అధికారాలే కాదు…కనిపించని అవమానాలు!?

`ఎన్నో కలలుగని వచ్చిన వారు కూడా ఉద్యోగాన్ని వదులుకున్నవారున్నారు?

`పాలకుల ఒత్తిళ్లకు తొలొగ్గి ఇబ్బందులు పడ్డవాళ్లున్నారు?

`పాలకులు చెప్పినట్టు వినని వాళ్లు లూప్‌ లైన్లో వుంటారు?

`ప్రాధాన్యత లేని పదవులు నిర్వహిస్తుంటారు?

`మేము నాయకులమౌతామని పార్టీలు పెట్టిన వాళ్లున్నారు?

`పాలకులు నచ్చక ఉద్యోగం వదిలేసిన వాళ్లు కూడా వున్నారు?

`నాయకులను గడగడలాడిరచిన వాళ్లు వున్నారు?

`పాలకులు తప్పు చేస్తుంటే సరి చేసిన వాళ్లున్నారు?

`వాళ్లెంత కష్టపడ్డా ప్రజలు సంతోషంగా వుంటే చాలనుకుంటారు?

`అప్పుడప్పుడు సవాళ్లు ఎదుర్కొంటారు!

`పాలకుల చిన్న చూపును భరిస్తుంటారు!

`సమాధానం చెప్పలేక, వాళ్ల వద్ద లేక కాదు, పాలకుల పరువు కాపాడేందుకు మౌనం వహిస్తుంటారు?

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ఒకప్పుడు ఐఏఎస్‌ అధికారులంటే సమాజంలోనే కాదు, రాజకీయ వర్గాల్లోనూ ఎనలేని గౌరవం వుండేది. ఉద్యోగ పరంగా వారి హోదాకు కూడా ఎంతో విలువుండేది. జిల్లా కలెక్టర్‌ వస్తున్నారంటే ఎమ్మెల్యేలు సైతం పరుగెత్తుకెళ్లేవారు. ఎంపిలు కూడా కలెక్టర్ల పిలుపు కోసం ఎదురుచూసేవారు. కాని ఇప్పుడు పరిస్ధితి దేశ వ్యాప్తంగా మారింది. అన్ని రాష్ట్రాల్లోనూ సివిల్‌ సర్వీసెస్‌ ఉద్యోగులకు అంత గౌవరం వుండేది కాదు. ఒకప్పుడున్న అపరిమితమైన అధికారాలు ఇప్పుడూ వున్నాయి. కాని రోజులే మారాయి. రాజకీయ పరిస్ధితులు మారుతున్నాయి. పాలకుల తీరు మారుతోంది. వారి ఆలోచనలకు తగ్గట్టు ఐఏఎస్‌, ఐపిఎస్‌లు పనిచేయాలని చూస్తున్నారు. వారి కనుసన్నల్లో వుండేలా చూసుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అపరిమితమైన అధికారాల స్వేచ్ఛ చుట్టూ అల్లిన పంజరంలో వుంటున్నారు. పేరుకు పెద్ద ఉద్యోగం. పాలకులు చెప్పిందే చేయాలి. వారికి నచ్చే విధంగా నడుచుకోవాలి. పాలకల మాటను తుచ తప్పకుండా పాటించాలి. పాలకులు కోరుకుంటున్న రీతిలోనే వారు పనులు చేయాలి. వారి సూచనలు కూడా ఆ దిశగానే వుండాలి. అంతే తప్ప పాలకులు అడగకముందే వారి ఆలోచనలు చెప్పొద్దు. అసలు ఐఏఎస్‌లు మర మనుషులుగా మాత్రమే పనిచేయాలి. ఇది ఏ ఒక్క రాష్ట్రానికి పరితమైంది కాదు…ఏ రాష్ట్రంలోనూ ఇందుకు భిన్నంగా రోజులు లేవు. టెక్నాలజీ పెరిగింది. మరింత చైతన్యవంతమైన సమాజ నిర్మాణం జరుగుతోంది. రాజకీయ నాయకుల పలుకుబడి మాత్రమే పెరుగుతోంది. అధికారుల స్వేచ్ఛకు ముళ్లకంచెలు పడుతున్నాయి. ఆ మధ్య ఓ ఉత్తరాధి రాష్ట్రంలో బిజేపి ఎంపి.

