శాంతియుత వాతావరణంలో నిమజ్జన వేడుకలు జరుపుకోవాలి

ఎలాంటి డీజే లకు అనుమతి లేదు.
గూడూరు సిఐ రాజి రెడ్డి.
కొత్తగూడ, నేటి ధాత్రి.
గణేష్ నిమజ్జన వేడుకలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని గూడూరు సీఐ రాజి రెడ్డి తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణేష్ మండపాల నిర్వాహకులు నిబంధనలు పాటిస్తూ నిమజ్జనం రోజు రహదారులపై ఎవరికీ ఎలాంటి ఆటంకం కలగకుండా చూసుకుంటూ నిమజ్జనం చేయాలని తెలిపారు. ఈ పరిస్థితుల్లో డీజేలకు అనుమతి లేదు. ఎవరైనా డీజేలను ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈత రాని పిల్లలకు నిమజ్జనం రోజు తీసుకెళ్లకూడదు. కోవిడ్-19 నిబంధనలు ప్రార్థిస్తూ శాంతియుత వాతావరణంలో నిమజ్జన వేడుకలు జరుపుకోవాలని ఈ సందర్భంగా కొత్తగూడ, గంగారం మండల ప్రజలకు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *