అవకాశవాదులను సాగనంపాల్సిందే!
ఎన్నికల ముందు తలనొప్పులు తెచ్చేవారిని దూరం పెట్టాల్సిందే!
పార్టీ నిరంతర ప్రవాహం….
పార్టీ పురుడపోసుకున్న నాటి నుంచి వచ్చేవారు వచ్చారు…
వెళ్లేవారు వెళ్లిపోయారు…
రాజకీయాల్లో హత్యలుండవు…ఆత్మహత్యలే అన్నది నిజం…
ఎన్నికల మందు ప్రశాంతత పార్టీకి ఎంతో అవసరం….
పంటి కింద రాళ్లను పక్కన పెట్టాల్సిందే…
పక్క పార్టీల వైపు చూస్తున్నవారిని పంపేయాల్సిందే…
తెలంగాణ రాష్ట్ర సమితి పురుడు పోసుకున్న నాటి నుంచి నేటి దాకా వచ్చే వాళ్లు వచ్చారు..వెళ్లే వాళ్లు వెళ్లారు…మధ్యలో వదిలేసి వెళ్లి మళ్లీ వచ్చి చేరిన వారున్నారు..ఇంకా వెళ్లేందుకు అదును చూసుకుంటున్నవాళ్లు వున్నారు…పంటి కింద రాయిలా మారిన వాళ్లుకూడా వున్నారు…పక్క పార్టీల వైపు చూస్తున్న వారూ వున్నారు…రాజకీయ పార్టీ అన్నది నిరంతర ప్రవాహం…అది కొత్త నీరును చేర్చుకుంటూ వెళ్తుంది…అంతే కాని ఆగిపోయేది కాదు..స్వార్ధ పరులు ఎల్ల కాలం ఒకే దగ్గర వుండరు…అంకిత భావం వారిలో ఎప్పుడూ కనిపించదు. ఎప్పటికప్పుడు దారుల వెతుక్కుంటూ వుంటారు…ఎంత ప్రాధాన్యమిచ్చినా చంకన పెట్టుకున్నా జారి పోయేందుకే సిద్ధంగా వుంటారు….అలాంటి వాళ్లు ఎంత కాలం వున్నా పార్టీకి ప్రయోజనం లేదు. అత్యాశను వదలుకోరు…అంతా నాకే అనుకుంటారు…తనకు తాను గొప్పగా ఊహించుకుంటారు…అలాంటి వాళ్లు ముందు ఎవరూ ముందుకు వెళ్లొదు..పదవులు అందుకోవద్దు…ఇతరులు ఎదుగుతుంటే చూడలేరు…ఇలాంటి మనస్తత్వం వున్న వారు పార్టీకే ప్రమాదరకంగా మారుతారు…ఇతరల పాత్రలు కూడా తమకే కావాలని కుత్సితాలు పన్నుతుంటారు…ప్రజలు తిరస్కరించినా పదవులు కోరుతుంటారు…తీరకపోతే పార్టీకి తలనొప్పులు తెచ్చిపెట్టే కుట్రలకు తెరతీస్తుంటారు..అలాంటి ప్రతి పార్టీలోనూ వుంటారు…కాకపోతే అధికార పార్టీలో కాస్త ఎక్కువ మోతాదులో వుంటారు…కాని మరీ మితిమీరిన ఆశలతో పార్టీకి తీరని నష్టం చేకూర్చుతుంటారు…అవసరమైతే పార్టీకి కష్టం తెచ్చిపెట్టే కుతంత్రాలు కూడా చేస్తుంటారు…అలాంటి వారితో ఏ పార్టీకైనా జాగ్రత్త…అవసరం…
పైకి ప్రశాంతంగా సాగుతున్నట్లు కనిపించే నీటి కాలువలో వేగమంతా అడుగులోనే వుంటుంది….పైకి ఎంతో పచ్చగా వున్న చెట్టు వేరులోనే పురుగు చేరుతుంది. కాలువ ముంచుతుంది. చెట్టు పుట్టిపోతుంది. పైనంతా ప్రశాంతంగానే కనిపిస్తున్నా లోలోన వేరు పురుగులు చేరి వృక్ష్యాన్ని తింటున్నట్లు పార్టీలో కొందరు వ్యక్తులు నిత్య అసమ్మతి వాదులుగా తయారై, పార్టీకి చేటు చేస్తున్నారు. పార్టీ ఆశ్రయంతో పైకొచ్చి, రాజకీయంగా వెలుగులోకి వచ్చి, అందివచ్చిన పదవులు అందుకొని, కోట్లుకూడేసుకొన్నవాళ్లు చాలా మందేవున్నారు. ఇప్పుడు వాళ్లు పార్టీకి నష్టం చేయడానికి కూడా వెనుకాడడం లేదు. నిజాలు గ్రహించే స్ధితిలో అలాంటి నాయకులు లేరు. ప్రజలతో సంబంధాలు పెద్దగా లేవు. ఎంత సేపు తాను…తన పదవి…తన రాజకీయం ఇంతే…ఇలాంటి నేతలు పైన పటారం లోన లొటారం లాంటి పార్టీలలో చేరేందుకు, కండువాలు మార్చేందుకు రెడీ అంటున్నారు.
మాకు పదువులిస్తారా? లేక దూకమంటారా? టిక్కెట్లు ఇస్తారా? లేదంటే ప్రతిపక్షపార్టీల వైపు చూడమంటారా? అన్నట్లు భహిరంగ సంకేతాలే ఇస్తున్నారు. అలాంటి వారు ఎవరో పార్టీకి కూడా పూర్తిగా తెలుసు. ఒకనాటి వారి జీవితాలు వారికి గుర్తులేదు. నిన్నటి రోజులు మర్చిపోయారు. రేపటి రోజులపై ఆశలు పెంచకుంటూ కలలు గంటున్నారు. ఒక వేళ వారి కలలు నెవరవేరాలంటే కాస్తో, కూస్తో కొంత సమయం ఆగాలి. కాని వారికి అంత ఓపికలేదు. మిడిమిడి జ్ఞానంతో నేతలైనప్పుడు ఇంతకన్నా వాళ్లు ఎక్కువ ఆలోచించేలేరు. పార్టీ ప్రయోజనాల కోసం వారు పాటుపడరని తేలిపోయింది. అయినా వారిని ఉపేక్షించడం వల్ల తాము బలవంతులమని, సమర్ధులమని, తాము లేకపోతే పార్టీకి ఇబ్బందులున్న భ్రమల్లో తేలియాడుతున్నారు. పార్టీకి చేటు తెస్తున్నారు. ఇలాంటి వారు తెలంగాణ వ్యాప్తంగా జిల్లాకొకరున్నారు. వారి సంగతి తెలుసు. వారి రాజకీయ పరిజ్ఞానం తెలుసు. ప్రజల్లో వారికున్న బలం తెలుసు. తెరాస జెండా కింద బతికిన వారు కూడా జెండాముందు కాలరెగిరేస్తామంటున్నారు.
అలాంటి వారిపై పార్టీ వేటుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటిదాకా వేచి చూసి సమయం ఇవ్వడమే నష్టదాయకంగా మారే ప్రమాదం కూడా లేకపోలేదు. అందుకే వెంటనే అలాంటి నాయకులపై పార్టీ ఎప్పుడో దృష్టిపెట్టింది. అలాంటి నాయకుల్లో మేయర్‌గా పనిచేసిన బొంతు రామ్మోహన్ ముందు వరసలో వున్నట్లు తెలుస్తోంది. ఎంతో నమ్మకంతో ముఖ్యమంత్రి కేసిఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు కేటిఆర్ ప్రాదాన్యతనిచ్చారు. ఒక్కసారి అవకాశం కల్పిస్తే జీవితాంతం పార్టీకి విధేయుడుగా వుంటాడని నమ్మారు. ముఖ్యమంత్రి కేసిఆర్ ఎవరూ ఊహించిన పదవిని బొంతు రామ్మోహన్‌కు ఇచ్చారు. కాని ఆ పదవి కాలం పూర్తి కాకముందే కొత్త పదవిమీద బొంతు రామ్మోహన్ ఆశలు పెంచుకున్నాడు. గత ఎన్నికల్లోనే పార్టీని బ్లాక్ మెయిల్ చేసినంత పనిచేశాడు. ఒక పదవి చేసిన వారు ప్రతి సారి పదవి కావాలనుకోవడం తప్పు కాదు…కాని సమయం సందర్భం వుంటాయి. కాలం కూడా కలిసి రావాలి.
తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇప్పటికీ పార్టీకి సేవ చేస్తూ ఎలాంటి పదవులు అందని వారు కూడా వున్నారు… అయినా వాళ్లు పార్టీ కోసమే పనిచేస్తున్నారు. కాని కొందరు పదవులు అందుకొని కూడా మళ్లీ మళ్లీ తమకే పదువులు కావాలిన అత్యాశ వున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిలో వున్న మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఎన్టీఆర్ కాలం నుంచి తెలుగుదేశం పార్టీకి సేవ చేస్తూ వచ్చాడు. కాని ఆయనకు ఎమ్మెల్యే సీటు రావడానికి ముప్పై సంవత్సరాలు పట్టింది. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బలంగా వున్నంత కాలం ఆయనకు పార్టీ టిక్కెట్టు దక్కలేదు. అంతే కాదు ఆయన హైదరాబాద్ మేయర్ గా పనిచేసినా ఎమ్మెల్యే టిక్కెట్టు కావాలనుకున్నప్పుడు పార్టీ ఇవ్వలేదు. ఎదరుచూశాడు.పార్టీ నుంచి పిలుపు కోసం మేయర్ అయిన తర్వాత కూడా పదేళ్లు ఎదరు చూశాడు. అదీ పార్టీ కోసం నాయకులకు వుండే నిబద్దత. అంతే కాని మేయర్‌గా పనిచేస్తూనే నాకేం తక్కువ అని ఎమ్మెల్యే సీటు కోరి అబాసుపాలైనా, పార్టీని ఇబ్బందులకు గురిచేసినా పార్టీ బొంతు రామ్మోహన్‌ను కడుపులో పెట్టుకున్నది. మరోసారి కూడా ఆయన సతీమణికి అవకాశం కల్పించింది. ఇలా ఒకసారి పదవులు పొందినవారు వెంటనే పదవుల కోసం ఎదరు చూసిన వారు తెలుగు రాజకీయ చరిత్రలో చాలా మందే వున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు మేయర్‌గా పనిచేసి, తెలుగుదేశంపార్టీ కోసం జీవితం త్యాగం చేసిన బంగి అనంతయ్య అంటే ఎంతో ఫేమస్. కాని ఆయనకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇప్పటికీ రాలేదు. అలా అని ఆయన పార్టీని కాదనలేదు. ఉమ్మడి రాష్ట్రంలో సినీ నటుడు, మాజీ ఎంపి. మురళీ మోహన్‌కు టిటిడి చైర్మన్ పదవి చేపట్టాలని కోరిక. కాని ఆ కోరిక ఈనాటికి తీరలేదు. అలా అని ఆయన పార్టీ వదిలేయలేదు. ఇలా పదవులు రానంత మాత్రాన పార్టీకి ద్రోహం చేసే యోచన చేస్తూ స్వార్ధపూరిత రాజకీయాలు చేయడం అలవాటు చేసుకున్నవారిని పక్కన పెట్టడమే కరక్టు.
తెలంగాణలో టిఆర్‌ఎస్ పార్టీకి చేటు తెచ్చేందుకు కంకణం కట్టుకున్న వారందరినీ పక్కన పెడితే తప్ప లాభం లేదు. కొల్లాపూర్ ఎన్నికల్లో ఓడిపోయిన మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ వ్యతిరేక కార్యక్రమాలుచేశారు. తన వర్గం అంటూ పార్టీకి వ్యతిరేకంగా కౌన్సిలర్లును నిలబెట్టారు. ఆనాడే ఆ నాయకుడిపై వేటు వేస్తు ఇప్పుడు ఈ బెదిరింపులు వుండేవి కాదు…ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు పెద్దగానే వుంది. ఇలాంటి వారి పార్టీకి ప్రయోజనం అన్నది ఎప్పుడూ వుండదు. అలాంటి వారు తమకు తాముగానే అసమ్మతి వాదులుగా ముద్రలేసుకుంటుంటారు.. పార్టీ పరపతిని దిగజార్చుతుంటారు.. అందుకే వారిని దూరం పెట్టడం ఎంతో మంచిది…ఇదే ఆలోచన ముఖ్యమంత్రి కేసిఆర్ కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది….వారి పని అయిపోయినట్లే,చర్యలు తప్పవనే వాఖ్యలే వినిపిస్తున్నాయి. తెలంగాణలో ప్రతిపక్షాలకు పెద్దగా బలం లేదు. ప్రజల్లో వారిపై నమ్మకం లేదు. పదేళ్లుగా వారు నిర్ధిష్టమైన ప్రతిపక్ష పాత్ర పోషించింది లేదు. అరవైఏళ్ల గోసనుంచి విముక్తి కావించి, ప్రజా సంక్షేమ రాజ్య నిర్మాణం చేసి, ప్రగతికి తెలంగాణను చిరునామాను చేసిన ముఖ్యమంత్రి కేసిఆర్‌పై ప్రజలక వున్న నమ్మకం అంతా ఇంకా కాదు. ఇంకా ఎన్నేళ్లైనా చెక్కుచెదిరేది కాదు. ఈ ఎన్నికలే కాదు, భవిష్యత్తులో కూడా ప్రతిపక్షాలకు ఆశలేలేవు. కాని తన్నింటి వాసాలు లెక్కబెట్టే కొందరు ప్రతి పక్షాల అసత్య ప్రచారాలను చూసి పక్క చూపులు చూస్తున్నారు. పార్టీ మారుతామని పరోక్ష సంకేతాలిస్తున్నారు. టిఆర్‌ఎస్ భుజ్జగిస్తుందన్న భ్రమల్లో తేలియాడుతున్నారు. అధికార తెరాసను వదిలి ప్రతిపక్షాలలోకి వెళ్లే పదవులు వస్తాయన్న గ్యారెంటీ లేదు. ఆ పార్టీలలో నాయకత్వ లేమిని తాము తీర్చుతామన్న ఆశల్లో వెళ్లినా, జనం ముఖం చూస్తారన్న నమ్మకం లేదు. కూడారన్న సంగతి తెలిసి కూడా బురద రాజకీయమే రంజుగా వుంటుందనుకునేవారు ఎంత కాలమైనా మారరు…వారిని పార్టీ వదులుకోక తప్పదు…కొత్త తరం ఆవిష్కరణ జరక్క తప్పదు…