అక్కడి ఎస్పీని పది మందిలో కొట్టిన సంఘటన పెద్ద వైరల్‌ అయ్యింది. అసలు జిల్లాకు ఎస్పీ అంటే ఎంతో హడల్‌. అలాంటి వారిని ఎంపిలు, ఎమ్మెల్యేలు తమ చెప్పుచేతుల్లో వుంచుకునేందుకు పోటీ పడుతున్నారు. రాజకీయ నాయకులు తమ పలుకుబడిని ఉపయోగించుకొని వారిపై పెత్తనం చేస్తున్నారు. ముఖ్యంగా బిజేపి పాలిత రాష్ట్రాల్లో ఐఏఎస్‌లపై పెత్తనం మరింత ఎక్కువగా వుందన్న ఆరోపణలు కూడా వుంటున్నాయి. గతంలో ఐఏఎస్‌, ఐపిఎస్‌ల గౌరవం ఎంతో గర్వంగా వుండేది. ఇప్పుడు నానాటికీ తీసికట్టు నాగం బొట్టు అన్నట్లు తయారైందన్న మాటలు వినిపిస్తున్నాయి. ఎంత సేపు పాలకులు చెప్పే వాటిని మాత్రమే అమలు చేయాల్సిన పరిస్ధితి ఎదరౌతోంది. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌. రాజశేఖరరెడ్డి పాలన నుంచి ఐఏఎస్‌లను తమ కంట్రోల్‌లో పెట్టుకోవడం మొదలైందనే చెప్పాలి. అంతకు ముందు కొన్ని విషయాలు చర్చించుకుంటే ఎంతో ఆసక్తి కలిగిస్తాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలో వున్న సమయంలో బోళ్ల బుల్లిరామయ్య అనే మంత్రి వుండేవారు. ఆయన సీనియర్‌ నాయకుడు. ఎంపి ఎన్నికల్లో సూపర్‌ కృష్ణను ఓడిరచిన నాయకుడు. అలాంటి నాయకుడి దగ్గరకు ఓ అధికారి తన ప్రమోషన్‌ కోసం వచ్చి కలెక్టర్‌కు ఒక్క మాట చెబితే పని అయిపోతుందన్నాడు. బోళ్ల బుల్లిరామయ్య చాలా సేపు సంశయించాడు. పని చేసిపెట్టకపోతే అసమ్మర్ధ నాయకుడౌతాడు. తాను చేసిన సిఫారసు కలెక్టర్‌ పట్టించుకోకపోతే పరువు కాస్త తనకు తానే తీసుకున్నట్లౌవుంది. తన వద్దకు వచ్చిన అధికారి కోసం రూపొందించిన సిఫారసు లెటర్‌ను చించేసి, డస్టుబిన్‌లో పడేసి, రేపు మరోసారి వచ్చి కలువు అన్నాడట. ఆ సాయంత్రం కొంత ధైర్యం కూడదీసుకొని కలెక్టర్‌కు ఫోన్‌ చేసి, ఆ పని చేసిపెట్టమని రిక్వెస్టు చేశాడట. ఇదీ ఒకప్పుడు నాయకుల్లో నిబద్దత…ఐఏఎస్‌లకు వున్న విలువ. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా వున్న సమయంలో ఆయన వద్ద పనిచేసిన జయప్రకాశ్‌ నారాయణతో ప్రతి విషయాన్ని ఎన్టీఆర్‌ కూలంకుషంగా చర్చించేవారట.

వారి సూచనలు , సలహాలు తప్పకుండా స్వీకరించేవారట. అలా ఉమ్మడి రాష్ట్రంలోపూర్వపు ముఖ్యమంత్రులందరూ ఐఏఎస్‌ అధికారుల సమావేశాలు ఏర్పాటు చేసి, వారి సూచనలు తీసుకుంటూ వుండేవారు. సమీక్షలు నిర్వహించి, ప్రభుత్వ పధకాలు ప్రజలకు చేరవేసేందుకు వారిని రిక్వెస్టు చేసేవారు. కాకపోతే తమకు నచ్చని అధికారులను, తమకు సహకరించని అధికారులను పక్కన పెట్టడం అప్పుడూ వుంది…ఇప్పుడూ వుంది…కాకపోతే ట్రీట్‌ మెంటులో కొంత తేడా వుంది. ఒకప్పుడు ఎమ్మెల్యేలు సైతం ఐఏఎస్‌లకు కొంత భయపడేవారు. ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఏది చెబితే, అది కలెక్టర్లు చేయాల్సిందే…లేకుంటే ట్రాన్స్‌పర్‌ కావాల్సిందే…ఇది దేశంలోని అన్ని రాష్ట్రాలలో వున్నదే…కాకపోతే ఇప్పటికీ ఎంతో కొంత గౌరవం ఐఏఎస్‌లకు తెలంగాణ రాష్ట్రంలో వుందని కూడాచెప్పొచ్చు. అక్కడక్కడా ఇక్కడ కూడా కొన్ని వివాదాలు ఎదరైన సందర్బాలు కూడా వున్నా, ఐఏఎస్‌లను ఎంతో గౌరవంగా చూసుకుంటున్న రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి. ఎందుకంటే పరిపాలనా విషయాల్లో అనుభవం వున్న అనేక మంది రిటైర్టు ఐఏఎస్‌ అధికారులను కూడా తిరిగి వారి విధులను వినియోగించుకుంటున్న రాష్ట్రం తెలంగాణ. దేశంలో ఐఏఎస్‌ అధికారులు, ఐపిఎస్‌ అధికారులు అధికారాలే కాదు…

