`వానలో కూడా ప్రజలకు చేరువలో బిఆర్‌ఎస్ నేతలు,
https://netidhatri.com/కాంగ్రెస్-బాటలో-బిజేపి/
`వాగులు, వంకల దగ్గర సహాయ కార్యక్రమాలలో బిఆర్‌ఎస్ నాయకులు.
` సహాయక చర్యలు చేస్తున్నది అధికారపార్టీయే…
` చెరువు గట్ల మీద, ప్రాజెక్టులను పర్యవేక్షిస్తున్నదీ బిఆర్‌ఎస్ శ్రేణులే.
` ప్రజలను సహాయక సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది బిఆర్‌ఎస్ కార్యకర్తలే.
` ప్రాణాలను అడ్డుపెట్టి ఆపదలో వున్నవారికి కాపాడుతోంది బిఆర్‌ఎస్ పార్టీ సైనికులే.
`ఆరోపణలు చేయడానికి మాత్రమే ప్రతిపక్షాలు.
` ప్రభుత్వానికి సహకరించాల్సింది పోయి, విమర్శలు.
` సోషల్ మీడియా లో అసత్య ప్రచారాలు.
`అంసదర్భ ప్రేలాపనలు, దొంగ ఏడుపులు.
`ప్రతిపక్షాలు నలుగురికి సాయం చేసింది లేదు.
` సామాజిక బాధ్యత వారిలో అసలే లేదు.
`ఎక్కడ చూసినా బిఆర్‌ఎస్ నాయకులే…సేవకులు!
` ప్రతిపక్షాలవి సోషల్ మీడియా పోస్ట్ లు?
హైదరబాద్,నేటిధాత్రి:
విపత్తులు చెప్పి వస్తాయా? ప్రకృతి వైపరిత్యాలు ఊహించగలమా? అదే సాధ్యమైతే ఇన్ని అవస్థలెందుకు? ప్రపంచం ప్రకృతిని జయించగలదా? అదే జరిగితే ఇంత కాలం ఈ ఇబ్బందులు పడేవాళ్లమా? ప్రకృతిని ఎదిరించే పరిజ్ఞానం మనకుందా? విపత్తులను ఎదుర్కొనే శక్తి మానవుడికి వుందా? ఇవన్నీ ప్రతి పక్షాలకు తెలియందా? ఎంత సేపు రాజకీయాలు చేయాలి? రాజకీయ లబ్ధి పొందాలని చూసే ప్రతిపక్షాలున్నంత కాలం ప్రజా సేవకు కూడా ఆటంకాలే ఎదురౌతాయి. ప్రకృతి వైపరిత్యాలు ఏర్పడినప్పుడు ప్రతిపక్షాలకు బాధ్యత లేదా? కెమెరాల ముందు మైకులు పట్టుకొని మాట్లాడితేచాలా? ప్రతిపక్షాలు తమ కర్తవ్యాలను వదిలేసి వరద రాజకీయాలు, బురద రాజకీయాలు అలవాటు చేసుకున్నాయి. కనీసం బురద ప్రాంతాలు పర్యటించేందుకు కూడా ముందుకు రారు. కాని కాలు కదపకుండా చల్లగా ఇంట్లో కూర్చొని ప్రకటనలు ఇస్తుంటారు. గతంలో కనీసం మీడియా వద్దకైనా వేళ్లేవారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతిపక్షాలకు మరీ బద్దకం పెరిగిపోయింది. ఇళ్లలోనుంచి బైట అడుగుపెట్టకుండా, మీడియాలో వస్తున్న వార్తలను చూసి ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడం అలవాటు చేసుకన్నాయి. ప్రతిసారి ప్రభుత్వాన్ని విమర్శిస్తే చాలు అనుకుంటూ పొద్దు బుచ్చుకుంటున్నాయి. తమ కర్తవ్యాన్ని మాత్రం విస్మరిస్తున్నాయి. తమకే బాద్యత లేదని చెప్పకనే చెబుతున్నాయి. మరి అలాంటి ప్రతిపక్షాల మాటలను చూస్తున్న ప్రజలు చీ అంటారన్న సోయి కూడా లేకుండా ప్రవర్తిస్తున్నాయి.
వర్షాలు, వరదలు కేవలం ఒక్క తెలంగాణలోనే వచ్చాయా?
దేశ వ్యాప్తంగా పరిసి ్ధతి ఎలాగే వుందన్న సోయి కాంగ్రెస్ పార్టీకి లేదా? బిజేపికి తెలియందా? ఉత్తరాధి రాష్ట్రాలలో వచ్చిన వరదల పరిస్ధితి చూడడం లేదా? అయినా తెలంగాణలో ప్రభుత్వానికి, ప్రజల సహకరించాల్సింది పోయి, దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నాయి. ఇంత వర్షం గతంలో తెలంగాణలో ఎప్పుడైనా కురిసిందా? భూపాల పల్లి వంటి ప్రాంతాల్లో 59 సెంటీమీటర్ల వర్షం కురుస్తుందని అనుకున్నామా? తెలంగాణ వ్యాప్తంగా గతంలో ఎన్నడూ చూడని వర్షాలు అతి కొద్ది కాలంలోనే నమోదయ్యాయి. ఇలాంటి సమయంలో ప్రతిపక్షాలు సహాయం చేసే స్ధితిలో వుండాలి. ప్రతిపక్ష నాయకుల ప్రకటనలకే పరిమితమయ్యారు. ఏ ఒక్క ప్రతిపక్ష నాయకుడైనా వర్షంలో తడుస్తూ, రాత్రనక, పగలన ప్రజల్లో వున్నారా? భారీ వర్షాలు నమోదైన నాటినుంచి అధికార బిఆర్‌ఎస్‌కు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, జడ్పీటీసిలు, ఎంపిటీసిలు, సర్పంచులు, జిల్లా , మండల, గ్రామ స్దాయి నాయకులు, కార్యకర్తలు ఎక్కడికక్కడ పరిస్ధితులు పర్యవేక్షిస్తూ, ప్రజలకు సహకరిస్తూ, పనులు చక్కదిద్దుతున్నారు. అధికారులతో కలిసి పనిచేస్తున్నారు. ఇబ్బందుల్లో వున్న ప్రజలకు సేవ చేస్తున్నారు. సహయ కార్యక్రమాల్లో ముందున్నారు. ప్రజలకు ధైర్యం కల్పిస్తున్నారు. వారికి భరోసా కల్పిస్తున్నారు. అవసరమైన ఆహర పదార్ధాలు అందిస్తూ సేవల్లో నిమగ్నమైవున్నారు.
రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటిఆర్‌తో సహా మంత్రులంతా ఎక్కడిక్కడ సహాయ చర్యలు చేపడుతున్నారు.
ఉన్నతస్ధాయి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాత్రనక పగలనక దగ్గరుండి పనులు పర్యవేక్షిస్తున్నారు. ఇదంతా ప్రజలు చూస్తున్నారు. కాని ప్రతిపక్షాలు మాత్రం మొసలి కన్నీరు కారుస్తున్నాయి. భూపాల పల్లి జిల్లాలో జరిగిన విపత్తు నుంచి ప్రజలకు కాపాడుతున్న ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కోరిక మేరకు మంత్రి కేటిఆర్ హుటాహుటిన రెండు హెలికాప్టర్లు పంపించడం జరిగింది. బాధితులను కాపాడడం జరిగింది. అటు మోరంచ, ఇటు చిట్యాల మండలం నైనిపాకలో ప్రజలను కాపాడడం జరిగింది. ఇలా యుద్ద ప్రాతిపదికన సహాయ చర్యలు జరుగుతున్న తరుణంలోనే ములుగు ఎమ్మెల్యే సీతక్క ఏడుపులు, పెడబొబ్బలు పెట్టి, ప్రభుత్వంపై అబాండాలు వేయడం సమంజసమేనా? ఓవైపు హెలీకాప్టర్ సహాయ చర్యలు చేపడుతున్న సమయంలోనే ప్రభుత్వం హెలీకాప్టర్లను పంపమంటే పంపలేదని వ్యాఖ్యానించడం సరైందేనా? నిజంగా ప్రభుత్వం పట్టించుకోకపోతే విమర్శలు చేయొచ్చు. కాని ఎక్కడిక్కడ తెలంగాణ వ్యాప్తంగా జరిగిన వర్ష భీభత్సం నుంచి ఇంత త్వరగా తెలంగాణ తేరుకుంటున్నదంటే ప్రభుత్వ యంత్రాంగం, అధికార బిఆర్‌ఎస్ యంత్రాంగం చేసిన కృషి కనిపించడం లేదా?
ఒక్కసారి ఉప్పల్‌లో వెలసిన పోస్టర్లు చూడండి.
మల్కాజిగిరి ఎంపి అయిన పిసిసి. అధ్యక్షుడు ఎక్కడా అని ప్రజలే వాల్ పోస్టర్లు అతికించారు. మా ఎంపి కనిపిండచం లేదని గుర్తు చేస్తున్నారు. తన బాధ్యతను విస్మరించి, రేవంత్‌రెడ్డి కనీసం తన నియోజకవర్గంలో కూడా సహాయక చర్యలకు ఉపక్రమించలేదు. అయినా అధికార బిఆర్‌ఎస్ ఎక్కడైనా ఈ విషయం ప్రస్తావించిందా? హుందా తనంగా తన పని తాను చేసుకుపోతోంది. ఏ రాజకీయ పార్టీ అయినా సరే విపత్తులు ఎదురైనప్పుడు కలిసి, సహాయ చర్యల్లో పాలు పంచుకోవాలే, తప్ప అదును చూసి పాలి వాడి పంచాయితీలా దొరికిందే అవకాశం అనుకుంటే ప్రజలు క్షమించరు. ఇప్పటికైనా మించి పోయిందేమీ లేదు. ప్రభుత్వానికి తోడుగా ప్రతిపక్షాలు కూడా సహాయ కార్యక్రమాలలో పాల్గొని తమ బాధ్యతను నిర్వర్తిస్తే మేలు.