వందకు పైగా గెలుస్తాం: పల్లా రాజేశ్వర రెడ్డి

నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి చెప్పిన ఆసక్తికర అంశాలు.

`ప్రతిపక్షాలకు అభ్యర్థులే లేరు?

`పిడికెడు మంది కూడా దొరకరు?

`బిజేపిలో ఊపెక్కువ, జనం తక్కువ.

`బిజేపికి దేశమంతా గడ్డు పరిస్థితే!

`తెలంగాణలో బిజేపి ఉనికే లేదు.

`మత రాజకీయాలు తప్ప, చెప్పుకోవడానికి ఏమీ లేదు?

`కాంగ్రెస్‌ లో సంఖ్య తక్కువ, కొట్లాటలెక్కువ?

`బలమైన పార్టీ బిఆర్‌ఎస్‌.

`దేశంలోనే బలమైన నేత కేసిఆర్‌.

`సంక్షేమంలో తెలంగాణ నెంబర్‌ వన్‌.

`రైతు సంక్షేమ రాజ్యం తెలంగాణ.

` రైతు కళ్లలో ఆనందం నింపింది తెలంగాణ.

`ఒకనాడు నీటి బొట్టు కోసం చెమట చుక్క కార్చిన రైతు.

`తెలంగాణ సాధనకు ముందు కన్నీటితో పొలం తడిసింతే దుఃఖపడిన రైతు.

`సాగులో విప్లవం చూస్తున్న తెలంగాణ రైతు.

`సంక్షేమానికి ప్రతి రూపం కేసిఆర్‌ పాలన.

`ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న నాయకుడు కేసిఆర్‌.

హైదరబాద్‌,నేటిధాత్రి:                   

నమ్మకమనే మాటకు నిలువెత్తు రూపం కేసిఆర్‌. నమ్మకమే నాయకుడి వెంట నడిస్తే అది కేసిఆర్‌. నమ్మకానికి కేసిఆర్‌ అంటే అంత నమ్మకం. అంతటి అంకితభావం వున్న నాయకుడు దేశంలోనే మరోకరు లేరు. ప్రజలంటే ఆయనకు ఎంత ప్రేమో నమ్మకానికి తెలుసు. అందుకే ప్రజలంతా ఆయనను అంతగా నమ్ముతారు. తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం ఆయన పడిన ప్రయాస మరెవరూ పడలేదు. తెలంగాణ కోసం ఆయనంత ఆలోచన ఎవరూ చేయలేరు. అందుకే యాభై సంవత్సరాల పోరాటం ఒక ఎత్తైతే పద్నాలుగేళ్ల పాటు నిరంతరంగా సాగిన ముఖ్యమంత్రి కేసిఆర్‌ పోరాటం మరో ఎత్తు. తెలంగాణ కోసం ఆయన పడిన శ్రమ తెలంగాణ సమాజం కూడా చూసింది. అందుకే ఆయనను నమ్మింది. ఆ నమ్మకాన్ని నిలబెట్టి, కడదాకా కొట్లాడి తెలంగాణ సాధించి, నమ్మకానికి నిదర్శనమయ్యాడు. నిత్య తెలంగాణ వాదిగా మనలో నాడు చైతన్యం నింపాడు. పద్నాలుగేళ్లు కొట్లాడి తెలంగాణ తెచ్చాడు. నేడు ప్రగతి బాటలు వేస్తున్నాడు. బంగారు తెలంగాణ సాకారం చేశాడు. అంటున్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి నేటిధాత్రి ఎడిటర్‌తో పంచుకున్న ఆసక్తికరమైన అంశాలు ఆయన మాటల్లోనే…

రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బిఆర్‌ఎస్‌ ముచ్చటగా మూడోసారి అఖంఢమైన మెజార్టీతో గెలవబోతోంది.వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వందకు పైగా సీట్లు సాధించనున్నాము. తెలంగాణ ప్రజల్లో బిఆర్‌ఎస్‌ అంత బలమైన ముద్రను వేసింది. క్షేత్ర స్ధాయి నిర్మాణంతోపాటు, తెలంగాణ సాధించిన ముఖ్యమంత్రి కేసిఆర్‌ మీద తెలంగాణ ప్రజలకున్న నమ్మకం మరోసారి తోడు కానున్నది. బిఆర్‌ఎస్‌ ప్రతి సారి ఎన్నికల్లో సీట్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అంతే కాదు ఈసారి దేశ వ్యాప్తంగా విస్తరిస్తోంది. ప్రజల గుండెల్లో వున్నది ఒక్క కేసిఆర్‌ మాత్రమే. బిఆర్‌ఎస్‌ పార్టీ మాత్రమే. మరో పార్టీకి తెలంగాణలో చోటు లేదు. ప్రజల్లో ఆదరణ లేదు. ఆ పార్టీలకు క్యాడర్‌లేదు. లీడర్లు అసలే లేరు. వున్నవారు తెలంగాణ కోసం పని చేసిసవాళ్లు కాదు. తెలంగాణ కోసం కష్టపడే వాళ్లు కాదు. కేవలం పదవుల ఆశతో రాజకీయాలు చేస్తున్నవారు మాత్రమే ప్రతిపక్షాలలో వున్నారు. అందుకే ప్రజలు వారిని పక్కన పెట్టారు. అయినా ఆ పార్టీలలో మార్పు లేదు. రాజకీయం మారలేదు. ప్రజల కోసం వారిలో ఆలోచన లేదు. రాజకీయం చేయాలి. ప్రభుత్వాన్ని నిందించాలి. అధికారంలోకి వస్తామని కలలు గనాలి. ఇంతకు మించి ప్రతిపక్షాలైన బిజేపి, కాంగ్రెస్‌లకు తెలంగాణ మీద ఎలాంటి ప్రేమ లేదు. వుంటే కేంద్రంలో అధికారంలో వున్న బిజేపి తెలంగాణకు ఏం చేసిందో బిజేపి నేతలు చెప్పాలి. కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలి. బిజేపికి వున్న నలుగురు ఎంపిలు ఎన్ని నిధులు తెచ్చారు. ఏఏ ప్రాజెక్టులు తెచ్చారు. తెలంగాణకు విజభన చట్టంలో చేర్చిన ప్రాజెక్టులు ఇవ్వలేదు. పైగా గతంలో కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ప్రాజెక్టులు కూడ తరలించారు. కేంద్రంలో మంత్రిగా వున్న కిషన్‌రెడ్డి తన శాఖ ద్వారా తెలంగాణకు ఎన్ని నిధులు కేటాయించారు. కేంద్రంలో మంత్రిగా వుండి తన శాఖ ద్వారా తెలంగాణకు ప్రత్యేకమైన నిధులు కేటాయించలేని కిషన్‌రెడ్డి తెలంగాణకు ఏదో చేస్తాడంటే ప్రజలు నమ్ముతారా? గత ఏడాది హైదరాబాద్‌లో వర్షాలు పడి కాలనీలన్నీ మునిగిపోతే బిఆర్‌ఎస్‌ నాయకులు రాత్రంతా ప్రజలకు అందుబాటులో వుంటూ వారికి సౌకర్యాల కల్పన కోసం పనిచేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇంటింటికి నెల సరుకులు అందజేసింది. కేంద్రం రూపాయి విడుదల చేయలేదు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అంతా తేరుకున్నాక పర్యటనలో కుర్‌కురే ప్యాకెట్లు పంచినట్లు ఫోటోలకు ఫోజులు ఇచ్చుకున్నాడు. ఇదీ బిజేపి నేతల తీరు. కేంద్ర ప్రభుత్వం దేశంలో వున్న ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకుంటూ పోతే, ముఖ్యమంత్రి కేసిఆర్‌, తెలంగాణ ప్రభుత్వం నిర్మాణాలు సాగిస్తోంది. అగ్రికల్చర్‌ను ప్రోత్సహిస్తోంది. తెలంగాణ ప్రభుత్వమే రైతు నినాదంతో పనిచేస్తోంది. కాని బిజేపి పార్టీకి మతం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదన్నట్లు, ప్రజలను విడదీసి రాజకీయాలు చేయడమే నేర్చుకున్నది. ఇక దేశంలో కూడా బిజేపి పని అయిపోయింది. తెలంగాణలో అసలు బిజేపికి ఉనికే లేదు. ఇంత ఎగిరిపడుతున్న బిజేపికి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో పోటీ చేసేందుకు అభ్యర్ధు లేరు. గత ఎన్నికల్లో 103 స్ధానాల్లో డిపాజిట్లు కోల్పోయిన పార్టీ బిజేపి. ఐదు సీట్లునుంచి ఒక్కసీటుకు పడిపోయింది. తర్వాత ఏదో రెండు ఉప ఎన్నికల్లో అత్తెసరు మెజార్టీ గెలిచి ఊకదంపుడు మాటల గారడీతో ప్రజలను మోసం చేస్తామనుకుంటన్నారు. కాని అది తెలంగాణలో చెల్లదు. తెలంగాణ ప్రజలు ఎంతో చైతన్య వంతులు. అసలు క్యాడర్‌ లేకుండా, లీడర్లు లేకుండా చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకుంటామంటే సరిపోదు. 

అసలు బిజేపి పెద్దలకు తెలంగాణ అంటేనే గిట్టదు. ఆ విషయం తెలంగాణ ప్రజలకు తెలుసు.తెలిసి తెలిసి నిప్పుల్లో తోసే బిజేపిని నమ్ముతారని బిజేపి నేతలు భ్రమల్లో వున్నారు. తెలంగాణ మీద బిజేపి పెద్దల వైఖరి మార్చలేని రాష్ట్ర బిజేపి నేతలను దగ్గరకు కూడా రానివ్వరు. పిడికెడు మంది లేని బిజేపి నేతలు, అధిపత్య పోరు తప్ప, తెలంగాణ బాగు కోసం పనిచేసిందేనాడు లేదు. తెలంగాణ కోసం పనిచేస్తారన్ననమ్మకం లేదు. అందుకే తెలంగాణ ప్రజలు బిజేపి నేతలకు ఇటీవల మునుగోడులో గుణపాఠం నేర్పారు. ఇక కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ వ్యతిరేకి రేవంత్‌రెడ్డి చేతుల్లో వుంది. అంటే రేవంత్‌రెడ్డి కేవలం రాజకీయాలు తప్ప, తెలంగాణ ప్రగతిని కాంక్షించే నాయకుడు కాదు. అందుకే ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మడానికి కూడా ఇష్టం లేరు. 

తెలంగాణ అంటే కేసిఆర్‌. కేసిఆర్‌ అంటే తెలంగాణ.ఇది ఎవరూ చెరపలేని సత్యం. సంక్షేమానికి ప్రతిరూపం కేసిఆర్‌. రైతుసంక్షేమ రాజ్యం తెలంగాణ. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన కేసిఆర్‌ ముందు నిలబడే అర్హత పార్టీలకు లేదు. నాయకులకు లేదు. ఎవరెస్టు శిఖరమంతటి నాయకుడు కేసిఆర్‌. నిరంతరం ప్రజలే ఆశగా, స్వాసగా సాగే నాయకుడు కేసిఆర్‌. అందుకే తెలంగాణ తెచ్చుకున్న ఇంత తక్కువ కాలంలో తెలంగాణ రూపు రేఖలు మార్చేశాడు. అభివృద్ది చేసి చూపించాడు. ప్రాజెక్టులు నిర్మాణం చేశాడు. రిజర్వాయర్లు కట్టించాడు. రైతన్నను సంతోషపెట్డాడు. రైతు కష్టం తీర్చాడు. అన్ని రంగాలలో తెలంగాణను ముందు వరసలో వుంచాడు. తెలంగాణలో అమలౌతున్నన్ని సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఎక్కడా అమలు కావడం లేదు. అందుకు పొరుగున వున్న మహారాష్ట్ర ప్రజలు కూడా బిఆర్‌ఎస్‌ను కోరుకుంటున్నారు. అక్కడ కూడా బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం రావాలనుకుంటున్నారు. కేసిఆర్‌ నాయకత్వం కోరుకుంటున్నారు. అందుకు మహారాష్ట్రలో బిఆర్‌ఎస్‌ సభలకు వస్తున్న ప్రజలే నిదర్శం. వారి నమ్మకమే బిఆర్‌ఎస్‌ ప్రభంజనం. ఎనమిదేళ్ల కింద తెలంగాణ ఎలా వుండేదో..ఇప్పుడు ఎలా వుందో చూస్తే చాలు..కేసిఆర్‌ అంటే ఏమిటో తెలుస్తుంది. రాజకీయాలు చేయాలన్న దోరణి తప్ప, ప్రతిపక్షాలకు తెలియంది కాదు. అయినా ప్రజలను మభ్యపెట్టాలని ప్రతిపక్షాలు చూసినా నమ్మే పరిసి ్ధతి లేదు. అందుకే ఈసారి కూడా వచ్చేది బిఆర్‌ఎస్సే..ముచ్చగటా మూడోసారి మరింత మెజార్టీ సీట్లతో అధికారంలోకి రావడం ఖాయం. వందకు పైగా సీట్లు రావడం తధ్యం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *