అడవిబిడ్డ


త్యాగాల చరిత్రలో విరబూసిన వెలుగు రవ్వ
ఆ కుటుంబమంతా పేదల కోసమే….
వారి ఆశయాలన్నీ జనం కోసమే…


అశువులుబాసింది ప్రజల కోసమే…
అడవిదారిలో చీకటిని చీల్చుకుంటూ వెలుగు ప్రసాదించారు…


ఆ కుటంబం నుంచి ఎదిగిన నాయకురాలు
ములుగు జిల్లాలో కీలకమైన నేత నాగజ్యోతి
తెలంగాణ రాష్ట్ర సమితికి ఆశాజ్యోతి…
త్యాగాల కీర్తి వనంలో రాజకీయ వేకువ కిరణం…నాగజ్యోతి

ఆకుల అలికిడి వింటే గుండె రల్లుమనే కాలం…బూట్ల చప్పుడు వినిపిస్తే చాలు గుండెలు అదిమిపట్టుకున్న సమయం. ఉచ్చ్వాస నిశ్చ్వాసలు కూడా బైటికి వినిపించనంతగా ఊరిపి బిగబట్టుకొని బతికి జనం. ఒక్కసారి ఊహిస్తేనే ఒళ్లు జలధరిస్తోందా? గుండెలో ఎక్కడో అలజడి మొదలైనట్లు అనిపిస్తుందా? కాని మన ఊహకు, అనుభవించిన వాళ్ల పరిస్ధితి ఎలా వుంటుందో ఆలోచించండి. అదీ నాటి ఆది వాసీ ప్రాంతాలలో వుండే అమాయక గిరిజన ప్రజల కష్టం… ఎంత చెప్పినా తక్కువే…ఎంత విన్నా అది సగంలో కూడా ఓ చిన్న భాగమే…అలాంటి పల్లెలో వెలుగుల కోసం ఓ జంట 1990వ దశకంలో రాజ్యంతో కొట్లాడిరది. పల్లె వేకువ కోసం, ప్రగతి కోసం, వారి బతుకుల బాగు కోసం ముందడుగు వేసింది. గరిజనం భక్తి కోసం, విముక్తి కోసం ఆ దంపతులు పడిన తపన, అనుభవించిన వేధన, పరితపించిన యాతన చెప్పడానికి మాటలు సరిపోవు. ఒక కుటుంబంలో ఒక్కరో ఇద్దరో అడవిబాట పట్టారంటే అదే పెద్ద సంచలనం. కాని కుటుంబం మొత్తం జనం కోసం అడువుల్లో పోరాట జీవితం కోరుకున్నారంటే అది సామాన్యమైన విషయం కాదు. మనసు నిండా త్యాగమన్నది కళ్లనిండా కష్టమన్నది కనిపిస్తున్నా కళ్ల పెద్దవి చేసుకొని అడుగులేయాలి. బతుకును బలి చేసుకోవడానికి ప్రతి క్షణం సిద్దంగా వుండాలి. ఇలాంటి ధైర్యం ఎదరింపు వల్లలో, బెదిరింపు వల్లనో పోదు…తొలిపొద్దును కళ్లారా చూడుకుండా కన్నుమూయదు. కన్నీళ్లు దిగమింగుకుంటూ బతికినా, కళ్లలో కన్నీటి చుక్కలు ఇంకినా పోరుబాటలోనే కాలం కాటేసేదాకా ఆ దంపతులు నడిచివారున్నారు. తమ ప్రజల కోసం ప్రాణాలొడ్డినవారిలో ఆ దంపతులు ఆదర్శమయ్యారు. అడవి తల్లి ఒడిలో బతికే వాళ్లకు బుక్కెడు బువ్వ కోసం ఏళ్ల తరబడి పల్లెలు ఏడ్చిన కాలాన్ని ఎదిరించి నిలిచారు. తిరుగుబాటు తెచ్చారు. పోరు బాటను ఎంచుకున్నారు. అడవిబాట పట్టారు. అశువులు బాశారు. అమరులయ్యారు. తరతరాల వెలుగుకు మార్గమయ్యారు. అడవిదివిటీలై వెలుగుతున్నారు. జనం గుండెల్లో నిలిచిపోయారు. ఆ పోరు వీరుల ప్రేమకు మరో తరం పురుడుపోసి, జనం గీతికను సజీవం చేశారు..
