తెలంగాణ కోసం కేసిఆర్ పడిన తపన గురించి వివరిస్తూ నేటిధాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావు తో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పంచుకున్న జ్ఞాపకాలు…
` 2000లో విద్యుత్ చార్జీల పెంపు నిరసించాడు.
` తెలంగాణ రైతులకు అన్యాయం జరుగుతుందని నిలదీశాడు.
`ఇప్పటికే కుంటుపడిన సాగు కునారిల్లిపోతుందని మధన పడ్డాడు.
`విద్యుత్ చార్జీల పెంపకాన్ని అడ్డుకున్నాడు.
` తెలంగాణ రైతు మీద భారం పడడాన్ని ప్రశ్నించాడు.
` విద్యుత్ మీద ఆధాపడి సాగు చేసే రైతుకు అండగా నిలిచాడు.
`రైతులపై పోలీసుల కాల్పులకు నిరసన వ్యక్తం చేశారు.
` డిప్యూటీ స్పీకర్ పదవి వదులుకున్నాడు.
`తెలంగాణ జెండా ఎత్తుకున్నాడు.
` జై తెలంగాణ అని నినదించాడు.
`ఒక్కడుగా అడుగు వేశాడు.
`కోట్లాది మందిని కదిలించాడు.
` రైతు కోసమే కేసిఆర్ తపనంతా.
` రైతు సంతోషం కోసమే పరిశ్రమ.
` తెలంగాణ వస్తే తప్ప రైతుకు విముక్తి లేదన్నాడు.
` తెలంగాణ నిధుల దోపిడీని అడ్డుకున్నాడు.
` తెలంగాణ ఉద్యోగాలను కొల్లగొడుతుంటే నిలదీశాడు.
` తెలంగాణ వస్తే తప్ప ప్రజల బతుకులు బాగుపడవని పోరాటానికి పూనుకున్నాడు.
`ఊరూరు తిరిగాడు.
` ప్రజా చైతన్య గొంతకయ్యాడు.
` పద్నాలుగేళ్ల నిరంతర పోరాటం సాగించాడు.
` ప్రాణ త్యాగానికి సిద్దపడి తెగించి కొట్లాడాడు.
` తెలంగాణ సాధించి పెట్టాడు.
`అరవై ఏళ్ల తెలంగాణ కల నిజం చేశాడు.
`చీకట్లను పారద్రోలి వెలుగులు నింపాడు.
` వ్యవసాయం పండగ చేశాడు.
`తెలంగాణ రైతు కళ్లలలో సంతోషం నింపాడు.
`బంగారు తెలంగాణ ఆవిష్కరించాడు.
`దేశం, దేశ భవిష్యత్తు కోసం మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాడు.
హైదరబాద్,నేటిధాత్రి:
ప్రజల కలను తన కలగా, ప్రజల లక్ష్యాన్ని తన లక్ష్యంగా ఎంచుకున్న ఏకైక నాయకుడు కేసిఆర్. అందుకే ఆయన కారణజన్ముడు. సహజంగా ఎవరికైనా తన లక్ష్యం వుంటుంది. ప్రతి వ్యక్తి తన లక్ష్య సాధన కోసం పనిచేస్తాడు. చరిత్ర మొత్తం తిరగేసినా కేసిఆర్ లాంటి నాయకుడు కనిపించడు. ఎందుకంటే ఎక్కడా తన వ్యక్తిగతమైన లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నట్లు కనిపించదు. ఆయన ఎంచుకున్న ప్రతి లక్ష్యంలోనూ ప్రజల కనిపిస్తారు. ప్రజల ఆశయాలే కనిపిస్తాయి. అందుకే ఆయన వేసిన ప్రతి అడుగు కూడా ఒక నిర్మాణాత్మక దిశలోనే సాగింది. అందుకే ఆయన తెలంగాణ విధాత మారాడు. తెలంగాణ ప్రగతి ప్రధాత అయ్యాడు. అందుకే ఆయన కారణ జన్ముడు అంటున్న ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, నేటిధాత్రి ఎటిటర్ కట్టారాఘవేంద్రరావుతో ఉద్యమ కాలం నాటి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. వాటిని ఆయన మాటల్లోనే..
ముఖ్యమంత్రి కేసిఆర్ విద్యార్ధి దశలోనే రాజకీయాలు వైపు ఆకర్షితులు కావడం జరిగింది.
తెలంగాణ పోరాటంలో చిన్న వయసులోనే పాల్గొనడం జరిగింది. ఏ సిద్దిపేట గడ్డమీద తొలి దఫా ఉద్యమం మొదలైందో, అదే మళ్లీ అదే సిద్దిపేట గడ్డనుంచి శంఖారావాన్ని పూరించిన నాయకుడు కేసిఆర్. తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రెండూ కలిసిన నాడే వీలిన ప్రక్రియ ఏ తెలంగాణ వాదికి నచ్చలేదు. ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటైన నాడే తెలంగాణ ముఖ్యమంత్రిని తొలగించి, ఆంధ్ర ప్రాంత నాయకుడు పాలకుడు కావడంతో తెలంగాణను నిప్పుల్లోకి తోస్తారని అర్ధమైంది. ఆనాటి నుంచి ఎంతో మంది తెలంగా కోసం పోరాటం సాగించారు. కాని ఆ ప్రయాణంలో అందరూ అలసిపోయారు. కొందరు స్వార్ధపరులయ్యారు. కొందరు మధ్యలో తెలంగాణ వాదాన్ని వదిలేశారు. తమ రాజకీయ భవిష్యత్తుకోసం తెలంగాణ నినాదం ఎత్తుకున్నవారున్నారు. ఇలా మొత్తానికి రాజకీయ నిరుద్యోగులకు స్లోగన్ మార్చుకొని నాయకులు తెలంగాణ ఆత్మగౌరవాన్ని సైతం కించపర్చారు. తెలంగాణ నినాదం అందుకున్నారంటే పదవుల కోసం అన్న అపవాదు పోవాలి. నిజమైన తెలంగాణ పోరాటం రావాలి. ప్రజల్లో చైతన్యం కల్గించాలి. వారిని నమ్మించాలి. మోసపోయిన తెలంగాణ వాదులకు నిజం కళ్లముందు ఆవిష్కరించాలి. వారిని ఉద్యమ పథంలోకి ఆహ్వానించాలి.
నిండైన మనసుతో తెలంగాణ కోసం కొట్లాడాలి. అందుకు పూర్తి భరోసా కల్గించాలని సంకల్పించి, బరిలోకి దిగిన ఏకైక నాయకుడు కేసిఆర్.
అందుకే ఆయన ఎక్కడా అలసిపోలేదు. బెదింపులకు బెదరలేదు. అదిరింపులకు లొంగలేదు. పదువులకు ఆశపడలేదు. సందర్భం వచ్చిన ప్రతీసారి పదవులను తృణ ప్రాయం చేశారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఎత్తిన జెండా దించలేదు. పిడికిలి విప్పలేదు. తెలంగాణ సాధించేవరకు విశ్రమించలేదు. ఇలాంటి బృహత్తరమైన కార్యక్రమాలు చేపట్టాలన్నా, ప్రజాకాంక్షలు నెరవేర్చాలన్నా సామాన్యుల నుంచి అయ్యే పనులు కాదు. అవి కేవలం కారణజన్ములు పూర్తి చేసేవి. అందుకే తెలంగాణ సాధకుడయ్యాడు. తెలంగాణ ప్రజలకు ఆరాధ్యుడయ్యాడు. తెలంగాణ పితగా కేసిఆర్ కీర్తింపబడుతున్నాడు. తెలంగాణ తెచ్చాడు. తెలంగాణ ప్రజల కష్టాలు తీర్చుతున్నాడు. ప్రతి ఇంటికీ న్యాయం చేస్తున్నాడు. ప్రతి గడపకు ప్రభుత్వ సంక్షేమం అందిస్తున్నాడు.
