ఇంటింటి చెత్త తీయుటకు మరియు దుకాణదారులు స్వచ్ఛ చెత్తను జిహెచ్ఎంసి ఆటో వారికి మాత్రమే చెత్తను అందచేయాలి

జిహెచ్ఎంసి

ఉప్పల్ నేటిధాత్రి:

ఎల్బీనగర్ జోన్ జోనల్ కమిషనర్ ముకుంద రెడ్డి , ఉప్పల్ సర్కిల్ ఆఫీసు యందు శానిటేషన్ మరియు ఎంటమాలజీ విభాగానికి సంబంధించిన సానిటరీ జవాన్స్, సానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్స్ ,శానిటరీ సూపర్వైజర్స్ తో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్ లో శానిటేషన్కు సంబంధించి ఇంటింటి చెత్త తీయుటకు మరియు దుకాణదారులు మరియు ప్రతి ఇంటి వారిని స్వచ్ఛ ఆటో వారికి అనుసంధానం చేసి చెత్తను జిహెచ్ఎంసి ఆటో వారికి మాత్రమే చెత్తను అందజేయు విధముగా అందరికీ అవగాహన కల్పించాలని తెలియజేసినారు. ప్రతి షాపు యజమాని మరియు చిరు వ్యాపారి డస్ట్ బిన్ తప్పనిసరిగా పెట్టుకోవలసిన విధముగా శానిటేషన్ సిబ్బంది ద్వారా మరియు మహిళ గ్రూపు ఆర్పిల ద్వారా మరియు ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది ద్వారా అవగాహన కల్పించాలని, చెత్తను ఆటోకు అందించని వారికి మరియు షాపుల వద్ద బిన్ ఏర్పాటు చేసుకొని దుకాణదారులకు పెనాల్టీ విధించవలసినదిగా చెత్తను రోడ్లపై పడవేయువారికి పెనాల్టీ విధించవలసినదిగా అధికారులను ఆదేశించినారు .ఈ కార్యక్రమంలో ఉప్పల్ డిప్యూటీ కమిషనర్ ఆంజనేయులు,మరియు డి ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ చందన , సానిటరీ సూపర్వైజర్లు రాజేశ్వర్ రెడ్డి మరియు సుదర్శన్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఫిరోజ్ మరియు ఎంటమాలజీ ఏఈ నరేష్ రెడ్డి , పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *