ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు మద్దతు ధర బొజ్జం రమేష్*
*మొక్కజొన్న పంటకు అనుమతులు కల్పించాలి రైతులు*
*ప్రజాప్రతినిధులను అడుగడుగున ప్రశ్నిస్తున్న రైతులు*
శాయంపేటపేట, నేటిధాత్రి: రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేపట్టడానికి ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ప్రగతి సింగారం మైలారం జోగంపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వరంగల్ రూరల్ జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి, పరకాల మార్కెట్ కమిటీ చైర్మన్ బొజ్జం రమేష్, డిసిఓ రాచర్ల పరమేశ్వర్ ముఖ్యఅతిథులుగా హాజరై కొనుగోలు కేంద్రాలను
బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో వరంగల్ రూరల్ జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి మాట్లాడుతూ రైతులకు అండగా నిలవడానికి రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని అన్నారు. రైతులు పండించిన వరి ధాన్యానికి మద్దతు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతుల కొరకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను జీర్ణించుకోలేక విపక్ష పార్టీల వద్ద ఎలాంటి అంశాలు లేకపోవడంతో మద్దతు ధర కల్పించాలని రాద్ధాంతం చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మద్దతు ధర పెంచి అందజేస్తామని అంటే కొన్ని సమస్యలు ఉన్నాయని, మద్దతు ధరకు తోడు సపోర్టింగ్ ప్రైస్
అందజేయాలని ఆలోచన చేస్తున్నామని కొడకండ్లలో జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్ స్పష్టంగా చెప్పడం జరిగిందని గుర్తు చేస్తూ, రైతులకు అండగా
నిలుస్తామని 100 నుండి 150 రూపాయల సపోర్టింగ్ ప్రైస్ అందజేయడానికి రాష్ట్రప్రభుత్వం
సీఎం కేసీఆర్ ఆలోచన చేస్తున్నారని అన్నారు.
