రావు ప్రొడక్షన్స్‌?

అటు సురేష్‌?ఇటు నరేష్‌!?
మధ్యలో క్లర్కులు?
కరీంనగర్‌ ఆర్వోలో అవినీతి లీలలు?
అంతా రావే చేశాడు?
ద్విపాత్రాభినయంతో దోచేశాడు?
అధికారి ఆయనే…విచారణాధి అతేనే! ఇంకేముంది!?
ఊరవతల కార్యాలయం….సోకులకు సోపానం?
అన్ని అవలక్షణాలు ఆయన సొంతం?
అయ్యవారి సేవలో పాత్రదారులు?
ఆటలో అరటి పండ్లు వెండర్లు?
నా ఆటచూడు, పాట చూడు…నాటు…నాటు….????
రిజిస్ట్రేషన్ల శాఖలో సన్యాసం తీసుకొన్న వ్యక్తికి ఉద్యోగమిస్తే, నాలుగు రోజుల్లో సంసారిని చేస్తారని ఓ సామెత. ఇది చాలా సుతిమెత్తగా చెప్పడానికి పత్రికాభాషలో చెప్పిన మాట. అంటే ఏమిటో ఇప్పటికే అందరకీ అర్ధమైవుంటుంది. ఆ మాట ఎవరో కాదు, ఆ శాఖ పనితీరును చూసిన పెద్ద పెద్ద వాళ్లే అన్నమాటనట! నాలుగు రోజుల్లో నీతి మంతుణ్ణి అవినీతికి కేఆరాఫ్‌ అడ్రస్‌ చేసేస్తారని అంటారు. ఇది నిజమే అన్నట్లు కరీంనగర్‌ జిల్లా ఆర్వోలో తవ్విన కొద్ది అవినీతి మూలాలు బైటపడుతున్నాయి. చిన్న చేపలే అనుకంటే, తిమింగలాలు, వాటిని ఆడిరచి, ఆరగంచుకునే అనకొండలు కూడా వెలుగు చూస్తున్నాయి. అసలు వింటుంటే మైండ్‌ బ్లాంక్‌ అవ్వాల్సిందే. కాదేదీ అవినీతికనర్షం అన్నంతగా వారు ఎంచుకునే విధానాలు, అనుసరించే మార్గాలు, సృష్టికే ప్రతిసృష్టిలాగా అన్నీ తయారు చేయగలరు. అన్నీ మింగేయగలరు. మొత్తం ఖజానాకే బొక్క పెట్టగలరని నిరూపిస్తూ వస్తున్నారు. అయినా వారు చిక్కరు…దొరకరు…కారణం ఏమిటో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు…చదవండి…
మంత్రాంగం నడిపేవారి చేతిలో యంత్రాంగం వుంటే, అడమన్నట్లు ఆడేందుకు సిద్ధంగా అనుచరులు వుంటే, కనిపించిన సొమ్మును చూసి జేబులో మడుకునే అలవాటున్నవారంతా ఒక్కచోట చేరితే ఎలా వుంటుంది? ఒక్కసారి ఆలోచించండి. అదలా వుంటే కింది స్ధాయి వాళ్లు చేసే పనులను చూసీ చూడనట్లు, వారి అడుగులకు మడుగులొత్తే అధికారులు తోడైతే ఇక అవినీతికి అడ్డూ అదుపు వుంటుందా? అంతుంటుందా? నీకు నేను రక్ష, నాకు నువ్వు రక్ష..ఇంతే ఇంకేముంది దాచుకో, దోచుకో…కాలం గడిస్తే చాల గాయం మాయమైపోతుంది. చేసిన తప్పులు మర్చిపోతారు. కొత్తకొత్త వాటిని ఎంచుకోవచ్చు. జనం సొమ్ము ఊదేసుకోవచ్చు. కోట్లుకు కోట్లు దిగమింగేయొచ్చు. అడిగేవారు ఎవరు? అడ్డుకునేవారు ఎవరు? అంతా మాయా…మశ్చీంద్రా…కింది స్ధాయి వారిని పై స్ధాయి వాళ్లు చేతిలో పెట్టుకుంటారు. పై స్ధాయి వాళ్లు కింది స్ధాయి వారికి సహకరిస్తూ వుంటారు. ఇంకేముంది వాళ్లు ఆడిరది ఆట…పాడిరది పాట…సుఖం…సౌఖ్యం…బహువిధాల లాభం…ఇంకేమింకేం కావాలే…అనుకుంటూ పాడుకోవడం తప్ప…
