Headlines

*వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి*

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు మద్దతు ధర బొజ్జం రమేష్*

*మొక్కజొన్న పంటకు అనుమతులు కల్పించాలి రైతులు*

*ప్రజాప్రతినిధులను అడుగడుగున ప్రశ్నిస్తున్న రైతులు*

శాయంపేటపేట, నేటిధాత్రి: రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేపట్టడానికి ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ప్రగతి సింగారం మైలారం జోగంపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వరంగల్ రూరల్ జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి, పరకాల మార్కెట్ కమిటీ చైర్మన్ బొజ్జం రమేష్, డిసిఓ రాచర్ల పరమేశ్వర్ ముఖ్యఅతిథులుగా హాజరై కొనుగోలు కేంద్రాలను
బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో వరంగల్ రూరల్ జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి మాట్లాడుతూ రైతులకు అండగా నిలవడానికి రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని అన్నారు. రైతులు పండించిన వరి ధాన్యానికి మద్దతు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతుల కొరకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను జీర్ణించుకోలేక విపక్ష పార్టీల వద్ద ఎలాంటి అంశాలు లేకపోవడంతో మద్దతు ధర కల్పించాలని రాద్ధాంతం చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మద్దతు ధర పెంచి అందజేస్తామని అంటే కొన్ని సమస్యలు ఉన్నాయని, మద్దతు ధరకు తోడు సపోర్టింగ్ ప్రైస్
అందజేయాలని ఆలోచన చేస్తున్నామని కొడకండ్లలో జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్ స్పష్టంగా చెప్పడం జరిగిందని గుర్తు చేస్తూ, రైతులకు అండగా
నిలుస్తామని 100 నుండి 150 రూపాయల సపోర్టింగ్ ప్రైస్ అందజేయడానికి రాష్ట్రప్రభుత్వం
సీఎం కేసీఆర్ ఆలోచన చేస్తున్నారని అన్నారు.

*ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు మద్దతు ధర చైర్మన్ బొజ్జం రమేష్*

రైతులు పండించిన వరి ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తూ గ్రామాలలో కొనుగోలు చేపడుతుందని శాయంపేట మండలంలో రైతుల సౌకర్యార్థం 12 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని పరకాల మార్కెట్ కమిటీ చైర్మన్ బొజ్జం రమేష్ అన్నారు. అతివృష్టి కారణంగా పంట నష్టం వాటిల్లి దిగుబడి చాలా తగ్గిపోయిందని రైతులకు జరిగిన నష్టంపై ఆవేదన వ్యక్తం చేస్తూ, గతంలో ఉన్న అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, రైతులు పాడి క్లీనర్ల ను వినియోగించి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వడ్లను తీసుకు వస్తే ఇలాంటి తరుగు తియ్యకుండానే కొనుగోలు చేపట్టే విధంగా ఏర్పాట్లు చేశామని అన్నారు. పాడి క్లీనర్ల ను వినియోగిస్తే ఏడు వందల గ్రాముల వరకే తరుగు పోతుందని రైతులు కష్టం అనుకోకుండా ప్యాడి క్లీనర్ లను వినియోగించి గ్రాము ఎక్కువ ఇవ్వకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో విక్రయించి మద్దతు ధరను పొందాలని అన్నారు.

*మొక్కజొన్న పంటకు అనుమతులు కల్పించాలి రైతులు*

ప్రభుత్వ సూచనలతో వేసిన పత్తి సన్నరకం వరి ధాన్యం పంటలు అధిక వర్షాలతో దెబ్బతిని దిగుబడి గణనీయంగా తగ్గిపోయిందని ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న పంటలు వేసుకోవడానికి అనుమతులు కల్పించాలని మైలారం గ్రామానికి చెందిన రైతు దూదిపాల బుచ్చిరెడ్డి జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి, మార్కెట్ కమిటీ చైర్మన్ బొజ్జం రమేష్ అధికారుల దృష్టికి సభాముఖంగా తీసుకు వచ్చారు. ప్రత్యామ్నాయంగా వేరుశనగ పంట వేసుకోవాలని మార్కెట్ కమిటీ చైర్మన్ బొజ్జం రమేష్ సూచించగా ఇక్కడ భూమి అందుకు అనుగుణంగా లేదని మాకు ప్రత్యామ్నాయ పంటలు చూపించాలని లేదా
మొక్కజొన్న సాగుకు అనుమతి ఇవ్వాలని మైలారం గ్రామంలోని పలువురు రైతులు కోరారు.

*ప్రజాప్రతినిధులను అడుగడుగున ప్రశ్నిస్తున్న రైతులు*

నియంత్రిత పంట సాగు విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయగా క్షేత్రస్థాయిలో ప్రజా ప్రతినిధులు నాయకులు వ్యవసాయ అధికారులు
రైతులతో ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా పంటలు సాగు చేసే విధంగా అవగాహన కల్పిస్తూ పంటలు వేసే విధంగా చర్యలు చేపట్టారు. అధిక వర్షాలతో పంట నష్టం వాటిల్లి పెట్టుబడి గణనీయంగా పెరగడం దొడ్డు రకం వరి ధాన్యానికి బదులు రైతులు వేసిన సన్నరకం వడ్ల దిగుబడి గణనీయంగా తగ్గడం మద్దతు ధర కూడా ఆకర్షణీయంగా లేకపోవడం ప్రజాప్రతినిధులను నాయకులను రైతులు అడుగడుగున ప్రశ్నిస్తున్నారు, కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి వచ్చిన నాయకులను ప్రగతి సింగారం గ్రామంలో రైతులకు మద్దతు ధర పంట నష్ట పరిహారం పై ప్రశ్నించగా, మైలారం గ్రామంలో ప్రత్యామ్నాయ పంటలు చూపాలని లేదా మొక్కలకు అనుమతి ఇవ్వాలని అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన రైతులు కోరడం ప్రజాప్రతినిధులకు నాయకులకు శిరో భారంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!