మహబూబాబాద్/ హైదరాబాద్ నేటిధాత్రి:
హైదరాబాద్ శాసనమండలి ఆఫీస్ ఆవరణంలోని ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా గెలుపొందిన తాత మధు ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో శిశు సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు కవిత,జెడ్పి చైర్ పర్సన్ బిందు పాల్గొన్నారు. ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వారికి ఈ సందర్బంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ముఖ్యమంత్రి మహ్మద్ ఆలీ, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్,పల్లా రాజేశ్వర్ రెడ్డి,ఖమ్మం ఎంపి నామ నాగేశ్వరరావు, ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ, ఖమ్మం డి సి సి చైర్మన్
కురాకుల నాగభూషణం, ఇల్లందు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ హరిసింగ్, బయ్యారం మండలం ప్యాక్ చైర్మన్
మూల మధుకర్ రెడ్డి,
ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.