పాత్రదారులు, సూత్రదారులు అంతా కలిసి ఆర్వో శాఖ ఆదాయాన్ని కొల్లగొడుతున్నారు. కోట్లకు కోట్లు ఉద్యోగులు కొల్లగొడుతున్నారు. కింది నుంచి పై స్ధాయిదాకా వాటాలు పంచుకుంటున్నారు. దొంగలుగా ముద్ర పడాల్సినచోట దొరలుగా వెలుగొందుతున్నారు. ఇతరులను బలిచేస్తున్నారు. వండే దగ్గర, వడ్డించే దగ్గర ఒక్కడే వుంటే ఏం చేస్తాడు? వండిరదాట్లో వాడే సగం మింగేస్తాడు…ఇదే ఇక్కడ ఆర్వోలో ఉన్నతాధికారులు అనుసరిస్తున్న బాట అని ఆ శాఖలో చాలా మంది అంటున్నమాట. ఆ మాటలను నిజం చేస్తూ జనం సొమ్ము కొల్లగొడుతున్నారన్న మాటలే సర్వత్రా వినిపిస్తున్న మాట. అక్కడా వాళ్లే, ఇక్కడా వాల్లే కూర్చొని ప్రభుత్వ సొమ్ము మేసేస్తున్నారు. దగ్గరుండి ప్రభుత్వాదాయాన్ని జేబుల్లో నింపుకుంటున్నారు. ఖజానా ఖాళీ చేస్తున్నారు.
ఆడ వుంటా…ఈడ వుంటా…?: పాత్రదారి, సూత్రదారి ఒక్కడే అయితే మంత్రమైనా, యంత్రమైనా ఒక్కటే…ఇదే సర్వరోగ నివారణి. ఉద్యోగుల కొరత పేరుతో పెత్తనమంతా ఒక్కరికే అప్పగిస్తే ఇలాగే వుంటుంది. ఉమ్మడి జిల్లాలకు చెందిన శాఖ పెద్దలకు అన్నీ బాధ్యతలు అప్పగించడంతో, తాళం పగలగొట్టించడం, తాళం వేయించడం ఒక్కరే చేస్తే, గదిలో మాయమైనదేమిటో చెప్పడం ఈశ్వరుడికి కూడా సాధ్యం కాదు. ఇదే అనువుగా 2015 వరకు కరీంనగర్‌ జిల్లా ఆర్వో బాధ్యులైన రమణారావు ఆడి, ఆడిరచిన ఆటలు కథలు, కథలుగా చెప్పుకుంటున్నారు. బాధితులు బోరున విలపిస్తున్నారు. ఆ కుర్చీలో కూర్చున్న రమణారావు తన కనుసన్నల్లోనే అంతా కానిచ్చి, ఉద్యోగులైన సురేష్‌, నరేష్‌తోపాటు మరో ఇద్దరు మహిళా క్లర్క్‌లతో కోటికి పైగా ఆ రోజుల్లోనే అప్పనంగా నొక్కేసి, ఖజానాకు కన్నం పెట్టాదన్నది ప్రధాన ఆరోపణ. ఇందుకు ఎలాంటి సంబంధం లేని వెండర్లను బలి చేసిశారని ప్రధాన ఆరోపణ. ఎడమ, కుడి భుజాలుగా పనిచేసిన సురేష్‌, నేరేష్‌లకు అండగా నిలిచి, ఇతర క్లర్కులతో లక్షలకు లక్షలు మాయం చేసినట్లు తెలుస్తోంది.
