రేవంత్ రెడ్డి ఇంటిపై దాడి అమానుషం

టేకుమట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోటగిరి సతీశ్ గౌడ్

భూపాలపల్లి నేటిధాత్రి:
టేకుమట్ల మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు “రేవంత్ రెడ్డి ” ఇంటిపై కొంత మంది టిఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడాన్ని ఖండిస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టి కెసిఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరగింది
ఈ సందర్బంగా కోటగిరి సతీశ్ మాట్లడుతూ
రేవంత్ రెడ్డి ఇంటి పై దాడి అప్రజాస్వామికం కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోతే ఏ ఒక్కరు కూడా మిగలరు . ప్రజాస్వామ్య బద్దంగా పోరాడితే అప్రజాస్వామికంగా దాడి చేస్తారా
ప్రజాస్వామ్య బద్దంగా పోరాడడమే కాంగ్రెస్ పార్టీ సంస్రృతి
టీఆర్ఎస్ కార్యకర్తల గుండాగిరికి భయపడలేదు
ఉద్యమ సమయంలో కాంగ్రెస్ తలుచుకుంటే ఏ ఒక్క టీఆర్ఎస్ కార్యకర్త మిగిటుండేది కాదు
కాంగ్రెస్ దమ్మేంటో ఎన్నికల్లో చూపిస్తాం లేదంటే ఇప్పుడే ఎన్నికలు పెట్టండి
| తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రజాస్వామ్య బద్దంగా పోరాడుతున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటిపై టీఆర్ఎస్ గుండాలు అప్రజాస్వామికంగా దాడిచేయడం సిగ్గుచేటుగా ఉందని, తెలంగాణ రాష్ట్ర సాదనలో భాగంగా జరుగిన ఉద్యమ సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు తలుచుకుంటే టీఆర్ఎస్ పార్టీలో ఒక్క కార్యకర్త కూడా మిగిలి ఉండేవారు కారని దూయబట్టారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలపై ప్రజాస్వామ్య బద్ధంగా న్యాయం జరగాలని పోరాడుతున్న రేవంత్ రెడ్డిపై పెరుగుతున్న ఆధరణ చూసి ఓర్వలేక, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావ్, అతని తనయుడు కల్వకుంట్ల తారకరామారావ్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటిపై దాడికి దించారని ఇంతటి అన్యాయానికి ఒడిగట్టిన పాపం ఊరికేనే పోదని అన్నారు.- టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రతిపక్ష నేతలపై విరుచకపడి దాడీలు చేయడమే ముఖ్యమనుంకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దాడీ ఏంటో చూపించక మానదని అన్నారు కార్యక్రమాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. రాష్ట్రాన్ని ఏలడం కాదు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలనే దృక్పదంతో కాగ్రెస్ పార్టీ పోరాడుతుంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మింగుడుపడక అప్రజాస్వామిక కార్యక్రమాలు చేస్తున్నారని ఇందుకుగా కాంగ్రెస్ కార్యకర్తలు తిరుగు దాడి చేస్తే ఎందుకు పనికి రాకుండా పోతారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి వైనాల రవీందర్. జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బండ శ్రీకాంత్. సోషల్ మీడియా స్టేట్ వైస్ చైర్మన్ యాంసాని నాగరాజు. బ్లాక్ కాంగ్రెస్ సభ్యులు నాంపల్లి వీరేశం. బొంపల్లి రవీందర్. గొల్లపల్లి వెంకన్న. బోల్లికొండ చిన్న రాజయ్య. శాస్త్రాల సుధాకర్. బిక్కిన సంపత్ రావు. శ్రీను.ఖాదర్.కిట్టు. దుగ్యాల రమేష్. బొల్లి పైడి. యువజన కాంగ్రెస్ నాయకులు రెడ్డి రాజుల రాజు. మచ్చ ప్రభాకర్. అడగని వీర గోపాల్. పండుగ రమణ. సుధాకర్. పంజాల వెంకటేష్. గజ్జి రాజేందర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *