కూసుకుంట్ల కుతంత్రం!?

`పార్టీ కోసం తను శ్రమ పడడు?

`పార్టీ కోసం పరితపించే వారిని ఓర్వడు?

`ప్రభుత్వ పథకాలను ఎమ్మెల్యే ప్రచారం చేయడు?..చేసేవారిని చేయనివ్వడు?

`నేటిధాత్రి లో వచ్చే వార్తలను పిచ్చి రాతలంటాడు?

`గోడల మీద రవి ముదిరాజ్‌ రాసిన వాటిని ఇవేం రాతలంటాడు?

`ముఖ్యమంత్రి కేసిఆర్‌, మంత్రి కేటిఆర్‌ ల పేర్లతో వున్న వాల్‌ రైటింగ్స్‌ మీద పోస్టర్లంటిస్తున్నాడు.

`తెలంగాణ మొత్తం ఎమ్మెల్యేలు ఎంతో మంది నియోజకవర్గం మొత్తం ప్రభుత్వ పథకాలపై వాల్‌ రైటింగ్‌ రాయించారు.

`మునుగోడు లో ఎమ్మెల్యే చేయాల్సిన పని సీనియర్‌ నాయకుడు రవి ముదిరాజ్‌ రాయించాడు.

`అవి ఎమ్మెల్యే జీర్ణించుకోలేక అక్కసు వెళ్లగక్కుతున్నాడు.

`ప్రభుత్వం, పార్టీ ప్రతిష్ఠ పెంచే వాల్‌ రైటింగ్స్‌ ను అభినందించాల్సింది పోయి, నిందిస్తున్నాడు?

`మునుగోడు లో ఆశావహులైన బిసి నేతలను ఎమ్మెల్యే నిందిస్తున్నాడు?

`సొంత పార్టీ నేతలను చులకనగా చూస్తున్నాడు?

`నియోజకవర్గం మొత్తం ఎమ్మెల్యే కు తీవ్ర వ్యతిరేకంగా వుంది?

`సొంత పార్టీ నేతలు ఈసారి కూసుకుంట్ల ను మార్చాల్సిందే అంటున్నారు. 

`ఈసారి ఎలాగైనా తనకు టికెట్‌ రాదనే ఎమ్మెల్యే ఇష్టానుసారం మాట్లాడుతున్నారు?

`ప్రతిపక్షాలకు ఉపయోగపడేలా పార్టీలో ఎమ్మెల్యే నే వైరి వర్గాలు సృష్టిస్తున్నాడు?

`బిసిలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నాడు?

`బిసి నాయకులకు పోటీగా మరో రెడ్డి నాయకుడిని కూసుకుంట్ల ప్రోత్సాహిస్తున్నాడు?

`అయితే నాకు లేకుంటే నీకు, రెడ్లకే మునుగోడు టికెట్‌ అన్నట్లు కూసుకుంట్ల వ్యవహరిస్తున్నాడు?

`పార్టీని భ్రష్టు పట్టించే పనిలో నిమగ్నమై వున్నాడు?

`ఇవన్నీ ఎవరో చెబుతున్న మాటలు కాదు…సాక్ష్యాత్తు బిఆర్‌ఎస్‌ నేతలు చేస్తున్న బహిరంగ వ్యాఖ్యలు?

`కనీసం మంత్రి జగదీష్‌ రెడ్డి పేరును కూడా నియోజకవర్గంలో కనిపించకుండా చూస్తున్నాడు?

`అందరినీ దూరం చేసుకుంటున్నాడు?

`పార్టీ పరువు తీస్తున్నాడు?

`ఇంతకీ కూసుకుంట్ల ఇదంతా ఎందుకు చేస్తున్నాడు?

`లోగుట్టు కూసుకుంట్ల కే ఎరుక?

హైదరబాద్‌,నేటిధాత్రి: 

కూసుకుంట్ల వ్యవహారం రోజు రోజుకూ ముదిరిపాకాన పడుతోంది.పదవీ కాంక్ష తప్ప ప్రజా సేవ పట్టడం లేదు. గెలిపించిన ప్రజలను పట్టించుకోవడం లేదు. కార్యకర్తలను గుర్తించడం లేదు. వాళ్లకు సాయపడడంలేదు. వారు చేసిన పనులకు బిల్లులు కూడా ఇవ్వడం లేదనేది మునుగోడు నియోజకవర్గం లోని మెజారిటీ నాయకులు, కార్యకర్తల ప్రధాన ఆరోపణ. సాక్షాత్తు బిఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన సర్పంచ్‌ ల ఫోరమ్‌ అధ్యక్షుడు తూర్పారపడుతున్నాడు. తాము చేసిన పనులకు బిల్లులు ఇప్పించకుండా, ఇతరులకు ఎమ్మెల్యే కొమ్ముకాస్తున్నాడని విమర్శించాడు. ఎమ్మెల్యే పార్టీ కోసం తన శ్రమ పడడు? శ్రమ పడేవారిని పడనివ్వడు. వారిని కళ్లలో పెట్టుకుంటున్నాడు. ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. ఇదీ మునుగోడు లో ఎమ్మెల్యే సాగిస్తున్న అరాచకం అని నాయకులు నిందిస్తున్నారు. పార్టీ కోసం పరితపించే వారిని ఓర్వడం లేదని కూడా తెలుస్తోంది.

 ఇటీవల కొంత కాలంగా బిఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, నారబోయిన రవి ముదిరాజ్‌ పెద్ద ఎత్తున నియోజకవర్గంలో ప్రభుత్వ పథకాలు, బిఆర్‌ఎస్‌ పార్టీ వర్థిల్లాలి. అంటూ వాల్‌ రైటింగ్స్‌ రాయించాడు.

 నియోజకవర్గం మొత్తం పెద్ద ఎత్తున ఖర్చుపెట్టి వాల్‌ రైటింగ్స్‌ రాయించాడు. నిజానికి ఈ పని చేయాల్సింది ఎమ్మెల్యే. తెలంగాణ వ్యాప్తంగా బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో పెద్ద ఎత్తున ఇలాంటి వాల్‌ రైటింగ్స్‌ రాయించారు. ప్రభుత్వ పథకాలతో పాటు, ముఖ్యమంత్రి కేసిఆర్‌, మంత్రి కేటిఆర్‌ ల నాయకత్వాలను బలపరుస్తూ రాయించారు. మునుగోడు లో ఎమ్మెల్యే ఆ పని చేయలేదు. పార్టీ మీద అభిమానం, ముఖ్యమంత్రి కేసిఆర్‌ నాయకత్వం మీద గౌరవం తో నారబోయిన రవి ముదిరాజ్‌ ఆ పని చేపట్డారు. అది ఎమ్మెల్యే కు నచ్చలేదు. ఆ రాతలేటి అని ప్రశ్నిస్తున్నాడు. పలు కార్యక్రమాలలో వీటి గురించి ప్రస్తావిస్తూ, ఆ రాతలను తప్పు పడుతున్నాడు. నిజానికి ఎమ్మెల్యే కూసుకుంట్లకు రవి ముదిరాజ్‌ రాసిన రాతలు నచ్చకపోతే, అప్పుడు ప్రతిగా తాను కూడా వాల్‌ రైటింగ్స్‌ రాయించాలి. అంతకన్నా ఎక్కవ ఎమ్మెల్యే దృష్టి పెట్టాలి. ప్రభుత్వ పథకాలను ఎమ్మెల్యే ప్రచారం చేయడు? పైగా భూముల వ్యాపారాలు చేసి పైసలు చేతిలో పట్టుకొని కొందరు వాల్‌ రైటింగ్స్‌ రాస్తున్నారంటూ ఎద్దేవా చేస్తున్నాడు. ఇలాంటి వాటిపై చిత్తశుద్ధి వుంటే ఎమ్మెల్యే సహకరించాలి. అంతే కాని రాసే వారిని ఇబ్బంది పెట్టకూడదు. తను రాయించడు.. రాయించే వారిని రాయనియ్యకపోగా, వాటిపై పోస్టర్లు అతికిస్తున్నాడు. పోస్టర్లు సరిగ్గా ముఖ్యమంత్రి కేసిఆర్‌ పేరుమీద, కేటిఆర్‌ పేరు మీద, ముదిరాజ్‌ అని వున్న చోట్లలో అతికించేలా ఆదేశాలు ఎమ్మెల్యే ఇచ్చినట్లున్నాడు. అందుకే పోస్టర్లు అతికించిన వాళ్లు అంతటా అదే పని చేశారు. నారబోయిన రవి ముదిరాజ్‌ రాయించిన రాతల మీద కావాలనే ఎమ్మెల్యే పోస్టర్లు అతికించేయించారని అంటున్నారు. 

