రేషన్ బియ్యం @ నూకల దందాపై నేటిధాత్రి చెప్పిందే నిజమైంది..

# నూకల పేరుతో రేషన్ బియ్యం వినూత్న దందా..
# రేషన్ షాపు నుండి నేరుగా లబ్దిదారుల నుండి రేషన్ బియ్యం కొనుగోళ్లు
# నూకల పేరుతో రేషన్ బియ్యం దందా కథనం గతంలో ప్రచురణ..

నర్సంపేట, నేటిధాత్రి :

నర్సంపేట డివిజన్ లో రేషన్ బియ్యం అక్రమ దందా నయా రూపంలో అవతారమెత్తింది. అక్రమ సంపాదనే ధ్యేయంగా కొందరు వ్యాపారులు గ్రామాలలో ఏజెంట్లు ఏర్పాటు
చేసుకొని రేషన్ బియ్యం కొనుగోలు చేస్తూ ఆ బియ్యం రూపురేఖలనే మార్చేస్తున్నారు. అక్రమంగా కొనుగోలు చేసిన రేషన్ బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలించేందుకు సులువుగా
ఉండేందుకు నూకలుగా మార్చుతూ నయా దందాకు తెరలేపుతున్నారు. ఈ అక్రమ నయా దందా పట్ల నర్సంపేట డివిజన్ వ్యాప్తంగా కొందరు రైస్ మిల్ వ్యాపారులు రేషన్ బియ్యాన్ని గ్రామాల్లో ఏజెంట్ల ద్వారా కొనుగోలు చేస్తూ ఈ దందాను మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారు.కాగా నేటిధాత్రి దినపత్రిక ఈ అక్రమ దందా పట్ల ముందే తెలుపగా నేడు అదే నిజం అయ్యింది.నర్సంపేట మండలంలోని గురిజాల గ్రామానికి చెందిన గోలి నర్సింగం,గోలి రవి లకు చెందిన రైస్ మిల్ లో అక్రమంగా రేషన్ బియ్యాన్ని నూకలుగా మారుస్తున్నారు.గ్రామస్థుల సమాచారం మేరకు నేటిధాత్రి ప్రతినిధి పరిశీలించగా నిజాలు బయటపడ్డాయి.ఈక్రమంలో మేము రేషన్ బియ్యం దందా ఇలాగే చేస్తాం.. పోలీసులు,టాక్స్ ఫోర్స్ అధికారులు,విలేకరులు వస్తారు వారికి మామూళ్లు ఇస్తాం వెళ్ళిపోతారు
.మీకు ఏమి కావాలి చెప్పండి అంటూ రైస్ మిల్లు
యజమాని కొందరు అనుకూల ప్రజలతో నేటిధాత్రి ప్రతినిధిపై బెదిరింపులకు పాల్పడ్డాడు.రేషన్ బియ్యం దందా డైరెక్టుగా చేయలేక నూకల పేరుతో అక్రమంగా కొనుగోళ్లు చేస్తూ నయా దందాకు తెరలేపుతున్నారని డివిజన్ వ్యాప్తంగా చర్చలు జోరుగా విన్పిస్తున్నాయి. ప్రస్తుత మార్కెట్ లో నూకల బియ్యం రేటు రూ.20 నుండి 25 రూపాయలకు పలకడంతో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఒక మాఫియాల అక్రమ వ్యాపారానికి
తెరలేపుతున్నారు.నర్సంపేట మండలంలోని గురిజాల గ్రామంలో ఉన్న రైస్ మిల్లులో రేషన్ బియ్యాన్ని నూకలుగా మారుస్తూ దందా జరుపుతుండడం పట్ల కొందరు
అధికారుల వద్ద సమాచారం ఉన్నప్పటికీ తెలిసి తెలియనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు నిజమే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

# రేషన్ షాపు నుండి నేరుగా లబ్దిదారుల నుండి రేషన్ బియ్యం కొనుగోళ్లు….

ప్రభుత్వం పేద ప్రజలకు రేషన్ షాపుల ద్వారా అందిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని లబ్ధిదారుల చేతుల్లోకి రాగానే సదరు రైస్ మిల్లు యజమాని లబ్ధిదారుల వద్ద నుండి కొనుగోళ్లు చేస్తూ ఎవ్వరికీ అనుమానం రాకుండా ఆ బియ్యాన్ని నూకలుగా మారుస్తూ దందా సాగిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఇప్పటికైనా టాస్క్ ఫోర్స్ అధికారులు, పోలీసులు, సంబంధిత సివిల్ సప్లై అధికారులు స్పందించి దాడులు నిర్వహించి అక్రమ దందాపై చర్యలు తీసుకుంటారా లేదా అనేది విచిచూడాల్సిందే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *