రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సదిశ ఫౌండేషన్ నిర్వహించిన గణిత ప్రతిభ పోటీలో మంచి ప్రతిభ కనబరిచిన తోమ్మిదవ తరగతి విద్యార్థికి సదిశ ఫౌండేషన్ సభ్యులు రెండు వేల రూపాయలను బహుమతిగా అందజేయడం జరిగింది. ఈకార్యక్రమంలో ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు ప్రకాష్, మండల విద్యాధికారి అంబటి వేణు కుమార్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మంజుల, జ్యోతి, మంజుల ఫిజికల్ సైన్స్, బాలచందర్, రాజమౌళి, జలపతి రెడ్డి, ఎస్ఎంసి చైర్మన్ బుర్ర సాయిలు, సదిశ ఫౌండేషన్ అధ్యక్షులు నవీన్ రెడ్డి, సభ్యులు ప్రవీణ్, ఆనందం, తదితరులు పాల్గొన్నారు.