ధారాదత్తం చేసిన భూములు కబ్జా
సమాధుల స్మశాన వాటిక గా వాడకం
సమాధులపై ఇంటిని నిర్మించుకున్న *బాలాజీ* నివాసం..
పిర్యాదు చేసినా పట్టింపులేని అధికారులు
మా స్థలాన్ని మాకివ్వండి *గట్టు* పట్టుదల
వరంగల్ సిటి నేటిధాత్రి
అదొక సమాధులు నిర్మాణం చేసుకున్న స్థలం పవిత్రంగా భావించే ఆ స్థలంలో సమాధులు నిర్మించుకొని ఆలయంగా భావించే సమాధుల పై ఓ ఘనుడు కన్నేసి ఏకంగా గృహ నిర్మాణమే చేపట్టాడు వివరాల్లోకి వెలితే గత 70 సంవత్సరాల క్రితం ఇపుడున్న 21 వ డివిజన్ కరిమాబాద్ నానామియా తోటలోని (దాదాబాయి బావి) ప్రాంతంలో తుల్జాబాయి వంశస్తులు కొందరు నిరుపేదలకు వారి భూమిని ధారాదత్తం గా అనుభవించటానికి ఇస్తారు అందులో కొంత మంది గృహ నిర్మాణాలు చేసుకొని నివాసం ఉంటున్నారు అదే విధంగా గట్టు (గౌడ) వంశస్తులకు కేటాయించిన 400 గజాల స్థలంలో గత 70 సంవత్సరాల క్రితం గట్టు వంశస్తుడైన గట్టు రామస్వామికి ఆ స్థలాన్ని కేటాయించి అట్టి స్థలాన్ని గట్టు వంశస్తులు మాత్రమే అనుభవింవించాలని మాట తీసుకుంటారు కొన్ని సంవత్సరాల తరువాత గట్టు రామస్వామి అనే వ్యక్తి మరణిస్తే వారి మృతదేహాన్ని తుల్జాబాయి పెద్దలు కేటాయించిన 400 గజాల స్థలంలోనే సమాధి ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చి అందులో నిర్మించి గట్టు వంశస్తులు ఆ స్థలాన్ని కేవలం గట్టు (గౌడ) వంశస్తుల సమాధులు నిర్మించికోటానికి ఉపయోగించుకునే విధంగా నిర్ణయానికి వస్తారు నాటి నుండి నేటి వరకు దాదాపు 16 మంది రామస్వామి, నారాయణ, సాయన్న, రాజమౌళి, రంగం, వెంకటాచలం, లింగమూర్తి, తిరుపతయ్య, శ్రీనివాస్ ఇలా గట్టు వంశస్తుల సమాధులు అందులో నిర్మించుకుంటారు ఇలా నిర్మించుకున్న స్థలం పై కన్నేసిన సదరు కబ్జా దారులు ఎలాగోలా స్థలాన్ని సొంతం చేసుకోవాలని దురుద్దేశంతో అధికారులతో చేతులు కలిపి ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని గట్టు వంశస్తులు ఆరోపిస్తున్నారు గతంలో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేసిన తూతూ మంత్రంగా అలా వచ్చి బెదిరించినట్టు చేసి ఆ తరువాత వాళ్ళు ఇచ్చింది పుచ్చుకొని అటు వైపు కన్నెత్తైన చూడలేదని గట్టు వంశస్తులు చెపుతున్నారు.