‘కూతురు’కు…ప్రేమతో….!
కూతురంటే ఏ తండ్రికి ప్రేమ ఉండదు..కూతుంటేనే ఇంటికి మహాలక్ష్మి..ఇంట్లో కూతురు ఉంటే లక్ష్మికి కొదవుండదు..కూతురున్న ఇంట్లోకి లక్ష్మి వెతుక్కుంటూ వస్తుంది..అంటు పెద్దలు చెప్పే మాటలు అనేకం విన్నాం. కూతురుంటే ఆ ఇంట్లోకి లక్ష్మి నిజంగా నడిసొస్తుందా..! అనే అనుమామనం కల్గిన వాళ్లు కూడా లేకపోలేదు. అవును అక్షరాల పెద్దలు చెప్పిన మాటలు నిజమేనని ఇంటర్మీడియట్ డిఐఈవోలో ఓ అధికారి నిరూపించాడు. వివరాల్లోకి వెళితే వరంగల్ అర్బన్‌జిల్లా ఇంటర్మీడియట్ కార్యాలయంలో ఓ అధికారి తమ కూతుళ్లకు పేపర్ వాల్యుయేషన్ క్యాంపులో కంప్యూటర్ ఆపరేటర్లుగా పనిచేసినట్టు ఇద్దరి పేర్లతో బిలులు పెట్టేసి ప్రభుత్వ సొమ్మును కాజేశారని కార్యాలయంలో గుసగుసలాడుకుంటున్నట్లు తెలుస్తున్నది.
నాన్నతో ఆఫీస్‌కు వస్తే చాలు పైసలు నొక్కేయచ్చు
నాన్న టీచర్ అయితే నాన్నతో బడికి వెళితే చదువుకోవచ్చు, స్నేహితులతో బయటకు వెళితే ఆడుకోవచ్చు. కాని ఇంటర్మీడియట్ డిఐఈవోలో మాత్రం మీ నాన్న అధికారి అయితే చాలు డబ్బులు దండిగా దండుకోవచ్చు. అవును ఇప్పుడు డిఐఈవోలోనే కాదు వరంగల్ ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఇదే చర్చ. అధికారికి ఎలా సాధ్యమయ్యింది? అయినా సొంత కూతుళ్లను క్యాంపులో కంప్యూటర్ ఆపరేటర్లుగా పెట్టుకోవడమేంటి? అవినీతికి పాల్పడి ఆయన ఏది చెబితే అది నమ్మడానికి పై అధికారులు చెవిలో పూలు పెట్టుకున్నారా? ఆశకు హద్దు ఉండాలి..ఆత్యాశకు పోతే నవ్వులపాలు కాకతప్పదని తోటి ఉద్యోగులు అంటున్నారు.
0000000628 వారి లక్కీ నెంబర్…?
క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్లుగా అధికారి యొక్క ఇద్దరు కూతుర్లు పనిచేసినట్టు ఒక్కొక్కరి పేరు మీద రూ.15వేలు అనగా ఇద్దరికి కలిపి రూ.30వేలు డ్రా చేసుకున్నారని కార్యాలయంలో, క్యాంపు ఆపీస్‌లో చర్చించుకుంటున్నట్లు సమాచారం. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏమిటంటే..! పేర్లు రెండు అకౌంట్ మాత్రం ఒకటే…(ఉదాహరణకు : 1. ఎంఎస్ రోహిణి, అకౌంట్ నెంబర్-0000000628, 2.ఎం. అనూష, అకౌంట్ నెంబర్-0000000628).