సగరులను బీసీఏలో చేర్చే వరకు పోరాటం: శేఖర్ సగర

ఆదిలాబాద్ జిల్లా సగర సంఘం అడహాక్ కమిటీ ఏర్పాటు

నూతనంగా నియమితులైన జిల్లా అడహాక్ కమిటీలకు బాద్యతలు అప్పగిస్తున్న రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర

సమావేశంలో ప్రసంగిస్తున్న రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర

సమావేశంలో హాజరైన సగర బందువులు 

ఇచ్చోడ, నవంబర్ 30: తెలంగాణలో సగరులను బీసీ ‘ఎ’ లో చేర్చే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర అన్నారు. ఆదిలాబాద్ జిల్లా సగర సంఘం సర్వసభ్య

సమావేశం బుధవారం ఇచ్చోడలో నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన శేఖర్ సగర మాట్లాడుతూ అనాదిగా సగర జాతి అన్ని రంగాలలో వెనుకబాటుకు గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా సగరుల బ్రతుకులు మారాయని, పేరుకు సగర క్షత్రియులము అయినప్పటికీ బిసి ‘డి’ లో కొనసాగుతున్న సగరులకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఉపాది అవకాశాలు లేక బ్రతుకులు అగమ్య గోచరంగా మారాయని అన్నారు. ప్రభుత్వ పరంగా ఆర్థిక చేయూత లేకపోవడంతో ఈ సమాజంలో సగరులు అన్ని రంగాలలో వెనుకబాటుకు లోనయ్యారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సగరులను బీసీ ‘డి’ నుంచి బిసి ‘ఎ’ లోకి మార్చే వరకు రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర సగర సంఘం ఉద్యమాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఇతర బీసీ కులాలతో సమానంగా ప్రభుత్వం సగరులను నిర్మాణరంగ కార్మికులు గా గుర్తిస్తూ కులవృత్తినే నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్న సగరులకు ప్రోత్సాహకంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కాంట్రాక్టు పనులలో 30 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఇఎండిలు లేకుండా ప్రభుత్వ నిర్మాణ పనులను సగరులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. 50 సంవత్సరాల వయస్సు పైబడిన నిర్మాణరంగ కార్మికులైన సగరులను గుర్తించి పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా సగరులనంత ఏకం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం కోసం ఉద్యమిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సగర యువజన సంఘం ప్రధాన కార్యదర్శి మర్క సురేష్ సగర, స్థానిక సంఘం నాయకులు పాల్గొన్నారు.

జిల్లా అడహాక్ కమిటీ

ఆదిలాబాద్ జిల్లా సగర సంఘం అడహాక్ కమిటీ అధ్యక్షులు గా శంకర్ రాకెలె సగర, కో-కన్వీనర్ లుగా రఘునాథ్ హైతలే సగర, గోపీనాథ్ ఎగాడె సగర, శంకర్ మాధంశెట్టి సగర

 

 *జిల్లా యువజన సంఘం* 

జిల్లా యువజన సంఘం కన్వీనర్ గా శివాజీ రాకెలే సగర, కో-కన్వీనర్ లుగా కల్బుర్గి నాందేవ్ రాకలే, గణేష్ ఐనలే సగర, చందారావు బర్లేవాడ లు నియమితులయ్యారు.

 

 *మహిళా సంఘం* 

జిల్లా మహిళా అడహాక్ కమిటీ

జిల్లా సగర మహిళా సంఘం కన్వీనర్ గా చింతల్ వాడి జయశ్రీ సగర, కో- కన్వీనర్లు గా రుక్మిణి బర్వేవాణి, లక్ష్మి అయినెలే లు నియమితులయ్యారు.

Leave a Reply

Your email address will not be published.