ఇండ్లే పేకాట కేంద్రంగా నడుపుతున్న యాజమానులు

మద్యం సేవిస్తూ పేకాట ఆడుతూ ఎంజాయ్

లీడర్లు, ఫైనాన్స్, మద్యం వ్యాపారులదే హవా

ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు

*వరంగల్ సిటి నేటిధాత్రి*

వరంగల్ నగరంలో పేకాట కేంద్రాలు మూడు పూలు ఆరు కాయలుగా నడుస్తున్నాయి ఇందుకు ఇంటి యజమానులే ఒక సెటప్ ఏర్పాటు చేసుకొని గ్యాంగ్ గా ఏర్పాటై గుట్టు చప్పుడు కాకుండా నడుపుతున్నట్టు సమాచారం అండర్ రైల్వే గేటు ప్రాంతంలో విచ్చలవిడిగా పేకాట కేంద్రాలు ఏర్పాటు చేసుకుని రాత్రింబవళ్లు నడుపుతున్నారు కరిమాబాద్,ఎస్ ఆర్ ఆర్ తోట గుండుబావులు, జన్మభూమి జంక్షన్ ,నానామియాతోట,చెట్లోల్ల గడ్డ, 60 ఫీట్ల రోడ్డు ప్రాంతంలో ఇండ్లలోనే కేంద్రాలు ఏర్పాటు చేసుకుని వేలకు వేలు నగదు పెట్టి నడుపుతూ పబ్బం గడుపుతున్నారు ఇందులో బడాబాబుల చేతులు కూడా ఉన్నట్టు సమాచారం పోలీసులు దాడులు చేసినప్పటికీ ఈ తతంగం మాత్రం కొనసాగుతూనే ఉంది పొలిటికల్ లీడర్లు, ఫైనాన్స్ వ్యాపారులు, మద్యం వ్యాపారులు, దండిగా డబ్బులు పోసి ఆడుతూ కాలం వెల్లదీస్తున్నారు ఇంట్లోనే ఒక సెటప్ ఏర్పాటు చేసుకుని పేకాట తో పాటు మద్యం సేవిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు కరోనా నేపథ్యంలో పోలీస్ సిబ్బంది లాక్ డౌన్ అతిక్రమించకుండా కట్టడి చేస్తుంటే గుంపులుగా చేరి మద్యం సేవిస్తూ పేకాట ఆడటం పై చుట్టు పక్కల ప్రాంతాల వాసులు తప్పు పడుతున్నారు ఇలా పేకాట ఆడుతూ మనస్పర్థలు పెంచుకుంటూ శత్రుత్వం తో గొడవలకు దారి తీస్తున్నట్టు తెలుస్తుంది అసలే కరిమాబాద్ సిరంగిరాజారామ్ తోట ప్రాంతాల్లో గత కొన్ని రోజుల నుండి ఆకతాయిలు హాల్ చేస్తూ రోడ్ల పై నిలిచి ఉన్న కారు ద్విచక్రవాహనాలను ధ్వంసం చేశారు మరో సంఘటనలో కర్రలతో కత్తులతో దాడులు చేసుకున్న ఘటనలు ఉన్నాయి ఇలాంటి సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో పేకాట కేంద్రాలను నడిపిస్తూ శత్రుత్వాలు పెంచుకుంటున్నారు అని చెప్పొచ్చు ఏది ఏమైనప్పటికి లాక్ డౌన్ నేపథ్యంలో రోడ్లపై కారణాలు లేకుండా తిరిగే వారిని ఇటు సాయంత్రం 7 గంటల తరువాత కర్ఫ్యూ నేపథ్యంలో తెరచి ఉన్న దుకాణాలను నివారిస్తూ విచ్చల విడిగా తిరిగే గ్యాంగులను కట్టడి చేస్తున్న పోలీసులకు ఇది ఒక సవాల్ గా మారింది ఏది ఏమైనప్పటికి ఇలాంటి సంఘటనలను ఛేదించటంలో మిల్స్ కాలనీ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి పేకాట నడుపుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోటానికి ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తున్నట్టు సమాచారం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *