సీఎం కేసీఆర్ రైతుబాందవుడు….

 

ప్రతీ రైతుకు సహాయం తప్పక అందుతుంది..

# ప్రస్తుత ధ్వంసమైన పంటలను పరిశీలించనున్న సీఎం కేసీఆర్

# రైతులకు పెద్దమొత్తంలో పంటల నష్టం జరిగింది

# సీఎం ఆదేశాలతో పంటలు పరిశీలన చేశా.

# పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

# వరంగల్ జిల్లాలో 13 కోట్ల 76 లక్షల 86 వేల నష్టపరిహారం

 

# పక్క రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాలన పరిస్థితిని పరిశీలించండి 

# కాంగ్రెస్ పార్టీ నాయకులకు మంత్రి ఎర్రబెల్లి చురుకలు

# నష్టపరిహారం రావడం రాష్ట్రంలో నర్సంపేట మొదటిది

# ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి 

# పూర్తిస్థాయిలో సర్వేలు చేయిస్తున్నాం జిల్లా కలెక్టర్ ప్రావిణ 

# నర్సంపేట డివిజన్ కు 8 కోట్ల 89 లక్షల 43 వేల నష్టపరిహారం పంపిణీ

 

నర్సంపేట,నేటిధాత్రి :

 

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రైతు బాంధవుడు అకాల వర్షాలు వడగళ్ల వానకు ధ్వంసమైన పంటలు నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం నుండి తప్పక సహాయం అందుతుంది అని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రైతులకు భరోసా ఇచ్చారు. ఇటీవల జరిగిన అకాల వర్షాలు వడగళ్ల వానలకు వరంగల్ జిల్లాలో పంటలు దెబ్బతినగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రస్తుతం పరిశీలన చేశామని అలాగే నర్సంపేట నియోజకవర్గంలో ధ్వంసమైన పంటల పరిశీలన కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ రానున్నట్లు మంత్రి తెలిపారు.రాష్ట్రంలో జరుగుతున్న రైతుల నష్టాలకు కేంద్ర ప్రభుత్వం సహాయం చేయడం లేదని అయినప్పటికీ తప్పని పరిస్థితుల్లో రైతులకు నష్టపరిహారాన్ని అందిస్తున్నదని అన్నారు అకాల వర్షాల వలన పంటలు ధ్వంసం కాగా కొన్నిచోట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు రోడ్లమీద ధర్నాలు చేస్తున్నారని మీ కాంగ్రెస్ పార్టీ పాలించే పక్కా రాష్ట్రాలలో ఒకసారి పరిశీలన చేయండి అని కాంగ్రెస్ పార్టీ నాయకులకు మంత్రి హితువు పలికారు. గత సంవత్సరం జనవరి నెలలో అకాల వర్షాలు వడగళ్ల వానలకు వరంగల్ ఉమ్మడి జిల్లాలో మిర్చి మొక్కజొన్న లతోపాటు వివిధ పంటలు పూర్తిగా ధ్వంసం అయ్యి రైతులు నట్టేట మునిగారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ రెవెన్యూ శాఖ ఉద్యానవన శాఖ అధికారులు సర్వేలు నిర్వహించి పంటల నష్టాన్ని అంచనా వేశారు. ఈ తరుణంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, నిరంజన్ రెడ్డి నర్సంపేట నియోజకవర్గంలో ధ్వంసమైన పంటలను పరిశీలించి నష్టపరిహారం అందిస్తామని ఆనాడు హామీలు ఇచ్చారు. ఈ మేరకు 28,567 ఎకరాలలో వివిధ రకాల పంటలు ధ్వంసం కాగా 26 వేల మంది రైతులు నష్టపోయారు. ఈ నష్టం పై అసెంబ్లీలో హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ ఇటీవల 13 కోట్ల 86 లక్షల 76 వేల రూపాయల విలువ గల నష్టపరిహారాన్ని విడుదల చేశారు. కాగా నర్సంపేట నియోజకవర్గంలోని దుగ్గొండి నల్లబెల్లి, ఖానాపురం, చెన్నారావుపేట, నర్సంపేట, నెక్కొండ మండలాలకు చెందిన నష్టపరిహారం జరిగిన రైతులకు 8 కోట్ల 89 లక్షల 43 వేల 54 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కలెక్టర్ ప్రావీణ్యతో హాజరై పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతుల పట్ల చిన్న సూపు చూస్తున్నదని అన్నారు. గత సంవత్సరం జనవరిలో కురిసిన అకాల వర్షాలు వడగళ్ల వానల వలన రైతులు తీవ్రస్థాయిలో నష్టపోయారని దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ మంత్రి తో పాటు పలువురు అధికారులు ఎమ్మెల్యేలతో నష్టపోయిన పంటలను పరిశీలన చేసి అంచనా వేశామన్నారు. నష్టపరిహారం అందించడం రాష్ట్రానికి ఇబ్బంది అయినప్పటికీ తప్పని సరి పరిస్థితుల్లో రైతులు ఆదుకోవడం కోసం పరిహారం అందిస్తున్నామని కాగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో 28 వేల 567 ఎకరాలలో వివిధ రకాల పంటలు దెబ్బతినగా 26వేల మంది రైతులు నష్టపోయారని ముఖ్యంగా నర్సంపేట పరకాల వర్ధన్నపేట డివిజన్ లలో అత్యధికంగా నష్టం జరగక భూపాలపల్లి మహబూబాబాద్ జిల్లాలో స్వల్ప నష్టం జరిగిందన్నారు.అందులో భాగంగా 13 కోట్ల 86 లక్షల 76 వేల రూపాయల నష్ట పరిహారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాగా నర్సంపేట నియోజకవర్గం 8 కోట్ల 89 లక్షల 89 లక్షల 43 వేల 54 రూపాయలు చెక్కుల రూపంలో అందిస్తున్నట్లు తెలిపారు. ఆయా చెక్కులను రైతు వేదికల ద్వారా నేరుగా రైతులకు అందించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఇటీవల జరిగిన అకాల వర్షాలు వడగళ్ల వానలకు వరంగల్ జిల్లాలో పంటలు దెబ్బతినగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రస్తుతం పరిశీలన చేశామని అలాగే నర్సంపేట నియోజకవర్గంలో ధ్వంసమైన పంటల పరిశీలన కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ రానున్నట్లు మంత్రి తెలిపారు.అకాల వర్షాల వల్ల పంటలు నష్టం జరగగా కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు రోడ్లపైన ధర్నాలు చేయడం సిగ్గుచేటు అని తెలుపుతూ గత సంవత్సరంలో ఇక్కడ జరిగిన విధంగానే చత్తీస్ ఘడ్, కర్ణాటక మహారాష్ట్ర రాష్ట్రాలలో పంటలకు నష్టం జరిగిందని అక్కడ పాలిస్తున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలే అని తెలుపుతూ అక్కడ నేటికీ ఒక్క రూపాయి కూడా పరిహారం అందలేదని వీలైతే ఒకసారి అక్కడికి వెళ్లి పరిశీలన చేయండి అని కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలుపుతూ గత నాలుగు రోజుల క్రితం చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో వర్షాల బీభత్సంతో పంటలు నష్టపోగా కనీసం నేటికీ నష్టం అంచనా కూడా వేయని పరిస్థితి అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వానిది అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎద్దేవా చేశారు. గత అకాల వర్షాల వలన నియోజకవర్గంలో రోడ్లు ధ్వంసం కాగా వాటి నిర్మాణాల కోసం 64 కోట్లు కేసీఆర్ ప్రభుత్వం మంజూరి ఇచ్చినట్లు తెలిపారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నష్టపరిహారం ఇవ్వడం ఇదే తొలిసారి అని అన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో నష్టపరిహారం అందించడం వలన మిగతా రైతు సంక్షేమ పథకాలు ఆగేది లేదన్నారు. గతంలో ఉన్న ప్రభుత్వాలు నష్టపరిహారాలు అందించడంలో వారి వారి పార్టీ కార్యకర్తలకే ఇచ్చుకునే వారిని నేడు కెసిఆర్ పార్టీలకతీతంగా నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందిస్తుందని ఎమ్మెల్యే వివరించారు. గ్రామ సభలు ద్వారా నష్టపోయిన లబ్ధిదారులను గుర్తించి వారికి పరిహారం ఇస్తున్నామని రైతు వేదికల ద్వారా రైతులకు చెక్కులు పంపిణీ 20 రోజుల్లో ప్రక్రియ పూర్తి అవుతుందని తెలిపారు. దురదృష్టవశాత్తు అదే పరిస్థితి మరల సంభవించిందని వ్యవసాయ రెవెన్యూ శాఖ అధికారుల ద్వారా నష్టపోయిన ప్రతి పంటను సర్వే చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.జిల్లా కలెక్టర్ ప్రావిణ్య మాట్లాడుతూ గత సంవత్సరం జరిగిన అకాల వర్షాల నష్టపరిహారం గత వారం రోజుల క్రితమే జిల్లాకు వచ్చిందన్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అంచన వేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఉషాదయాల్, వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్ రావు, ఓడిసిఎంఎస్ చైర్మన్ రామస్వామి నాయక్, జెడ్పి ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, ఆర్డీవో శ్రీనివాసులు, ఏడిఏ అవినాష్ వర్మ, ఎంఆర్ఓలు వాసం రామ్మూర్తి, సంపత్ కుమార్, ఎంపీపీలు మోతే కళావతి పద్మనాభరెడ్డి ,కాట్ల కోమల భద్రయ్య, జెడ్పిటిసి జయ గోపాల్ రెడ్డి, మండల వ్యవసాయ శాఖ అధికారులు కృష్ణ కుమార్, దయాకర్, మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, రాయిని రవీందర్ రెడ్డి, నాగేల్లి వెంకట నారాయణ గౌడ్, రాజేశ్వర్ రావు,గంప రాజేశ్వర్ గౌడ్, పలువురు అధికారులు ప్రజా ప్రతినిధులు రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.