లేకుండా కందిపొల్లును కొట్టినట్లు బిజేపిని పొల్లుపొల్లు తిట్టిండు. .తిట్టిన తిట్టుతిట్టకుండా, పొట్టు పొట్టు తిట్టి,తిట్టి తూర్పార పట్టిండు. అదీ కేటిఆర్‌ అని మరోసారి నిరూపించాడు. ఇక్కడ మొదలు పెట్టి ఎక్కడిదాకా తీసుకెళ్తానో చూడండి అని ప్రతిపక్షాలకు రుచి చూపించాడు. కర్ణాటకలో ఆ రాష్ట్ర బిజేపి పరిపాలనను ఉద్ధేశించి అనేక సాక్ష్యాలు చూపించాడు. ఉచిత విద్యుత్‌తో మొదలు, రాష్ట్రంలో అమౌలౌతున్న ఏ ఒక్క పథకాన్పి పోలిన ఒక్కటంటే ఒక్కటైనా సంక్షేమ పధకం అమలౌతుందా? అని బిజేపి శ్రేణులను నిలదీశారు. కడిగేశారు. గుక్క తిప్పుకోకుండా మాట్లాడిన కేటిఆర్‌, బిజేపి నేతలు గుక్కపెట్టి ఏడ్చేంత తిట్ల వర్షం కురిపించారు. ఉప్పెనలా బిజేపి మీద విరుచుకుపడ్డారు. అవినీతికి పాల్పడిన వారందరికీ కేఆరాఫ్‌ అడ్రస్‌ బిజేపి అంటూ నిప్పులు చెరిగారు. 

                     ఏ రకంగా చూసినా బిజేపికి రాష్ట్రంలో ఎలాంటి స్కోప్‌ లేదు. అంతో ఇంతో కొంత కాంగ్రెస్‌కు పరిస్ధితి ఎలా వుంటుందో అన్నది ఇప్పటికిప్పుడు చెప్పలేనిది. అందువల్ల బిజేపిని సమర్ధవంతంగా ఎదుర్కొవాలన్నా, కాంగ్రెస్‌ను ఎదగకుండా చేయాలన్న తెలంగాణలో యువతరం రాజకీయాలు ఈ సారి ఎంతో అవసరం. ఎందుకంటే రాష్ట్రం మీద జాతీయ పార్టీలు బిజేపి, కాంగ్రెస్‌లు రెండూ దృష్టిపెట్టాయి. గత ఎన్నికల సమయం వరకు బిజేపితో టిఆర్‌ఎస్‌ సఖ్యత, సాన్నిహిత్యం వున్నాయి. కాని ఇప్పుడు వాటి మధ్య స్నేహం చెడిరది…దూరం పెరిగింది. ఎలాగైనా తెలంగాణలో టిఆర్‌ఎస్‌ రాకుండా చేయలేకపోయినా, రాజకీయాలను అస్ధిరపర్చే అవకాశం కోసం బిజేపి ఎదురుచూస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అలా బిజేపి అడుగులేస్తుందనేది స్పష్టమౌతోంది. పైగా ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం, దానిపై దుమారం రేపడం వంటికి వినూత్నమైన పంధాలో బిజేపి తీసుకెళ్తుంది. దాంతోపాటు గవర్నర్‌ను ముందు పెట్టి బిజేపి రాజకీయం చేయాలని చూస్తుందన్నదానిపై కూడా టిఆర్‌ఎస్‌, బిజేపిల్లోనూ స్పష్టత వుంది. ఇలాంటి సందర్భాలలో టిఆర్‌ఎస్‌లో యువతరాన్ని ముందుకు తేవాలి. కేటిఆర్‌ను యువతరం నాయకుల ప్రతినిధిగా ముఖ్యమంత్రిని చేయాలి. వారికి భవిష్యత్తు భరోసా కేటిఆర్‌లో కనిపించాలి. అందుకు ఇక ఆలస్యం చేయకుండా కేటిఆర్‌ను సిఎం చేయాలన్న నిర్ణయానికి పార్టీ పెద్దలతోపాటు, ముఖ్యమంత్రి కేసిఆర్‌ కూడా వచ్చినట్లు తెలుస్తోంది. 

                   ఇక కాంగ్రెస్‌కూడా సందిట్లో సడేమియా? అంటూ వస్తోంది. కేంద్ర స్ధాయినుంచి రోజుకో రకమైన ప్రకటన వెలువుడుతోంది. జాతీయ స్ధాయిలో కూడా ఈసారి రాజకీయ సమీకరణాలు పెద్దఎత్తున మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సందర్భంలో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను కట్టడి చేయాలంటే, ఇప్పుడున్న నాయకత్వాన్ని బలహీన పర్చాలంటే ముఖ్యమంత్రి కేసిఆర్‌ డిల్లీలో మకాం వేయాలి. అక్కడి రాజకీయాల్లో చక్రం తిప్పేస్ధాయిలో వుండాలి. జాతీయ రాజకీయాలకు అందుబాటులో వుండాలి. పైగా రాష్ట్ర పాలనపై ఎలాంటి ప్రభావం పడకూడదు. రాహుల్‌ గాంధీ తెలంగాణ మీద ఫోకస్‌ చేసింది తెలిసిన సంగతే…అసలు కలలో కూడా ఊహించలేని సంఘటనలు ఈ మధ్య రాజకీయాల్లో చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌కు, కాంగ్రెస్‌పార్టీకి మధ్య ఒక అవగాహన జరిగిందన్న వార్తలు వస్తున్న నేపధ్యంలో ఏదైనా జరగొచ్చు…జగన్‌ ప్రభావం కూడా తెలంగాణలో కాంగ్రెస్‌కు ఉపయోగపడే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌కు కొంత ఇబ్బందికరమైన పరిస్ధితి రాక మానదు. అందువల్ల కేటిఆర్‌ ముఖ్యమంత్రి హోదాలో ఎన్నికలను ఎదుర్కొవాలి. అప్పుడు జగన్‌ కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించే పరిస్ధితి వస్తుంది. ఏది ఏమైనా త్వరలో కేటిఆర్‌ సిఎం కావడం ఖాయం..అన్నది మాత్రం తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *