ప్లీనరీకి ముందే పువ్వాడ అవుట్?

ఏ క్షణమైనా ప్రకటన రావొచ్చు?

రాష్ట్ర ప్రభుత్వం మీద పెరుగుతున్న ఒత్తిడి!

ఇంత కాలం ఉపేక్షించినా ఇక వేటు తప్పదని పార్టీ సీనియర్ల చర్చ?

పిలిచి పీటేస్తే, పార్టీని పాతర పెట్టేదాకా తెచ్చాడని టిఆర్ఎస్ నేతల ఆగ్రహం?

టిఆర్ఎస్ నే గెలవకుండా చేసి పెత్తనమెత్తున్నాడని ఉద్యమకారుల మండిపాటు?

అటు బిజేపి, ఇటు కాంగ్రెస్ లకు మాట్లాడే అవకాశం ఇంకా ఇవ్వొద్దు?

పువ్వాడపై ధ్వజమెత్తుతున్న కమ్మ సంఘాలు?

పెద్ద ఎత్తున కరపత్రాలు, బహిరంగ లేఖల విడుదల?

కులం ఇంత కాలానికి గుర్తొచ్చిందా? అని ఎద్దేవా!

ఖమ్మంలో మారనున్న సమీకరణాలు?

పువ్వాడ వైరి వర్గాలలో నెలకొన్న జోష్?

పువ్వాడ పై సిఎం కేసిఆర్ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి?

 రాష్ట్ర రవాణాశాఖ మంత్రి శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను ఏ క్షణమైనా పదవినుంచి భర్తరఫ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుతున్న విశ్వసనీయ సమాచారం మేరకు టిఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలైన ప్లీనరీ సమావేశాలకు ముందే ఈ తలనొప్పి తగ్గించుకోవాలని ముఖ్యమంత్రి కేసిఆర్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పువ్వాడ అజయ్ మీద ముఖ్యమంత్రి కేసిఆర్ సీరియస్ గా వున్నట్లు చెప్పుకుంటున్నారు. వామపక్ష రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన పువ్వాడ లో ఆదర్శ భావాలుంటాయని సిఎం భావించారు. అందుకే ఎనలేని ప్రాధాన్యతను కూడా అజయ్ కు కల్పించారు. గత ఎన్నికలలో పువ్వాడ అజయ్ సొంత పార్టీ నేతల ఓటమికి పాల్పడినట్లు అనేక ఆరోపణలున్నాయి. సీనియర్లను లెక్క చేయడం లేదన్న విమర్శలు వున్నాయి. అయినా ముఖ్యమంత్రి కేసిఆర్ వాటిని కూడా పరిగణలోకి తీసుకోకుండా ప్రాధాన్యత కల్పిస్తూ వచ్చారు. పార్టీలు, నాయకుల మధ్య ఆధిపత్య పోరు సహజం. కాని వేధింపు రాజకీయాలు అసహజమైనవి. సరైనవి కాదు నాయకులు తన రాజకీయ పలుకుబడి ముందు ఎవరూ నిలబడకూడదనుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామం కాదు. పువ్వాడకు అటు ప్రతిపక్ష పార్టీలతో పడక, ఇటు సొంత పార్టీ నేతలతో పొసగదన్నది అనేక సందర్భాలు రుజువు చేశాయి. హింసాపూరిత రాజకీయాలు ఎప్పటికైనా నష్టదాయకమే…ఖమ్మం ఘటన పార్టీని ఉక్కిరిబిక్కిరి చేయకముందే పువ్వాడ ను సాగనంపితే మేలని సిఎం నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

 

తక్కువ సమయంలో ఎక్కువ ప్రాధాన్యత. పార్టీలో సీనియర్లను కాదని గుర్తింపు… జిల్లాలో తిరుగులేని శక్తిగా ఎదిగేందుకు అవకాశం. ఎదురులేని నాయకుడయ్యేందుకు కూడా పార్టీ ప్రోత్సాహం. అయితే ఏమిటి? ఎంత ఎంత ప్రోత్సాహిస్తే ఏముంది? తనను నమ్మి పార్టీ అన్ని విధాల సహరిస్తే పార్టీ నిండా మునిగేదాక తెచ్చిండు. వ్యక్తిగా, నాయకుడుగా తనకు జరిగే నష్టం పక్కన‌ పెడితే పార్టీ పరువు తీసే పనులు చేయడం ఆహ్వనించదగ్గది ఏ మాత్రం కాదు. అసలు ఇంత కాలం పార్టీ ఉపేక్షంచడం కూడా పువ్వాడ రూపంలో తీవ్ర ఒడిదుడుకులు కోరికోరి తెచ్చున్నట్లైంది. 

 

పార్టీకి కీలక నేతలు దూరం చేశాడు. నాయకుడంటే ప్రజల్లో నాలుకలా వుండాలి. తోటి నాయకులకు భుజమైనడవాలి. కానీ పువ్వాడ తోటి నాయకుల కాళ్లలో కట్టెలు పెట్టే ప్రయత్నమే చేశాడని ప్రచారం. జిల్లాకే ఒకప్పుడు పెద్ద దిక్కుగా తుమ్మల నాగేశ్వరరావు వున్నారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎక్కువ కాలం మంత్రిగా పనిచేశారు. అవినీతి ఆరోపణలు లేని నాయకుడుగా గుర్తింపు పొందాడు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు. గతంలో పాలేరు గెలిచి డబుల్ బెడ్ రూం ఇళ్లలో చరిత్ర సృష్టించారు. పాలేరు రిజర్వాయర్, విద్యుత్ ఉత్పత్తి వంటి వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. తుమ్మల పాలేరు రూపురేఖలు మార్చారు. అలాంటి తుమ్మల ఓటమిలో పువ్వాడదే కీలక పాత్ర అన్న ఆరోపణలున్నాయి. ఇక నామా నాగేశ్వరరావు ఎమ్మెల్యేగా గెలవకుండా చేశారన్న అపవాదు వుండనే వుంది. చివరకు ఎంపిగా నామా నాగేశ్వరరావు గెలుపుకోసం తుమ్మల నాగేశ్వరరావులు ఎంత కష్టపడాల్సివచ్చిందో అందరికీ తెలుసు. వైసిపి నుంచి గెలిచినా టిఆర్ఎస్ లోకి వచ్చిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని నెగలకుండా పువ్వాడ చేశారన్నది ప్రచారంలో వున్నదే…పైగా సొంత పార్టీ నాయకులను వేధించడం, పార్టీకి దూరమయ్యేలా చేయడం జరిగిందన్న చర్చ కొత్తది కాదు. ఇలా ఏ వర్గంతోనూ పువ్వాడ సఖ్యత నెరిపిన ధాఖలాలు లేవన్న ప్రచారమే ఎక్కువ. ఇక జిల్లా అభివృద్ధిలో కీలకమైన మైనింగ్ వ్యాపారాన్ని కుదేలు చేయడంలో పువ్వాడ చేసిన అన్యాయంపై గ్రానైట్ వ్యాపారులు గుర్రుగా వున్న సంగతి తెలిసిందే. మంత్రి పువ్వాడ మూలంగా గ్రానైట్ వ్యాపారులు కూడా అరిగోస పడుతున్నారట. జిల్లాలో సుమారు 500ల వరకు గ్రానైట్ కంపెనీలున్నాయి‌. సుమారు 2000 వరకు కట్టర్లున్నారు. పువ్వాడ అజయ్ మూలంగా వారికి పనులు లేకుండా పోయాయని అంటున్నారు. ఇటు సొంత పార్టీని, అటు జిల్లాకు ఆదాయాన్ని సమకూర్చే వ్యాపారాలను అడ్డుకొని అభివృద్ధి నిరోధకుడు పువ్వాడ మారాడని చెప్పుకుంటున్నారు. 

 

బీజేపీ యువనేత సామినేని సాయి గణేష్ ఆత్మహత్య ఘటన దురదృకరం. ఈ ఘటన రాజకీయంగా పెద్ద దుమారాన్ని సృష్టించింది. దేశ వ్యాప్తంగా సంచలనమైంది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కూడా ఈ ఘటనపై ఆరా తీసినట్లు తెలిసిందే. బిజేపి నేతలు జిల్లా మొత్తం ఉద్యమాలు సాగిస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా సాయి గణేష్ కుటుంబాన్ని పరామర్శించారు. గవర్నర్ తమిళి సై కూడా ఖమ్మం వెళ్లనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ తనదైన శైలిలో సాగుతోంది. రేవంత్ రెడ్డి కూడా ఖమ్మం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో మంత్రి తనపై కుట్ర చేస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలపై కమ్మ‌ సంక్షేమ సంఘం ఓ బహిరంగ లేఖ విడుదల చేసింది. డీసీసీబీ ఛైర్మన్ గా పనిచేసిన మువ్వా విజయ్ బాబు ను కేసుల్లో ఇరికించినట్లు లేఖలో పేర్కొన్నారు. పువ్వాడ కోసం పనిచేసిన మందడపు సుధాకర్ అతని తమ్ముడు మాధవరావు మరియు ఎల్లంపల్లి హన్మంతరావు పై సుఫారీ కిల్లర్స్ కేసు పెట్టి జైలుకు పంపినట్లు ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులను ఏకతాటిపై నడిపిన ఏలూరి శ్రీనివాసరావు పై అక్రమ కేసులు పెట్టి,సస్పెన్సన్ చేయించిన‌ట్లు లేఖలో వెల్లడించారు. ఖమ్మంలో పార్టీకోసం వారి డివిజన్స్ లో నిత్యం ప్రజల మధ్య ఉండే మిక్కిలినేని నరేంద్ర పై అక్రమ కేసులు. మమత మెడికల్ కాలేజ్ వ్యవస్థాపకుల్లో ఒకరైన పెద్దమనిషి ఎర్నేని రామారావు పై అక్రమ కేసులు. నల్లమల్ల వెంకటేశ్వర్ రావు రైతు సమన్వమ సమితి జిల్లా అధ్యక్షుడుగా ఉంటే ఎంత అవమానకరంగా పార్టీ కార్యాలయం వైపు రావోద్దు అన్న సందర్భాలను కూడా ఉటంకించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి ముళ్ల కిషోర్ పెట్టిన అక్రమ కేసులు. తెలుగుదేశం నేత నల్లమల్ల రంజిత్ పై అక్రమ కేసులు. చివరికి సీనియర్ సిటిజన్ నెల్లూరి చంద్రయ్య ను వదలిపెట్టకుండా కేసులు పెట్టించాని ఆ లేఖలో పువ్వాడను ఎద్దేవా చేశారు. మమత హోటల్ కు కూవేధింపులు తప్పలేదు అంటూ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారినే టార్గెట్ చేసి, ఇప్పుడు కులాన్ని రాజకీయం వాడుకోవడాన్ని స్వాగతించమని ఆ సంఘం పేర్కొంది. పైగా ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ పరిశోధనాత్మక జర్నలిస్టు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అనేక సార్లు చెస్ విజేతగా నిలిచిన, పలు సార్లు మిస్టర్ ఏపిగా అవార్డులు అందుకున్న అనంచిన్ని వెంకటేశ్వర రావు పై అక్రమ కేసులు నమోదైతే అప్పుడు ఎందుకు నోరు మెదపలేదని కమ్మ‌ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. పైగా టివి9 రవిప్రకాశ్ కు కులపరంగా ఏనాడైనా మద్దతు పలికిన సందర్భం ఒక్కటైనా వుందా? వారు ప్రశ్నించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *