సర్వే లలో డి ప్యాక్‌, నేటిధాత్రి సంచలనం.

మూడు పార్టీలకు వచ్చే సీట్లపై కచ్చితమైన లెక్క చెప్పిన ఏకైక సంస్థ డి.ప్యాక్‌.

దాదాపు అనే లెక్క లేనే లేదు.

సరాసరి ముచ్చటే లేదు.

కర్ణాటకలో కాంగ్రెస్‌ కు 135 చెప్పిన ఏకైక సంస్థ డి ప్యాక్‌.

బిజేపి 60కి మించవు అన్నది కూడా నిజమైంది.

జేడిఎస్‌ కు 20 మాత్రమే అని చెప్పింది కూడా డి ప్యాక్‌ .

ఇలా మూడు పార్టీలకు వచ్చే సీట్లపై కచ్చితమైన లెక్క చెప్పింది డి ప్యాక్‌ మాత్రమే.

ఇంత ఖచ్చితమైన లెక్క చెప్పింది వన్‌ అండ్‌ ఓన్లి డి.ప్యాక్‌.

కర్ణాటక కాంగ్రెస్‌ దే అని మొదట తేల్చిందే నేటిధాత్రి.

ఇక ఉభయ తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఫోకస్‌.

ఆంధ్ర ప్రదేశ్‌ రాజకీయం ఎలా వుండబోతోంది?

సర్వేలు చేశామా? చేతులు దులుపుకున్నామా? మళ్లీ ఎవరైనా సంప్రదిస్తే సర్వేలు చేసిపెట్టామా? అన్నట్లు వున్న ఈ కాలంలో నిరంతరం సర్వేలు నిర్వహిస్తూ, ఈ మధ్య కాలంలో ఖచ్చితమైన లెక్కలతో సహా వివరాలు అందిస్తున్న ఏకైక సంస్ధ డి. ప్యాక్‌. నేటిధాత్రితో కలిసి డిప్యాక్‌ కొన్ని సంవత్సరాలుగా రాజకీయపరమైన సర్వేలు వివిధ రాష్ట్రాలలో నిర్వహిస్తోంది. గతంలో కూడా అనేక ఎన్నికల సమయాల్లో కూడా డి.ప్యాక్‌ , నేటిధాత్రిలు కలిసి సంయుక్తంగా సర్వేలు నిర్వహించాయి. అన్ని సంస్థలు వెల్లడిరచిన మూస దోరణిలో వెళ్లడం ఏమాత్రం ఇష్టం లేని డి.ప్యాక్‌ ప్రత్యేక పంధాను ఎంచుకొని సర్వేలు నిర్వహిస్తోంది. దేశ వ్యాప్తంగా ఈ సర్వేలు సాగుతూనే వుంటాయి. అందులో భాగంగా గతంలో గుజరాత్‌ ఎన్నికల సమయంలోనూ సరాసరి సర్వే రిపోర్టులు అందించింది. అయితే తెలంగాణలో జరిగిన మునుగోడు ఉప ఎన్నిక సమయం నుంచి డి.ప్యాక్‌ సర్వే నిర్వహణలో ప్రత్యేక శైలిని ప్రదర్శిస్తూ వస్తోంది. అది ఉప ఎన్నికైనా, సార్వత్రిక ఎన్నికలైనా సరే ఖచ్చితమైన లెక్కలు చెప్పాలంటే ఎంతో అంకితభావంతో పనిచేయాల్సివుంటుంది. అదే మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా టిఆర్‌ఎస్‌ అభ్యర్ధి విజయంపై అనేక సార్లు సర్వే నిర్వహించి డిప్యాక్‌ వెల్లడిరచింది. అయితే చాలా సర్వేలు నేటిధాత్రి సర్వేను అవహేళన చేశాయి. డి.ప్యాక్‌తో కలిసి నేటిధాత్రి చేసిన సర్వేను చులకన చేసిన సర్వేల రిపోర్టులే తారుమాయయ్యాయి. ఒక్క నేటిధాత్రి ఎగ్జిట్‌ పోల్‌రిపోర్టే ఆనాడు కూడా నిజమైంది. ఆ సమయంలో అనేక సంస్ధలు సర్వేలు నిర్వహించి, బిజేపి అభ్యర్ధి రాజగోపాల్‌రెడ్డి గెలుస్తాడంటూ రిపోర్టుల మీద రిపోర్టులు వెల్లడిరచాయి. కాని డి.ప్యాక్‌ నేటిధాత్రి మాతమ్రే ఏ రోజు సర్వే రిపోర్టులు ఆ రోజే అన్నట్లు క్షేత్ర స్ధాయిలో ప్రజలు ఏమనుకుంటున్నారు? మునుగోడు ఉప ఎన్నికపై ప్రజలు ఏమనుకుంటున్నారన్న దానిపై సమాచారం సేకరించి, ఎగ్జిట్‌ పోల్‌ వివరాలు వెల్లడిరచింది. బిఆర్‌ఎస్‌ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయం ఖాయమని తేల్చి చెప్పింది. మెజార్టీ కూడా ఎంత వస్తుందన్నదానిపై ఖచ్చితమైన లెక్క చెప్పింది. దాంతో నేటిధాత్రి సర్వే మీద ప్రజల్లో విశ్వాసం పెరిగింది. నాయకుల్లో నమ్మకం బలపడిరది. నేటిధాత్రి , డిప్యాక్‌ సర్వే అంటే నమ్మొచ్చన్న భావనకు ఆనాడు వచ్చారు.

కర్నాటక ఎన్నికలతో డి.ప్యాక్‌, నేటిధాత్రి సర్వే ఫలితాలు ఒక సంచలనం సృష్టించాయి. దేశంలో కొన్ని వందల సంఖ్యలో సర్వే సంస్ధలు పనిచేస్తున్నాయి. అవన్నీ కర్నాకట ఎన్నికలపై సర్వేలు నిర్వహించాయి. కాని ఏ ఒక్క సర్వే సంస్ధ కూడా కాంగ్రెస్‌కు ఎన్నిసీట్లు వస్తాయి? ఒకటి అటూ ఇటూ అయినా సరే? ఏ ఒక్క సర్వే సంస్ధ కూడా ఖచ్చితమైన లెక్క చెప్పలేకపోయింది. దేశంలో పేరు మోసిన అనేక సర్వే సంస్ధలున్నాయి. అవి కూడా ఓ ఇరవై అటూ ఇటుగానే చెప్పాయి. అంటే క్షేత్రస్ధాయిలో ఆ సంస్ధలు సర్వేలు నిర్వహించినా పూర్తి స్ధాయిలో సర్వే జరపలేదన్నది తేలిపోయింది. కాని దేశంలోనే ఒక్క డిప్యాక్‌, నేటిధాత్రి మాత్రమే ఒకటి అర కూడా కాదు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్నదానిపై ఇంత వరకు ఎవరూ చెప్పని స్పష్టమైన లెక్కను చెప్పి డి.ప్యాక్‌ చరిత్రను సృష్టించింది. కాంగ్రెస్‌ పార్టీకి 135 సీట్లు రావడం ఖాయమన్నది ఎగ్జిట్‌పోల్‌ వెల్లడిరచింది. బిజేపికి 60 సీట్లు దాకటపోవచ్చని చెప్పింది. జేడిఎస్‌ ప్రభావమేకాదు, దానికి వచ్చే సీట్టు 20 మాత్రమే అని చెప్పిన ఏకైక సంస్ధల డిప్యాక్‌. ఇంత ఖచ్చితంగా డిప్యాక్‌ ఎలా సర్వే లెక్కలు వేసిందన్నదానిపై ఇతర సర్వే సంస్దలు వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఆసక్తిని కనబర్చుతున్నాయి. అయితే ఆయా సంస్ధలు చేసిన సర్వేలకు, డిప్యాక్‌ చేసిన సర్వేలకు చాలా తేడా వుంది. డి.ప్యాక్‌ ఏడాది కాలంగా కర్నాకటలో పర్యటిస్తూ, అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజల్లో వచ్చిన మార్పులు, రాజకీయాలు, నాయకుల వ్యవహరశైలి, ప్రజల ఆలోచనా తీరును ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా తెలుసుకోవడంలో డిప్యాక్‌ సక్సెస్‌ అయ్యింది. ఒక దశలో కాంగ్రెస్‌ బిజేపికి పోటీ ఇచ్చే స్ధితిలోనే లేదన్న విమర్శల నుంచి ఎలా ఎదుగుతున్నది కూడా ఆ రోజు నుంచే డిప్యాక్‌ వివరాలు సేకరిస్తూ, నేటి ధాత్రి ద్వారా అందిస్తూనే వుంది. ముఖ్యంగా రాహుల్‌జోడో యాత్ర తర్వాత కర్నాటక కాంగ్రెస్‌లో వచ్చిన జోరు కూడా ప్రజలను ఎలా కదిలించిందన్నదానిపై కూడా అనేక సార్లు సర్వే నిర్వహించడం జరిగింది. పైగా సిఎల్పీ నాయకుడు డి.కే. శివకుమార్‌ రాజకీయంగా ఎలా నిలదొక్కుకున్నాడు. ఈడీ రైడ్స్‌తో ఆయన ఆర్ధిక మూలాలు దెబ్బతీసే ప్రయత్నం కేంద్రం చేస్తే, ప్రజలు డికే. శివకుమార్‌ను అవినీతి పరుడుగా భావించలేదు. అయినా అధికారంలో బిజేపి వుండగా ప్రతిపక్షాలు అవినీతి చేయడం కుదరదు. అయినా బిజేపి,కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్‌ను ఇంకా అవినీతి పార్టీగా, ఆ పార్టీ నేతలను అవినీతి పరులుగా చిత్రీకరించడాన్ని ప్రజలు స్వాగతించలేదు. కేంద్రంలో ఎనమిదేళ్లుగా బిజేపి కేంద్రంలో అధికారంలో వుంది. రాష్ట్రంలోనూ సుమారు అంతే సమయం బిజేపి అధికారంలో వుంది. ఈ దఫా బిజేపి కర్నాకట ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు వచ్చాయి. 40శాతం కమీషన్‌ అన్నది పెద్దఎత్తున ప్రచారం జరిగింది. బిజేపికి చెందిన కాంట్రాక్టర్‌ ఆత్మహత్య చేసుకోవడం కూడా బిజేపిమీద మచ్చపడిరది. ఇదిలా వుంటే అధికార బిజేపి నుంచి పెద్దఎత్తున కాంగ్రెస్‌లోకి వలసలురావడం అన్నది చర్చనీయాంశమైన అంశం.దాన్ని చాలా సర్వే సంస్ధలు వదిలేశాయి. ఎందుకంటే బిజేపిలో నెగలలేని నాయకులే కాంగ్రెస్‌లో చేరారు. అంటే వారంతా అవినీతికి దూరంగా వుండే ప్రయత్నం చేశారు. కాని పార్టీ వారిని గుర్తించలేదు. అది కూడా బిజేపి మీద ప్రజలకు నమ్మకం సన్నగిల్లేలా చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక విషయాలున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఏం హామీలు ఇచ్చిందనే విషయాన్ని ఏ మీడియా పట్టించుకోలేదు. ఎంత సేపు ప్రధాన మంత్రి మోడీ పర్యటనలు, ప్రచారాలు, ర్యాలు,రోడ్డు షోలు మాత్రమే ఎక్కువ ప్రచారం చేశాయి. దానికి తోడు బిజేపి కేంద్ర నాయకత్వంలోని పెద్దలంతా ప్రచారం నిర్వహించారు. కాని వారు ప్రజలకు అవసరమైన విషయాలు చెప్పింది లేదు. కర్నాకటకు ఏం చేస్తామన్నదానిపై వాగ్ధానాలు చేసింది లేదు. దాంతో దేశంలో పెరుగుతున్న ధరలకు తోడు తొమ్మిదేళ్లుగా అధికారంలో వుండి చేయని బిజేపికి మళ్లీ అవకాశమిచ్చినా రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదని ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ పంచతంత్రను బలంగా నమ్మారు. అసలు ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ నేరుగా ప్రజలకు చేరవేసే ప్రచారం చేయడం, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కలిసికట్టు రాజకీయం బాగా కలిసివచ్చింది. కర్నాటక ప్రజలను బాగా కదిలించింది. నమ్మేలా చేసింది. బిజేపి చేసే రాజకీయమంతా మతం చుట్టూ తిరడం కూడా ప్రజలకు నచ్చలేదు. వీటన్నింటిని ఎప్పటికప్పుడు ప్రజల అభిప్రాయాలను తెలుసుకొని డిప్యాక్‌, నేటిధాత్రి చేసిన సర్వే లెక్కలతో సహా జనం పల్స్‌ చెప్పడం జరిగింది. ఎవరూ ఊహించని ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడిరచింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ఇదే హాట్‌ టాపిక్‌గా సర్వే సంస్ధలలో సాగుతోంది. డిప్యాక్‌ కర్నాటకలో సర్వేలో ఎలాంటి మెలకువలు పాటించిందనేదానిపై వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మరిన్ని వివరాలు మరోసంచికలో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *