ఈటెల సారే కొండంత అండ..?,

ఈటెల పేషిలో అవినీతి ‘ప్రసాద’ం-2

ఈటెల సారే కొండంత అండ..?

ఓ ప్రభుత్వంలో అది క్యాబినెట్‌ మంత్రి పేషిలో పదవీవిరమణ పొందిన వ్యక్తి, అన్ని విధాలుగా లాభపడి తరాలు తిన్న తరగని ఆస్తిని కూడబెట్టుకున్న వ్యక్తి ఇంకా అత్యాశతో, అధికారంపై మోజుతో తన ఉనికిని చాటుకుంటూ ఏకంగా వైద్య, ఆరోగ్యశాఖనే తన గుప్పిట్లో పెట్టుకున్నాడంటే ఇది మామూలు విషయం కాదు. అదికార యంత్రాంగాన్ని, సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆదేశాలను సైతం లెక్క చేయకుండా ఈటెల పేషిలో షాడోమంత్రిగా కొనసాగుతున్నాడంటే దీని వెనకాల ప్రోత్సాహం ఎవరిది. ఓ వ్యక్తి తనంతట తానే పేషిలో చొరబడి పెత్తనం చెలాయించాలనుకోడు అది ఎవరికి సాధ్యం కాదు. నకిలీ ఐపిఎస్‌, నకిలీ ఐఎఎస్‌ లంటూ బయట వసూళ్లకు పాల్పడిన వ్యక్తులను జైలుకు పంపించే అధికారులు ఓ మంత్రి శాఖలోనే చేరింది ఓ ఉద్యోగం, చెప్పుకునేది ఓ హోదా, కార్యకలాపాలు కొనసాగించేది నకిలీ హోదాతో ఇంత జరుగుతున్న ఎందుకు మిన్నకుండిపోయారు. జరుగుతుందే తప్పే అని తెలిసిన చర్యలు తీసుకోవడానికి కావల్సిన ఆధారాలన్ని సాధారణ పరిపాలనశాఖ (జిఎడి) దగ్గర ఉన్న ఎందుకు మిన్నకుండిపోయారు..? ఈ అనుమానాలన్ని నకిలీ ఓఎస్డీగా చెలామణి అవుతున్న జక్కన ప్రసాద్‌ విషయంలో ఎవరికైన రామానవు. అయితే వీటన్నింటికి సమాధానం మనకు దొరకకపోయిన కొందరికి ఇది బేతాళ ప్రశ్నగా మారినా, సరైన సమాధానం చెప్తే చేసే ఉద్యోగానికి ఎసరు వస్తుంది కనుక ఎవరు పెదవి విప్పరు. పైగా అది పెద్దమనుషుల వ్యవహారం మనకెందుకులే అనుకుంటారు. నిఘావర్గాలు సైతం విషయాన్ని పసిగట్టగలిగిన సీఎం దృష్టికి తీసుకువెళ్లకుండా విషయాన్ని నొక్కిపెట్టారంటే నకిలీ ఓఎస్డీకి అవునన్న, కాదన్న మంత్రి ఈటెల అండదండ ఉందనేది ఖచ్చితంగా నమ్మాల్సిన విషయం. తన శాఖలో అవినీతి ‘ప్రసాద’ం కొనసాగడానికి ఈటెల అనుమతి ఉందనేది ఈ వ్యవహరాన్నంతటిని చూస్తే చాలనట్లుగా అర్థం అవుతుంది. ఓఎస్డీ హోదాలో పలు పనులు చేయమని ఉత్తరాలు వివిధ శాఖలకు పంపుతున్నాడంటే పలాన పని అని మంత్రి సూచించకుండా ఈ నకిలీ ఓఎస్డీకి సాధ్యం కాదు. అందుకే ఈటెల ప్రమేయం ఖచ్చితంగా ఉంటుంది.

ఎలా చొరబడ్డాడు..?

ఒకప్పుడు వైఎస్‌ హయంలో ఆర్థికశాఖలో డిప్యూటీ డైరెక్టర్‌, సంపాదనలో అత్యంత తెలివిగా చేయి తిప్పుకున్న వ్యక్తి అక్రమార్జనే ధ్యేయం కనుక సరసాదేవి కుంభకోణంలో ఎ2గా ఉన్న వ్యక్తి. ఇవన్ని మంత్రి పేషిలో అడుగుపెట్టే ముందు అక్కడి అధికారులకు ఇతగాడి చిట్టా అంతా తెలిసే ఉంటుంది. అయినా ఎలా పేషిలో చొరబడ్డాడు. అసలు వ్యక్తులను కాదని నకిలీ ఓఎస్డీ తన ప్రభావాన్ని మంత్రి ఈటెలపై ఎలా చూపగలుగుతున్నాడంటే ఎవరిని ఎలా మేనేజ్‌ చేయాలో ఎక్కడ మీట నొక్కితే ఏ పని జరుగుతుందో జక్కన ప్రసాద్‌ అలియాస్‌ నకిలీ ఓఎస్డీ ‘ప్రసాద’ంకు బాగా తెలుసట. అందుకే మంత్రి సోదరుడిని కలిసి కాళ్లవేళ్ల పడి బ్రతిమిలాడుకుని ఈటెల పేషిలో దూరాడట. అది కన్సల్టెంట్‌ పేరుతో కాని కొద్దిరోజులకే తన అతితెలివికి మరింతగా పదునుపెట్టి అనధికార ఓఎస్డీగా అందలం ఎక్కాడు. అనుభవం ఉన్న వాడు కొర్రీలు పెట్టడంలో, అసాధ్యాన్ని సుసాధ్యం చేయడంలో, బండమీద పావుశేరు పుట్టించే రకం కనుక ఉండనట్లు మనకే మంచిది కదా అని మంత్రి భావించారట. కానీ ఇలా చేయడం సరికాదని మంత్రి కూడా గమనించలేకపోయాడట.

ప్రైవేట్‌ పిఎలకు పెద్దదిక్కు

పదవతరగతి చదువుకున్న మాటకారి చేయి తిరిగిన పిఎలకు నకిలీ ఓఎస్డీ ‘ప్రసాద’ం పెద్దదిక్కుగా మారాడట. చదువుసంధ్య లేకున్నా ఉన్నతాధికారులకు సైతం ఫోనులు చేసి మంత్రి పిఎను మాట్లాడుతున్నానంటూ హుకుంలు జారీ చేసే ఈ ప్రైవేట్‌ పిఎలకు ఏం కావాలన్న ఇతగాడు నిమిషాల్లో సమకూర్చి పెడతాడట. అసెంబ్లీ పాస్‌లు, సచివాలయ గేట్‌పాస్‌లు అందిస్తూ వారి వద్ద మార్కులు కొట్టే పనులు చేస్తూ మా ప్రసాద్‌ సార్‌ అనిపించుకుంటాడట. ఇది ఎంతవరకు వెళ్లిందంటే ‘నేటిధాత్రి’లో కథనం రాగానే పాపం…ప్రసాదన్న అంటూ ఎడిటర్‌కు ఓ ప్రైవేట్‌ పిఎ మెసేజ్‌ చేసి సానుభూతి వ్యక్తం చేస్తూ తన వీరభక్తి చాటుకున్నాడు.

అసలు పిఎలు ఎవరు…? తలపట్టుకుంటున్న అధికారులు

వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ వద్ద అసలు పిఎలు ఎవరో తెలియక వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారట. మంత్రిని కలవడం అనేది వీరికి ఓ సమస్యగా మారిపోయిందట. ఏదైనా విషయం చెప్పాలంటే మంత్రికి ఫోన్‌ చేస్తే రోజుకో వ్యక్తి మాట్లాడుతూ తాను మంత్రి పిఎనని చెప్తారట. అయితే అధికారులు మాత్రం అసలు పిఎ ఎవరో తెలియక తికమకపడుతున్నారట. పనుల విషయంలో సైతం వీరు అధికారులకు ఫోన్లు చేసి చెప్తుంటారట. అధికారులు ఎవరు అసలో…ఎవరు నకిలో తేల్చుకోలేకపోతున్నారట. ఈ విషయం మంత్రి దృష్టికి అనేకసార్లు తీసుకువచ్చిన లాభం లేకుండాపోయిందట. ఇక్కడ మరో అసలు విషయం ఏంటంటే మంత్రి ఈటెల వద్ద పిఎలం అని చెప్పుకుంటున్న వీళ్లు ఇంటర్‌ విద్య కూడా దాటనివాళ్లే. వీళ్లా ఉన్నతాధికారులకు ఫోన్లు చేసి పనులు చేయండని పురమాయించడం, అరకొర తెలివితో మాట్లాడడం అధికారులకు బాధను కలిగిస్తోందట.

ఓ శాఖ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అండ

నకిలీ ‘ప్రసాద’ం తన హవాను ఈటెల పేషిలో కొనసాగించడానికి, తాను ఆడింది ఆట…పాడింది పాటగా కొనసాగడానికి ఓ శాఖ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అండ ఉన్నట్లు తెలుస్తోంది. జక్కన ప్రసాద్‌ ఏం చేసినా సమర్థించే ఇతగాడు గతంలో ‘ప్రసాద’ంతో అత్యంత సన్నిహితంగా మెలిగినవాడేనట. వైద్య, ఆరోగ్యశాఖకు సంబంధించి చెల్లింపులు, నకిలీ ‘ప్రసాదా’నికి కావల్సిన జీతభత్యాల విషయం ఈ మేనేజింగ్‌ డైరెక్టరే చూసుకుంటాడని సమాచారం. ఈయనగారు కూడా అర్హత లేకున్నా అడ్డదారిలో మేనేజింగ్‌ డైరెక్టర్‌ అందలం ఎక్కినట్లు విశ్వసనీయ సమాచారం. ఐఎఎస్‌ స్థాయి అధికారి కొనసాగాల్సిన ఈ పోస్టులో మంత్రి అండదండలో పదవి చేపట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విషయం సీఎం దృష్టికి కూడా పోకుండా చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!