కనిపించని అవమానాలు కూడా ఎదుర్కొంటున్నారు. అందుకే కొందరు సర్వీసులను కూడా వదిలి వెళ్లిపోతున్నారు. ఉద్యోగాలకు రాజీనామాలు చేస్తున్నారు. ప్రజలను చైతన్యం చేసే పని పెట్టుకుంటున్నారు. కొందరు రాజకీయాల్లో చేరుతున్నారు. పార్టీలకు నాయకత్వాలు వహిస్తున్నారు. పాలకులు ఐఏఎస్‌ల మాటలు వినాలన్న రూలేం లేదు. పాలకులు చెప్పినట్లే ఇండియన్‌ సివిల్‌ సర్వీసెస్‌ ఉద్యోగులు చేయాలి. అయితే ప్రజాశ్రేయస్సు కోసం మాత్రం ఐఏఎస్‌లు ఆలోచించాలి. పాలకులు చెప్పిన ప్రతి దానికి తలూపడం కూడా చేయకూడదు. కాని అదే వైఎస్‌ హయాంలో ఎంతో మంది ఐఏఎస్‌ల కొంప ముంచింది. కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్‌రెడ్డి విషయంలో ఐఏఎస్‌లు జైలుకు వెళ్లాల్సిన పరిస్ధితి ఎదురైంది. అందుకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ కారణమన్న దానిపై అనేక చర్చలు సాగిన మాట తెలిసిందే. అయితే ఓసారి జగన్‌ కోర్టుకు హజరైన సందర్భంలో ఓ మహిళా ఐఏఎస్‌ అధికారి జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిందని అప్పట్లో పెద్దఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలియంది కాదు. ఎంతో నిజాయితీ పరురాలుగా పేరున్న ఓ మహిళా ఐఏఎస్‌ జైలు జీవితంలో కనీసం నడవలేని స్ధితికి చేరుకున్న సందర్భం చూశాం. ఇదంతా పాలకుల ఒత్తిళ్లకు తలొగ్గి చేసుకున్న స్వయంకృతాపరాధంగా కూడ చెప్పొచ్చు. అయినా ప్రభుత్వం ఏది చెయ్యమంటే అది గుడ్డిగా చేయడం వల్ల జరిగిన పరిణామాలను చూసైనా ఐఏఎస్‌ అధికారులు కొంత జాగ్రత్తగా వుండాలని అంటుంటారు. ఏ ఐఏఎస్‌ అధికారైనా తాను ప్రభుత్వంలో మంచి శాఖలో పనిచేసి, ఆ శాఖకు మంచి పేరు తేవాలనే కోరుకుంటాడు. సంస్కరణలు అమలు చేయించి, ఆ శాఖను తీర్చిదిద్దాలనుకుంటాడు. తనకు మంచి పేరు వస్తుందా? రాదా? అన్నది ఎప్పుడూ ఆలోచించరు. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో మార్కెట్‌ యార్డుల నిర్మాణం వంటి ఓ వినూత్నమైన కార్యక్రమం ఓ ఐఏఎస్‌ అధికారి ఇచ్చిన సూచనల మూలంగా చేపట్టారు. అవి దేశ వ్యాప్తంగా ఆదర్శమయ్యాయి.  నాయకులను గడగడ లాడిరచిన ఐఏఎస్‌లు, ఐపిఎస్‌లు కూడా ఉన్నారు.

అయితే సహజంగా ప్రతిపక్షాలలో వున్న నాయకులపై సివిల్‌ సర్వీసెస్‌ ఉద్యోగులు ఇటీవల అనుసరిస్తున్న తీరు కూడా కొంత వివాదాస్పదమౌతోంది. అది తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా తెలంగాణ ప్రజలు ప్రత్యక్షంగా చూసిందే…!అప్పటి పాలకుల ఒత్తిళ్ల మూలంగా తమకు ఇష్టం లేకున్నా, తెలంగాణ ఉద్యమం మీద గౌరవం వున్నా, కొన్ని సార్లు అంతరాత్మ ప్రభోదంగా కాకుండా పనిచేసిన సందర్భాలున్నాయి. అప్పుడప్పుడూ ఇలాంటి సవాళ్లు అనేకం ఎదుర్కొంటుంటారు. ఒక్కొసారి చిన్న చూపుకు కూడా గురౌతుంటారు. ఎదిరించే శక్తి వున్నా, మౌనాన్ని ఆశ్రయిస్తారు. ఉద్యోగ ధర్మం నిర్వర్తిస్తుంటారు. దటీజ్‌ సివిల్‌ సర్వెంట్స్‌….!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!