రాకేష్ కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా
అగ్నిపథ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్మీ ఉద్యోగాల నియామక ప్రక్రియను నిరసిస్తూ.. నేడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చేపట్టిన ధర్నా కార్యక్రమంలో .. రైల్వే పోలీస్ కాల్పుల్లో, వరంగల్ జిల్లాకు చెందిన రాకేష్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తీవ్ర దిగ్ర్భాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ విధానాలకు బలైపోయిన బిసి బిడ్డ రాకేష్ కుటుంబానికి సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
రైల్వే బలగాల కాల్పుల్లో మరణించిన రాకేష్ కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా తో పాటు, ఆ కుటుంబంలో అర్హులైన వారికి వారి ఆర్హత మేరకు ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇవ్వనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాల వల్లనే రాకేష్ బలయ్యిండని సీఎం విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ బిడ్డలను రాష్ట్ర ప్రభుత్వం కడుపులో పెట్టుకొని కాపాడుకుంటుందని సీఎం కేసిఆర్ స్పష్టం చేశారు.