ఇక నియోజకవర్గంలో ఎమ్మెల్యే పని తీరు , ప్రజల అభిప్రాయాలు, నాడి, సర్వే వివరాలు నేటిధాత్రి వరుస కథనాలు ప్రచురించింది. 

ఎన్నికల సమయంలో రెండు నెలల పాటు నేటిధాత్రి ఎమ్మెల్యే గెలుపు కోసం కృషి చేసింది. అది మర్చిపోయిన ఎమ్మెల్యే కూసుకుంట్ల నేటిధాత్రి లో వచ్చే వార్తలను పిచ్చిరాతలనడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఇక ప్రభుత్వం, పార్టీ ప్రతిష్ఠ పెంచే వాల్‌ రైటింగ్స్‌ ను అభినందించాల్సింది పోయి, నిందిస్తున్నాడు? మునుగోడు లో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ కూసుకుంట్ల కు టికెట్‌ ఇవ్వొద్దనేది చాలా మంది కోరుతున్న మాట. ఆశావహులైన బిసి నేతలను ఎమ్మెల్యే నిందిస్తున్నాడు? సొంత పార్టీ నేతలను చులకనగా చూస్తున్నాడు? అన్నది ప్రచారం జరుగుతున్నా ఎమ్మెల్యే తీరులో ఏ మాత్రం మార్పు రావడం లేదు. అందుకే నియోజకవర్గం మొత్తం ఎమ్మెల్యే కు తీవ్ర వ్యతిరేకంగా వుంది? సొంత పార్టీ నేతలు ఈసారి కూసుకుంట్ల ను మార్చాల్సిందే అని పదే పదే ఇప్పటి నుంచే అంటున్నారు. అయితే ఎలాగూ తనకు టికెట్‌ రాదని తెలిసే ఎమ్మెల్యే ఇలా వ్యవహరిస్తున్నాడని కొంతమంది అంటున్నారు. దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న ఆలోచన తోనే ఎమ్మెల్యే పార్టీని, నాయకులను పట్టించుకోవడం లేదన్న మాటలు వినిపిస్తున్నాయి. ఈసారి ఎలాగైనా తనకు టికెట్‌ రాదనే ఎమ్మెల్యే ఇష్టానుసారం మాట్లాడుతున్నారు? అనే చర్చ కూడా నియోజకవర్గంలో విసృతంగా సాగుతోంది. ఇదిలా వుంటే ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రతిపక్షాలకు ఉపయోగపడేలా పార్టీలో ఎమ్మెల్యే నే వైరి వర్గాలు సృష్టిస్తున్నాడు? అనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. అంతే కాకుండా బిసిలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నాడు? అంతే కాకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ బిసిలకు టికెట్‌ దక్కకుండా వుండాలని, తనకు కాకపోతే మరో రెడ్డి కే టికెట్‌ వచ్చేలా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. బిసి నాయకులకు పోటీగా మరో రెడ్డి నాయకుడిని కూసుకుంట్ల ప్రోత్సాహిస్తున్నాడు? అన్నది స్పష్టమౌతోంది. అయితే నాకు లేకుంటే నీకు, రెడ్లకే మునుగోడు టికెట్‌ అన్నట్లు కూసుకుంట్ల వ్యవహరిస్తున్నాడు? పార్టీని భ్రష్టు పట్టించే పనిలో నిమగ్నమై వున్నాడు? ఇవన్నీ ఎవరో చెబుతున్న మాటలు కాదు…సాక్ష్యాత్తు బిఆర్‌ఎస్‌ నేతలు చేస్తున్న బహిరంగ వ్యాఖ్యలే. కనీసం మంత్రి జగదీష్‌ రెడ్డి పేరును కూడా నియోజకవర్గంలో కనిపించకుండా చూస్తున్నాడు?అందరినీ దూరం చేసుకుంటున్నాడు? పార్టీ పరువు తీస్తున్నాడు? ఇంతకీ కూసుకుంట్ల ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? అనే దానిపై కూడా రకరకాల చర్చలు సాగుతున్నాయి. అదంతా లోగుట్టు కూసుకుంట్ల కే ఎరుక?.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!