సానిటైజర్ తాగి ఐదుగురు విద్యార్థినిలు ఆత్మహత్యయత్నం 

ఎం జి ఎం లో చికిత్స పొందుతూన్న విద్యార్థినిలు 

మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ హాస్టల్లో ఘటన

హన్మకొండ నేటిధాత్రి 

మండలంలోని ఆరెపల్లె గ్రామం వద్ద ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ బాలికల గురుకుల హాస్టల్లో ఐదుగురు విద్యార్థినిలు ఆత్మహత్యకు యత్నించారు. ఐదుగురు విద్యార్థినులను సానిటైజర్ తాగగా అధికారులు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. హాస్టల్లో జరిగిన ఓ విద్యార్థిని బర్త్ డే వేడుకల్లో జరిగిన గొడవ ఇందుకు కారణంగా తెలుస్తోంది. ములుగు జిల్లాకు చెందిన ఈ బీసీ బాలికల గురుకుల హాస్టల్ ను అధికారులు ఆరెపల్లి వద్ద ఉన్న ఓ భవనంలో నిర్వహిస్తున్నారు. శనివారం సాయంత్రం ఈ వసతి గృహంలో ఒక విద్యార్థిని బర్త్ డే వేడుకలు జరిగినట్లు సమాచారం. ఈ వేడుకలకు హాస్టల్ లోని వారు కాకుండా ఇతర విద్యార్థినులు హాజరు కావడంతో వసతి గృహం అధికారులు విద్యార్థినులను మందలించినట్లు తెలిసింది. ఈ క్రమంలో హాస్టల్లోని విద్యార్థినుల మధ్య కూడా గొడవ జరిగినట్లు సమాచారం. ఆవేదనతో ఐదుగురు విద్యార్థినులు హాస్టల్ లో శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. బాధిత విద్యార్థినులు రుత్విక, స్ఫూర్తి, జోత్స్న, ఉమాదేవి, చారివిక ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published.