సురేష్‌ కథ వెలుగులోకి…?: సురేష్‌ అనే వ్యక్తి చేసిన అవినీతి బైటపడిరది. కాని రమణారావు ఎంతో చాకచక్యంగా సురేష్‌ తప్పేం లేదన్నట్లుగా రిపోర్టు తయారు చేసి, తప్పంతా వెండర్లదన్నాడు. అది నిజం చేయాలంటే వెండర్లు తప్పంతా తమదే అనాలి. వెంటనే సురేష్‌ వెండర్లనుంచి రాతపూర్వక హమీ పత్రాలు సేకరించే పనిలో పడ్డాడు. ముగ్గురు వెండర్లనుంచి నయానో, భయానో తీసుకోవాలనుకున్నారు. కాని ఇద్దరే సంతకాలు చేశారు. తప్పంతా తమదే అన్నారు. కాని ఒక వెండర్‌ మాత్రం చేయని తప్పుకు నేనెందుకు బాధ్యత వహిస్తాను? దోషిని ఎందుకౌతాను? నేరం చేయకుండా ఎందుకు శిక్ష అనుభవిస్తాను? అసలు నేను చేసిన నేరమేమిటి? అంటూ నిలదీశాడు. ఈ విషయం రమణారావు దాకాచేరింది. సదరు వెండర్‌ను పిలిచి సురేష్‌ తప్పు చేస్తే, అదే రోజు నాకెందుకు చెప్పలేదని బెదిరించే ప్రయత్నం రమణారావు చేశారు. సహజంగా ఉన్నతోద్యోగులంటే సామన్యులకు కొంత భయం వుంటుంది. వారి ముందు మాట్లాడాలంటే బెరుకుంటుంది. ఎలాగైనా సదరు వెండర్‌ భయపడతాడని రమణారావు ఆశించాడు. వెండర్‌ అడ్డం తిరిగాడు. ఆ సమయంలో కుర్చీలో వున్నది మీరు లేరన్నాడు. ఇంకేముంది రమణారావుకు మైండ్‌ బ్లాంక్‌ అయ్యింది. దాంతో ఎలాగైనా సదరు వెండర్లపై కేసు నమోదు చేస్తే తప్ప సురేష్‌ ఈ కేసునుంచి బైట పడడం జరగదని గ్రహించారు. కరీంనగర్‌ వన్‌ టౌన్‌ సిఐకితో కేసు నమోదు చేయించాలని చూశారు. కాని ఆనాటి సిఐ అడిగిన ప్రశ్నలకు తిరిగి రమణారావు, సురేష్‌లక దిమ్మ తిరిగింది. ఇక ఇక్కడ కుదిరే పని కాదని త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేయించారు. అయినా సురేష్‌ మీద కేసు నమోదు కాక తప్పలేదు. కాకపోతే రమణారావు తన శక్తియుక్తులన్నీ ఉపయోగించి సురేష్‌ను కాపాడడం జరిగింది. వెండర్లను నానా తిప్పల పాలు చేయడం జరిగింది. అయితే అటు కేసు కోర్టులో నడుస్తుండగానే సురేష్‌కు ప్రమోషన్‌ కూడా కల్పించిన ఘనత కూడా రమణారావుకే దక్కింది. కాలం కాస్త గడిచింది. సురేష్‌ ప్రమోషన్‌ మీద వెళ్లడంతో ఆ స్ధానంలోకి వచ్చిన మహిళా క్లర్క్‌, ఆమెకు అసిస్టెంట్‌తో కలిసి, రమణారావు సుమారు 90లక్షలకు పైగా స్టాంపుల గోల్‌ మాల్‌ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సురేష్‌ వ్యవహారంలో రికవరీ జరిగింది. కాని మహిళా క్లర్క్‌లతో, స్టాంపుల మాయాజాలం చేయించిన రమణారావే విచారణ అధికారి కావడంతో అవి బైటకు రాకుండా చూసుకున్నారు. ఇంతలో రిటైర్డ్‌ అయి చేసిన తప్పులపై ఎలాంటి విచారణ లేకుండా చూసుకున్నారు.
