టిపిటిఎఫ్ పూర్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాస్
మహబూబాబాద్,నేటిధాత్రి:అటవీ సంరక్షణ చట్టాల సవరణ పేరుతో అడవి నుంచి ఆదివాసీలను గెంటేయజూస్తున్న కార్పొరేట్ విధానాలను తిప్పికోట్టి ఆదివాసీ,గిరిజన హక్కులను రక్షించినపుడే కొమురం భీం కు నిజమైన నివాళి అని టీపీటీఎఫ్ పూర్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాస్ అన్నారు.టీపీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన భీం జయంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జల్,జంగిల్, జమీన్ ల నుండి ఆదివాసీ,గిరిజనులను ఎవ్వరూ విడదీయలేరని అవి వారి జన్మహక్కని అన్నారు. అడవి,ఆదివాసీల రక్షణ కొరకు ఉన్న చట్టాలను నీరుగార్చేలా చేస్తున్న సవరణలు అటవీ సంపదను,గనులను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడానికేనని ఆరోపించారు.దేశ వనరుల మీద 90 శాతం ఉన్న ప్రజల హక్కును నిరాకరించి 10 శాతం సంపన్నులు మరింత సంపన్నులుగా ఎదగడానికి చేస్తున్న ప్రయత్నాలను అన్ని వర్గాల ప్రజలు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చుంచు శ్రీశైలం,ఉపాధ్యక్షులు బలాస్టి రమేష్,కార్యదర్శి సోమ విష్ణువర్ధన్ మహాబాద్ మండల బాధ్యులు రాచకొండ ఉపేందర్, ఎస్.విద్యాసాగర్,నెల్లికుదురు బాధ్యులు సంగ శ్రీనివాస్, నాయకులు ఏ.గోవర్ధన్,కోడెం శ్రీనివాస్,కె.వెంకటేశ్వర్లు,పి.రమేష్,ఏ.రవి,ఎస్.కె.సర్వర్, ఎమ్.డి రఫీ పాల్గొన్నారు.