చరిత్రలో పట్టిన పట్టు విడకుండా పోరాటం చేసిన వారు అతి కొద్ది మంది మాత్రమే వున్నారు.
అలాంటి వారిలో కేసిఆర్ ముందు వరుసలో వుంటారు. ప్రజల నుంచి ఉత్పన్నమైన ఆకాంక్ష కోసం జీవితాన్ని త్యాగం చేయడం అంటే మాటలు కాదు. జీవితంలో ప్రతి సందర్భాన్ని కోల్పోతూ, ప్రజల కోసం పనిచేయడం అంటే ఒక యజ్ఞం లాంటిది. అలాంటి మార్గాన్ని ఎంచుకొని తెలంగాణ సాధించేవరకు వెనకడు వేయకుండా, మాట తప్పకుండా, మడమ తిప్పకుండా ముందుకు సాగిన ఏకైక నాయకుడు కేసిఆర్. 1985లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన నాటి నుంచే ఆయనలో తెలంగాణ సాధన ఆలోచనలు అమలు చేస్తూ వచ్చాడు. ముందు సిద్ధిపేట జిల్లా ఏర్పాటు కోరికను వెలుబుచ్చాడు. ఆ తర్వాత ప్రజల తెలంగాణ ఆకాంక్ష వైపు అడుగులేశాడు. సమయం కోసం ఎదరు చూశాడు. 1999 ఎన్నికల్లో అప్పటి టిడిపి రెండోసారి అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో కేసిఆర్ డిప్యూటీ స్పీకర్ పదవి అలంకరించారు. అప్పటి ప్రభుత్వం విద్యుత్ చార్జీల పెంపకం తప్పనిసరి చేసింది. దాంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది. ప్రతిపక్షాలు కూడా విద్యుత్ చార్జీల పెంపును ప్రశ్నించాయి. అదే సమయంలో డిప్యూటీ స్పీకర్‌గా వున్న కేసిఆర్ కూడా విద్యుత్ చార్జీల పెంపును నిరసించాడు. తెలంగాణ రైతులమీద బారం పడడాన్ని వ్యతిరేకించాడు. అది అప్పటి పాలకులకు నచ్చలేదు. తెలంగాణ రైతు ఆగం కావడానికి వీలు లేదని కేసిఆర్ తెగేసి చెప్పాడు. పెంచిన విద్యుత్ చార్జీల భారంలో మూడొంతుల బాగం తెలంగాణ ప్రజానీకమం మీదనే పడుతుందని లెక్కలతో సహా వివరించాడు. ఆంద్రప్రదేశ్‌లో సాగుకు పెద్దగా కరంటు అవసరం వుండదు. కాని తెలంగాణలో పూర్తిగా కరంటు వినియోగం మీదే వ్యవసాయం సాగుతుంది. ఆ లెక్కన తెలంగాణ రైతుల జీవితాలు ఆగం చేయడం తప్ప మరొకటి వుండదని కేసిఆర్ వాదించాడు. విద్యుత్ చార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అయినా అప్పటి ప్రభుత్వం వినకపోవడంతో తనపదవికి రాజీనామా చేసి, 2001 ఎప్రిల్ 27 తెలంగాణ జెండా ఎత్తుకున్నాడు. జై తెలంగాణ వాదంతో అడుగులు వేశాడు. తెలంగాణ రైతుకు న్యాయం కోసం పోరాటం మొదలుపెట్టాడు. తెలంగాణ వస్తే గాని తెలంగాణ రైతుకు భరోసా లేదని తేల్చిచెప్పాడు. అలా వేసిన అడుగు వెనక్కి తిరిగి చూసుడలేదు. వెనకుడు పడలేదు. తెలంగాణ వచ్చేదాకా ఎక్కడా పోరాటం ఆగలేదు.
2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన స్వార్ధ రాజకీయాల కోసం తెలంగాణ వాదానికి మద్దతు ప్రకటించింది.
తెలంగాణ కోసం కట్టుబడి వుంటామని నమ్మించి, కేసిఆర్‌ను పొత్తుకు ఒప్పించింది. ఎన్నికల్లో కలిసి పోటీ చేసింది. ముందు కాంగ్రెస్ చెప్పిన మాటలను పూర్తిగా నమ్మిన కేసిఆర్, ఆ తర్వాత ఎలా వంచించాలో అన్న లెక్కలేసుకోవడం కాంగ్రెస్ మొదలు పెట్టింది. ఆ కుట్రలను పసిగట్టిన కేసిఆర్ కాంగ్రెస్‌తో తెగతెంపులు చేసుకున్నాడు. మరింత కసిగా తెలంగాణ కోసం పోరాటం ఉదృతం చేశాడు. తెలంగాణ వాదం లేదంటూ ఎద్దేవా చేసిన సీమాంధ్రులకు తెలంగాణ వాదం రుచి చూపించేందుకు, తెలంగాణ బలం ప్రపంచానికి చాటేందుకు ఉప ఎన్నికల మార్గం ఎంచుకున్నారు. తెలంగాన ఉద్యమాన్ని రాజకీయ చైతన్యానికి ముడిపెట్టి, ప్రజా భిప్రాయంలో తెలంగాణ వాద బలాన్ని చూపిస్తూ వచ్చారు. పలు దఫాలుగా ఉప ఎన్నికల ఊపుతో తెలంగాణ అనే పదాన్ని సగటు తెలంగాణ ప్రజల్లో వేద మంత్రం చేశాడు. పండుముసలి నుంచి అప్పుడే కళ్లు తెరిచిన పసిగుడ్డు కూడా తెలంగాణ అంటే జై అనేలా చేశాడు. సబ్బండ వర్గాల నినాదం చేశాడు. సకల జనులను ఏకం చేశాడు. తెలంగాణ సాధింకపోతే ఇక ప్రజల భవష్యత్తు శూన్యమౌతుందన్న సత్యాన్ని ప్రజలు గ్రహించేలా చేశాడు. కొట్లాడి తెలంగాణ సాధించాడు. తెలంగాణ కోసం కొట్లాడిన నాటి నుంచే తెలంగాణ భవిష్యత్తును ఊహించాడు. తెలంగాణ సాధించాక తెలంగాణ రూపు రేఖలు మార్చాడు. ఎండిన బీడు భూములను పొలాలు చేశాడు. నీటి చుక్కలేని బావులు ఎండా కాలంలో ఎల్లబోసేలా భూగర్భ జలాలు పెంచాడు. చెరువులు నింపాడు. మిషన్ కాకతీయలో భాగంగా వాటికి కొత్త రూపు తెచ్చాడు. గోదారిని తెలంగాణ పల్లెలకు మళ్లించాడు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు నిర్మించాడు. ఆ నీళ్లను ఒడిసిపట్టేందుకు మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ లాంటి అనేక రిజర్వాయర్లు నిర్మాణం చేశాడు. రైతుకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నాడు. పెట్టుబడి సాయం ఎకరానికి ఏటా రూ.10వేల చొప్పున రైతు బంధు ఇస్తున్నాడు. పండిన పంటను కళ్లాల దగ్గరే అమ్ముకునేలా ఏర్పాటు చేశాడు. ఏ గడ్డమీద రైతు సంక్షభపడ్డాడో అదే గడ్డ మీద రైతుకు సంతోషం చూపిస్తున్నాడు. ఆనందం పంచుకున్నాడు. తెలంగాణ రైతును రాజులాగా బతికేలా సకల సౌకర్యాలు కల్పిస్తున్నాడు. కారణ జన్ముడిగా రైతు చేత కొలువబడుతున్నాడు.