జైపూర్,నేటిధాత్రి:
సకల విజ్ఞాల తొలగించే గణనాథుని చరిత రమనీయమని, గణనాథుని పూజిస్తేఅన్నింటా విజయమేసాధిస్తారని మంచిర్యాల మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్, బీఆర్ఎస్ నాయకుడు అరవింద్ రావు పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని భగత్ సింగ్ నగర్ లో అంజనీపుత్ర ఎస్టేట్స్ ఛైర్మెన్ గుర్రాల శ్రీధర్ , ఎమ్ డి.పిల్లి రవి ల ఆధ్వర్యంలో ప్రతిష్టించిన భారీ కేదారీనాథ్ వినాయకునికి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సకల విఘ్నాలు తొలగించే వినాయకుని సేవలో పాల్గొనడం అదృష్ట దాయకమన్నారు..తెలుగువారి పండుగలలో అన్నివర్గాల ప్రజలు ఆనందోత్సాహాల నడుమ జరుపుకునే విశిష్ట పండుగ వినాయక చవితన్నారు. నియమనిబంధనలు,నిష్టా ఉపవాస దీక్షలతో మనసారా నమ్ముకొని పూజిస్తే భక్తుల కోరికలు తీర్చే దైవమే వినాయకుడన్నారు…అంజనీపుత్ర ఎస్టేట్స్ నిర్వహిస్తున్న నిత్యాన్నదానం, సేవాకార్యక్రమాలు అభినందనీయమన్నారు.. అంజనీ పుత్ర. ప్రజా శ్రేయస్సుకై వారు తలపెట్టిన ప్రతీకార్యం విజయవంతం కావాలన్నారు.. ఈ కార్యక్రమంలో అంజనీపుత్ర డైరెక్టర్ లు తదితరులు పాల్గొన్నారు.