నర్సంపేట,నేటిధాత్రి :నర్సంపేట పట్టణంలో బాలాజీ విద్యాసంస్థలలో భాగమైన అక్షర ద స్కూల్ , బిట్స్ స్కూల్ ల లో దీపావళి పండుగ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ముందు రంగు రంగుల ముగ్గులు వేసి, దీపాలు వెలిగించి, క్రాకర్స్ బాణా సంచా కాల్చారు. చిన్నారి విద్యార్థిని విద్యార్థులు కృష్ణుడు, సత్యభామ నరకాసుడు వేషధారణతో అందరిని అలంరించారు.ఈ సందర్భంగా నరకాసుర వధ నిర్వహించి దీపావళి ప్రాముఖ్యతను నాటక రూపంలో ప్రదర్శించారు. బాలాజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్. ఏ. రాజేంద్ర ప్రసాద్ రెడ్డి దీపావళి పండుగ ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు వివరించి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బాలాజీ విద్యాసంస్థల సెక్రేటరి రాజేశ్వర్ రెడ్డి , పాఠశాల ప్రిన్సిపాల్ ఆర్.జ్యోతి, సీ.ఎ.వొ సురేష్ . ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.