బిక్కుబిక్కుమనే బతుకుల మధ్య తుపాకుల మోతల మధ్య, నట్టనడి అడవి మధ్య కడుపులో పడ్డ అడవిబిడ్డ…ఆడబిడ్డ…సమాజం కోసంలో పరితపించే వారి కడుపున పుట్టిన బిడ్డ. అన్యాయాన్ని ఎదిరించిన దంపతుల చైతన్యం నుంచి పుట్టిన బిడ్డ. పిడికిలెత్తి జననినాదాలు చేసిన వారి కళ్లలో నుంచి పుట్టిన వెలుగు రేఖ. సమసమాజ నిర్మాణం కాంక్షించిన వారి ప్రతిరూపంగా ఈ ప్రపంచాన్ని చూస్తున్న చైతన్య గీతిక. పిడికిలెత్తి జననినాదాలు చేసిన వారి కళ్లలో నుంచి పుట్టిన వెలుగు రేఖ. సమసమాజ నిర్మాణం కాంక్షించిన వారి ప్రతిరూపంగా ఈ ప్రపంచాన్ని చూస్తున్న చైతన్య గీతిక. నేడు జనం మధ్య ప్రజానాయకురాలిగా నాగజ్యోతి ఎదిగారు.
అదో విద్యావంతమైన కుటుంబం. చుట్టూ చీకటి ప్రపంచం. తోటి సమాజంలో ఆకలి కోసం ఆర్తనాదాలు. చేసుకోవడానికి పని లేక, దాహం తీర్చుకోవడానికి నీరు లేక, ఆకుల అలములు కూడా ముట్టుకునే హక్కులేక, వెట్టికి బలౌతున్న వారి కోసం కదలింది ఆ కుటుంబం. అన్న, ఇద్దరు తమ్ములు అడవిబాట పట్టారు. జనం గుండెల్లో అన్నలుగా మిగిలిపోయారు. అన్న అడవిబాట పట్టాడని తెలిసి, ప్రభుత్వం తమ్ములను ప్రశ్నించడం మొదలు పెట్టింది. చిత్రహింసలు పెట్టడం పరిష్కారమనుకున్నది. అడుగడుగునా ఆ కుటుంబాన్ని పగ పట్టింది. సమాజం అంటే పాపం. అన్యాయం అంటే నేరం. బతుకుల బాగుకోసం మట్లాడితే కేసులు…ఇలా నోరిత్తితే తప్పు…గట్టిగా ఊపిరి తీసుకున్నా తప్పు. అలాంటి కాలంలో సమజాన్ని జాగృతం చేసిన కుటుంబం ఒకటుంది. ములుగు జిల్లా జనం గుండెల్లో ఆ తరం సజీవంగా వుంది. ఆ కుటుంబం ఇంకా ప్రజా సేవలో తరిస్తూనే వుంది.
ఆయన కాల్వపల్లి ఆది వాసీ గూడెంలో ఒక గరువు. పేరు బడే జగన్నాధరావు. ఆయనకు మువ్వురు కొడుకులు. బడే రాంబాబు. బడే నాగేశ్వరరావు, మురళీధర్‌ రావులు అన్నదమ్ములు. ముందు అన్న బడే రాంబాబు అడవి బాట పట్టాడు. ఆయన ఆచూకీ కోసం తమ్ములను ప్రభుత్వం వేధిస్తుంటే జనం కోసం అజ్ఞాతంలోకి దళంలోకి వెళ్లిన నాగేశ్వరరావు, రాజేశ్వరిల మధ్య ప్రేమ చిగురించింది. వారి ప్రేమకు ప్రతిరూపంగా నాగజ్యోతి ఈ ప్రపంచాన్ని చూసింది.
పగిగడ్డుగా నాగజ్యోతి తమ నానమ్మ ఒడిలోకి చేరింది. అమ్మా, నాన్న అన్నీ నానమ్మ లోనే చూసుకుంటు పెరిగింది. కొంత కాలానికి తల్లి రాజేశ్వరి జనజీవన స్రవంతిలోకి వచ్చింది. నాగజ్యోతి కోసం ఇంటిబాట పట్టింది. కాని అవే వేధింపులు…అవే ఇబ్బందులు…ఆఖరుకు అవే తుపాకుల తూటాలకు బలైంది. నాగజ్యోతి నాన్న నాగేశ్వరరావు కూడా కొద్దిరోజుల్లో జనజీవన స్రవంతిలో కలిసేందుకు నిర్ణయం తీసుకున్నా, కొందరి స్వార్ధం మూలంగా ఆయన కూడా ప్రభుత్వ తూటాలకు బలయ్యారు. తనను కన్న తల్లి, గెండెల్లో పెట్టుకొని పెంచుకున్న నానమ్మ, సాకిన తాత ఏడాది కాలంలో ముగ్గురూ ఈ లోకాని దూరమయ్యారు. నాగ జ్యోతిని అనాధను చేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత నాగజ్యోతి మేనత్తలు పెంచి పెద్దచేశారు. ఆమె భవిష్యత్తుకు బాటలు వేశారు. ప్రజల కోసం జీవితం త్యాగం చేసిన తల్లిదండ్రులను స్మరించుకుంటూ వారి ఆశయాలను తల్చుకుంటూ, వారి గురించి జనం గొప్పగా చెప్పుకుంటున్న మాటలు వింటూ నాగజ్యోతి పెరిగింది. ఉన్నత విద్యావంతురాలుగా తనను తాను తీర్చిదిదుకున్నది. ఎంత కష్టమైనా చదువును పూర్తి చేసింది.. పల్లెజనం గోస చూసింది. ఆ అడవి బిడ్డలు పడే కష్టం తనూ పడిరది. ప్రపంచం ఎంతో ముందుకు పోతున్నా, తమ జాతి ఇంకా ఎందుకు వెనకబడిపోతోందని ప్రతి క్షణం మధనపడిపంది. హస్టళ్లలో చదువుకుంటూ పేదరికం చూసింది. అడవిలో వున్న కష్టం చూసింది. తన తల్లిదండ్రులు కలలు గన్న సమాజం కోసం, నాగజ్యోతి నడుంబిగించింది. ఏ సమాజంలో చైతన్యం లేక, అణిచివేతకు గురైందో…ఆ సమజం నుంచే జన నేతగా ఎదగాలనుకున్నది. ఆ కుటుంబ త్యాగాల పునాదుల మీద అడవిబిడ్డల బాగుకోసం కృషి చేయాలని నాగజ్యోతి నిర్ణయం తీసుకున్నది.
సమజంలో పెరుగుతున్న కుళ్లు, కుతంత్రం కళ్లారా చూసింది. తన వాళ్ల కోసం తల్లిదండ్రులు చేసిన సేవలో శక్తియుక్తులున్నంత వరకు సేవ చేసేందుకు నాగజ్యోతి ఊరు బాట పట్టింది. ఊరందరి కోరిక మేరకు గ్రామ సర్పంచ్‌ ఎన్నికల్లో నిలిచి గెలిచింది. ప్రజల ఆశీర్వాదంతో అఖండ మెజార్టీ సొంతం చేసుకున్నది. ఊరిలో 720 ఓట్లు వుంటే, 700 ఓట్ల మెజార్టీతో నాగజ్యోతి గెలిచింది. ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్ర సమితి దృష్టి నాగజ్యోతిపై పడిరది. ఆ తర్వాత వచ్చిన స్ధానిక సంస్ధల ఎన్నికల్లో భాగమైన జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో తాడ్వాయి నుంచి జడ్పీటీసిగా పార్టీ అవకాశం ఇచ్చింది. అక్కడ కూడా నాగ జ్యోతి తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నది. ములుగు జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌గా ప్రజలకు సేవలందిస్తోంది. భవష్యత్‌ ములుగు జిల్లా రాజకీయాలలో కీలకమైన నేతగా గుర్తింపు పొందింది. ప్రతి క్షణం తన తల్లిదండ్రుల త్యాగాలను తల్చుకుంటూ, తన జాతి బిడ్డలు పడుతున్న వేధనల నుంచి విముక్తికోసం పని చేస్తోంది. వారికి అందాల్సిన న్యాయమైన హక్కుల కోసం పరితపిస్తోంది. తన శక్తి మేరకు ప్రజలకు మేలు చేస్తూ, ప్రజల్లో మరింత గుర్తింపు పొందుతోంది. ఎక్కడికెళ్లినా ప్రజలు జడ్పీ వైస్‌ చైర్మన్‌ నాగజ్యోతితో తన తల్లిదండ్రుల గొప్పదనం ప్రజలే వినిపిస్తుంటే, వారి ఆశయాలు సజీవం చేసేందుకు కృషి చేస్తోంది.
ఇప్పుడున్న పరిస్ధితుల్లో ములుగు జిల్లా తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయాలకు ఆమె ఎంతో కీలకమైన నేత. అడవి తల్లిని నమ్ముకొని బతికే జాతి మేలు కోసం, వారి జీవితాలలో వెలుగు కోసం నాగజ్యోతి ఎంచుకున్న రాజకీయ మార్గంలో అలుపెరగని, ఎదరులేని, తిరుగులేని ప్రయాణం చేస్తే, పేదల జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుందాం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!