బిజెపి అభ్యర్థి పచ్చి స్వార్థపరుడు,దొంగ చిత్తుగా ఓడించండి: ఎంపీ రవిచంద్ర
బిజెపి అభ్యర్థిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన ఎంపీ వద్దిరాజు
కేసీఆర్ ఫ్లోరోసిస్ భూతాన్ని తరిమికొట్టారు, మునుగోడును కేటీఆర్ దత్తత
తీసుకుంటున్నరు,దీంతో మునుగోడు మరింత గొప్పగా అభివృద్ధి చెందుతది:ఎంపీ రవిచంద్ర
చౌటుప్పల్, తంగెడపల్లి,వాయిలపల్లి, లచ్చమ్మగూడెం,అంతంపేట,మర్రిగూడెంలో వద్దిరాజు విస్త్రత ప్రచారం
మునుగోడు: బిజెపి అభ్యర్థి రాజగోపాల్ పచ్చి స్వార్థపరుడని,5 ఏళ్ల కోసం గెలిపించిన ఈ నియోజకవర్గ ప్రజలను మోసం చేసి 18వేల కోట్లకు అమ్ముడుపోయిన దొంగ అని
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అన్నారు.నమ్మిన మునుగోడు ప్రజలకు ద్రోహం చేసి కృత్రిమ ఎన్నికను తెచ్చారని బిజెపి అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిపై విరుచుకుపడ్డారు.రవిచంద్ర ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, మున్నూరుకాపు ప్రముఖులు సర్థార్ పుట్టం పురుషోత్తం,చల్లా హరిశంకర్,విష్ణు జగతిల నాయకత్వాన టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డిని
గెలిపించేందుకు మున్నూరుకాపులు శనివారం ఊరారా, వాడవాడలా వ ప్రచారం నిర్వహించారు.నారాయణపురం మండలం వాయిలపల్లిలో జరిగిన సభలో రవిచంద్ర టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ తో కలిసి పాల్గొన్నారు.ఈ నియోజకవర్గ ప్రజలు గతంలో ఫ్లోరోసిస్ తో
బాధలు పడుతుండడాన్ని కళ్లారా చూసిన కేసీఆర్ మిషన్ భగీరథ ద్వారా పరిశుద్ధమైన తాగునీరందిస్తూ ఆ మహమ్మారిని శాశ్వతంగా తరమికొట్టారని వివరించారు.నిన్న కాక మొన్న చుండూరులో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని ఇచ్చిన హామీని గుర్తు చేశారు.గత ఎన్నికల్లో ఓడినా కూడా ప్రభాకర్ రెడ్డి ప్రతి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నారని, ఇటువంటి నాయకుడిని గెలిపించినట్టయితే ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డిల సంపూర్ణ సహకారంతో మరింత గొప్పగా అభివృద్ధి చేస్తారని రవిచంద్ర వివరించారు.నారాయణపురం మండల కేంద్రంలో ఎంపీ వద్దిరాజు ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చౌటుప్పల్,తంగెడపల్లిలలో వాడవాడలా తిరిగి టీఆర్ఎస్ ఓట్లేసి ఘన విజయం చేకూర్చాల్సిందిగా కోరారు. అదేవిధంగా లచ్చమ్మగూడెం, అంతంపేటలలో ఇంటింటా తిరిగి ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం గావించారు. మర్రిగూడెం మండల కేంద్రంలో మున్నూరుకాపులతో సుమారు 3 గంటల పాటు సమావేశమై టిఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డికి సంపూర్ణ మద్దతునిచ్చి భారీ ఓట్ల మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరారు.ఎన్నికల ప్రచారంలో ఎంపీ వద్దిరాజు వెంట సకినాల రవికుమార్,పర్వతం సతీష్,జెన్నాయికోడే జగన్మోహన్,గంధం నాగేశ్వరరావు,సోమనారాయణ,ఆర్.వి.మహేందర్,పుస్తె శ్రీకాంత్,కోట్ల వినోద్,కౌశెట్టి మహేష్,గాదె మోహన్,నాయిని నరేష్,పొనుగోటి మహేష్ తదితరులు పాల్గొన్నారు.