విచారణ వ్యవస్ధ లేదా?: ఎందుకు లేదు. ఖర్మకాలి ఆ శాఖలో ఎవరైతే ఉన్నతాధికారో, అతనే విచారణ అధికారి కావడం ఆయనే రమణారావు కావడం కాలం కలిసొచ్చింది. సొమ్ముకు కాళ్లొచ్చేలా చేసి, ఆయన జేబులోకి వచ్చేలా మార్గం పడిరది. అయితే రమణారావు లీలలు ఇవే కాకుండా, ఆయన ఉమ్మడి రాష్ట్రంలో మరో మూడు ఉమ్మడి జిల్లాలకు కూడా జిల్లా రిజిస్ట్రార్‌గా తాత్కాలిక విధులు నిర్వర్తించడం అన్నది ఆయనకు బాగా కలిసివచ్చింటారు. ఇక ఆయన అవినీతి ఊడలు ఆదిలాబాద్‌ నుంచి వరంగల్‌ దాకా పాతుకుపోయాయని చెబుతున్నారు. ఒక్క కరీంనగర్‌ జిల్లాలోనే ఇంత జరిగితే, ఆయన అదనపు విధులు నిర్వర్తించిన మిగతా జిల్లాలనుంచి కూడా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.
పాపం వెండర్లు?: ఎలాంటి తప్పు చేయకపోయినా సమిధలైపోయిన వెండర్ల పరిస్ధితి పెనం నుంచి పొయ్యిలో పడేలా మరో ఉపద్రవం వచ్చి పడిరది. స్టాంపు వెండర్లు ముగ్గురు తాము ఎలాంటి తప్పు చేయలేదని ఏ లాయర్‌ ద్వారా నిరూపించుకుంటున్నారో…అదే లాయర్‌ దగ్గరకు కూడా తనకు న్యాయం చేయాలని కోరుతూ, ఆ కేసు నుంచి విముక్తి కోసం సురేష్‌ కూడా అదే లాయర్‌ను సంప్రదించడం జరిగింది. ఆయన కేసు టేకప్‌ చేయడం కూడా జరిగింది. ఇది సినిమాలో చూస్తుంటాము. ఇక ఇప్పుడు ఇక్కడే చూస్తున్నాము. నైతికంగా లాయర్‌కూడా అలా చేయొద్దు…కాని వృత్తిపరంగా అది కూడా తనకు ఛాలెంజ్‌ అనకున్నారో ఏమోగాని ఆ కేసు సాగుతోంది…
రమణరావే సూత్ర, దారి పాత్రదారి?: పూజారే ప్రసాదం ఆరగిస్తే భక్తులకు ఏం మిగులుతుంది అన్నట్లు. ప్రజా ధనం ఇలా ఉన్నతాధికారులు ఊదేస్తూ, మిగిలినవి ఉద్యోగులకు పంచుతూ పోతుంటే ఖజానా నిండేదెప్పటికీ? జనం చెల్లిస్తున్న సొమ్ముకు న్యాయం జరిగేదప్పటికీ? ఏది ఏమైనా కరీంనగర్‌ ఆర్వోలో గతంలో జరిగిన ఈ మొత్తం వ్యహారం పూర్తి స్ధాయిలో వెలుగులోకి రావాల్సివుంది. జనం సొమ్ము తిన్నవాళ్లు కక్కాల్సివుంది. అమాయకులైన స్టాంపు వెండర్లకు న్యాయం జరగాల్సివుంది. అటు ఆర్ధికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా, సమాజ పరంగా వారు కోల్పోయిన పరపతి రావాలంటే వారు తప్పు చేయలేదని నిరూపన కావాలి. అయినా సినిమా కోసం క్యూ లో నిలబడి టిక్కెట్టు కొనుక్కునేవాడికి టెక్కెట్టు కావాలే గాని, అది ఎలా వచ్చిందన్నది అవసరంలేదు. అయితే వెండర్‌గా ఆర్వో కార్యాలయం నుంచి స్టాంపు పేపర్లు కావాలే గాని, అధికారులు ఎలా ఇచ్చారన్నది తెలుసుకోవాల్సిన పనిలేదు. ఇంతే ఇది సింపుల్‌…కాని వెండర్ల చీటి చిరిగింది. చిరిగి చాటంతై, సాపంతైంది. బతుకంతా తొర్రైంది. శాఖ పెద్దలారా? ఒక్కసారి అటు వైపు చూడండి. నిజా నిజాలు తెలుసుకోండి. అమాయకులను కాపాడంది. ఖజానాకు పడిన బొక్కను పూడ్చండి. అవినీతి అధికారులు మెక్కింది కక్కించండి..అని ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *